News August 16, 2024

ALERT: ఇయర్ ఫోన్స్ ఎంతసేపు వాడుతున్నారు?

image

ఇయర్ ఫోన్స్ అతి వాడకంతో వినికిడిలోపం ఏర్పడే ప్రమాదం ఉందని US ఆస్టియోపతిక్ అసోసియేషన్ వెల్లడించింది. ఇయర్ ఫోన్స్‌ నుంచి 60% సౌండ్ మాత్రమే వినాలని, అది కూడా రోజుకు 60ని.లకు మించవద్దంది. 100% వాల్యూమ్‌తో అయితే 5ని.లకు మించి వాడవద్దని చెబుతోంది. ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్, బ్లూటూత్ వంటివి కర్ణభేరికి అతి దగ్గరగా ఉంటాయి. వీటి వల్ల వినికిడి సమస్యలతో పాటు చెవిలోకి ఫంగస్, బాక్టీరియాలు చేరే ప్రమాదం ఉంటుంది.

News August 16, 2024

ఓలా.. అదిరిపోలా: 20% అప్పర్ సర్క్యూట్

image

స్టాక్ మార్కెట్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు అదరగొడుతున్నాయి. HSBC బయ్ రేటింగ్ ఇవ్వడంతో నేడు 20% అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. క్రితం సెషన్లో రూ.110 వద్ద ముగిసిన షేర్లు శుక్రవారం రూ.121 వద్ద మొదలయ్యాయి. క్రమంగా పెరిగి రూ.21.18 లాభంతో రూ.133.08 వద్ద అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయ్యాయి. ఐపీవో ధర రూ.76తో పోలిస్తే ప్రస్తుతం 75.11% లాభపడ్డాయి.

News August 16, 2024

స్వర్ణాంధ్రప్రదేశ్-2047 కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌: CM CBN

image

AP: స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనికి టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కో-ఛైర్‌గా ఉంటారని తెలిపారు. ఇందులో మేధావులు, పరిశ్రమల ప్రముఖులు సభ్యులుగా ఉండనున్నారు. చంద్రశేఖరన్‌తో సీఎం తాజాగా భేటీ అయ్యారు. అమరావతిలో CII ఏర్పాటు చేయనున్న GLCలో భాగస్వామిగా ఉండేందుకు టాటా అంగీకరించిందని తెలిపారు.

News August 16, 2024

బెంగాల్ యంత్రాంగంపై హైకోర్టు మొట్టికాయలు

image

RGకర్ ఆస్పత్రిపై మూకదాడిని ఆపడంలోరాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైందని కలకత్తా హైకోర్టు సీరియస్ అయింది. ప్రాంగణం వద్ద 7000 మంది గుమిగూడారని, బారికేడ్లు దాటుకొని వచ్చారని పోలీసులు చెప్పగా.. ఘటనను ఎందుకు అంచనా వేయలేదని, 144 సెక్షన్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించింది. ఘటన పూర్వాపరాలపై 2 వేర్వేరు అఫిడవిట్లు సమర్పించాలని ఆస్పత్రి ఇన్‌ఛార్జ్‌ను ఆదేశించింది. తర్వాతి విచారణకు వైద్య నేతలు రావాలని సూచించింది.

News August 16, 2024

రేపే ‘ప్రభాస్-హను’ మూవీ ప్రారంభం!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించనున్న సినిమా పూజా కార్యక్రమం రేపు జరగనున్నట్లు సినీవర్గాలు వెల్లడించాయి. ఎల్లుండి నుంచి షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలిపాయి. మూడు వారాల పాటు షూటింగ్ కొనసాగుతుందని చెబుతున్నాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ మూవీలో నటిస్తున్నారు. కాగా సలార్-2, కల్కి-2, స్పిరిట్ సినిమాలు స్టార్ట్ చేయాల్సి ఉంది.

News August 16, 2024

సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలి: కేటీఆర్

image

TG: రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ దుయ్యబట్టారు. ఈ వ్యవహారంలో రైతులను మోసం చేసినందుకు రేవంత్‌పై చీటింగ్ కేసు పెట్టాలన్నారు. CM మాటలు చూస్తే మానసిక పరిస్థితి మీద అనుమానం కలుగుతోందని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమైనా కుటుంబ సభ్యులు ఆయన్ను సరిగ్గా చూసుకోవాలని కోరారు. రేవంత్ కుటుంబ పాలన బ్రహ్మాండంగా సాగుతోందని విమర్శించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని హితవు పలికారు.

News August 16, 2024

వరుస సెలవులు.. ప్రయాణికులకు GOOD NEWS

image

వరుస సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారి కోసం <>దక్షిణ మధ్య రైల్వే<<>> ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. ఇవాళ్టి నుంచి 19వ తేదీ వరకు సికింద్రాబాద్-నర్సాపూర్, కాకినాడ-సికింద్రాబాద్, కాచిగూడ-తిరుపతి మార్గాల్లో ఈ రైళ్లు నడుస్తాయని వెల్లడించింది. ఆ రైళ్ల వివరాలను పైన ఫొటోలో చూడొచ్చు.

News August 16, 2024

రేవంత్ ఢిల్లీ పర్యటనపై కేటీఆర్ సెటైర్లు

image

TG: రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు జరుగుతుంటే CM రేవంత్ రెడ్డి మాటిమాటికీ ఢిల్లీ వెళ్తున్నారని మాజీ మంత్రి KTR విమర్శించారు. ‘ఇప్పటివరకు 19సార్లు CM ఢిల్లీ వెళ్లారు. నాకు తెలిసి ఇదో రికార్డ్. KCR తన పదేళ్ల పాలనలో ఇన్నిసార్లు పోయినట్లు లేదు. పాపం ఈయన ఇంకెన్నిసార్లు వెళ్లాలో?’ అని సెటైర్ వేశారు. ప్రభుత్వ టీచర్లను పట్టుకొని CM స్థాయి వ్యక్తి ఇంటర్, డిగ్రీ ఫెయిలైనవాళ్లు అని మాట్లాడటం సరికాదని మండిపడ్డారు.

News August 16, 2024

సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

image

TG: సీఎం రేవంత్ మాటలు చూస్తే ఆయన చిరాకులో ఉన్నట్లు అర్థమవుతోందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం చెప్పేవరకు భాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందని తమకు తెలియదని సెటైర్లు వేశారు. కొడంగల్‌లో అయినా, వేరే ఏ ఊర్లోనైనా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందని చెబితే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. దీనిపై సీఎం మీడియా చర్చకు రావాలన్నారు.

News August 16, 2024

‘దమ్ముంటే రాజీనామా చెయ్ హరీశ్’.. ఫ్లెక్సీల కలకలం

image

హరీశ్ రావు రాజీనామా చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయిన క్రమంలో HYDలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ‘దమ్ముంటే రాజీనామా చెయ్.. రుణమాఫీ అయిపోయే.. నీ రాజీనామా ఏడబోయే.. అగ్గిపెట్ట హరీశ్ రావు’ అని ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. మైనంపల్లి అభిమానుల పేరిట వీటిని ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్, పంజాగుట్టలో ఇవి దర్శనమిస్తున్నాయి.