India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే సన్నబియ్యం రద్దవుతాయని సీఎం రేవంత్ ప్రజలను బెదిరిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బెదిరింపు రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. సన్నబియ్యం స్కీమ్ కేంద్రానిదని, కేజీకి మోదీ సర్కారు రూ.42 ఇస్తే, రాష్ట్రం వాటా రూ.15 మాత్రమే అని పేర్కొన్నారు.

ప్రముఖ స్పానిష్ పాప్ సింగర్, గ్రామీ అవార్డు విజేత ఎన్రిక్ ఇగ్లేసియాస్ ఇటీవల ముంబైలో నిర్వహించిన లైవ్ కాన్సర్ట్‌లో దొంగలు చేతివాటం చూపించారు. రూ.23.85 లక్షల విలువైన 73 ఫోన్లను కొట్టేశారు. ఈ విషయంపై ఇప్పటి వరకు 7 FIRలు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. గత బుధవారం ముంబైలోని MMRDA గ్రౌండులో జరిగిన ఈ కాన్సర్ట్ ఎంట్రీకి మినిమం టికెట్ ధర రూ.7వేలు. 25వేల మందికి పైగా హాజరయ్యారు.

వ్యవసాయంలో చీడపీడల నివారణలో క్రిమి సంహారక గుణాలు కలిగిన వేప ఉత్పత్తులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వేప నుంచి తయారయ్యే పదార్థాల్లో వేపపిండి, వేప నూనె ముఖ్యమైనవి. వేపనూనె, వేప గింజల కషాయాన్ని ఫార్ములేషన్స్, సస్యరక్షణలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నత్రజని ఎరువుల వినియోగ సామర్థ్యాన్నిపెంచడం, నులిపురుగుల నియంత్రణ, భూమి ద్వారా వ్యాపించే తెగుళ్ల కట్టడి, చీడపురుగుల నియంత్రణకు వేప పిండి ఉపయోగపడుతోంది.

డా. YSR హార్టికల్చర్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 6 టీచింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. హార్టికల్చర్, ఎంటమాలజీ, ఎక్స్‌టెన్షన్, స్టాటిస్టిక్స్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్ విభాగంలో పోస్టులు ఉన్నాయి. PhD, BSc(హానర్స్) హార్టికల్చర్ లేదా BVSc, MSc(అగ్రి./MVSc), MSc/MA, BA/BSc ఉత్తీర్ణతతో పాటు నెట్/సెట్ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 4న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వెబ్‌సైట్: https://drysrhu.ap.gov.in/

కార్తీకమంతా పండుగే. అందులో శుక్లపక్ష ద్వాదశిని ‘క్షీరాబ్ది ద్వాదశి’గా జరుపుకొంటారు. ఇది దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని చిలికిన రోజుగా చెబుతారు. విష్ణువు యోగ నిద్రలో నుంచి లేచి, ఆ మరుసటి రోజున లక్ష్మీదేవితో బృందావనానికి వచ్చి, తులసి మాతను దామోదరుడి రూపంలో వివాహం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే నేడు తులసి పూజలు చేస్తే.. ఆ దేవతల అనుగ్రహం లభిస్తుందని, లక్ష్మీ కటాక్షం ఉంటుందని అంటారు.

బిహార్ ఎన్నికల వేళ లాలూ పెద్ద కుమారుడు, JJD చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ శత్రుత్వంతో తనపై హత్యాయత్నం జరిగే అవకాశం ఉందన్నారు. తనకు ప్రాణభయం ఉందని, భద్రత మరింత పెంచాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు. ఇటీవల దుండగుల కాల్పుల్లో జన్‌సురాజ్ కార్యకర్త మరణించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కుటుంబ విభేదాల నేపథ్యంలో తేజ్ ప్రతాప్‌ను RJD నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.

రోమీతా బుందేలాకు చిన్నప్పటి నుంచే నీళ్లంటే ఇష్టం. నేవీలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు. చివరికి ఎలక్ట్రో టెక్నికల్ ఆఫీసర్ కోర్సు కనిపించింది. షిప్‌లో పవర్ మేనేజ్‌మెంట్ చెయ్యడం ప్రధాన విధి. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఆ కోర్సు పూర్తి చేశారు. నీళ్ల మధ్యలో నెలల తరబడి సముద్రంలో ఉండాల్సి వచ్చేది. విపరీతమైన ఒత్తిడి. వాటిని దాటి ఎన్నో పదోన్నతులు పొంది ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తినిస్తున్నారు.

దేశవ్యాప్తంగా నిర్వహించిన సీఏ ఫైనల్, ఇంటర్మీడియెట్, ఫౌండేషన్ పరీక్షల ఫలితాలను ICAI రేపు విడుదల చేయనుంది. సీఏ ఫైనల్, ఇంటర్మీడియెట్ రిజల్ట్స్ 2PMకు, ఫౌండేషన్ లెవెల్ ఎగ్జామ్స్ ఫలితాలు 5PMకు రిలీజవుతాయి. https://www.icai.org/లో రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి స్కోర్‌ను తెలుసుకోవచ్చు. సెప్టెంబర్ 3-22 మధ్య ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

మహిళలకు అలంకారం, ఆభరణాలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. మార్కెట్లోకి లేటెస్ట్‌గా ఏ నగ వచ్చినా సరే కొనేయాల్సిందే. అయితే వాటిని సరిగ్గా భద్రపరచకపోతే కొన్నాళ్లకు రంగుమారి పాడైపోతాయి. ఇలాకాకుండా ఉండాలంటే..ఆభరణాలు భద్రపరిచే ముందు శుభ్రంగా ఆరబెట్టిన తర్వాతే బాక్సుల్లో సర్దాలి. అన్నిరకాల నగలను ఒకే బాక్సులో పెట్టకూడదు. దేనికవే విడివిడిగా పెట్టాలి. ఎయిర్‌టైట్ బాక్సులు, జిప్ లాక్ బ్యాగులు వాడటం ఉత్తమం.

టీమ్ ఇండియాతో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా 186/6 రన్స్ చేసింది. టిమ్ డేవిడ్ (38 బంతుల్లో 74), స్టాయినిస్ (39 బంతుల్లో 64) వీరవిహారం చేశారు. వీరిద్దరూ కలిసి 7 సిక్సర్లు, 16 ఫోర్లు బాదారు. చివర్లో షార్ట్ (26*) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, వరుణ్ 2, దూబే 1 వికెట్ తీశారు.
Sorry, no posts matched your criteria.