News August 14, 2024

తెలంగాణ నుంచి సమర్థుడు లేడా: కేటీఆర్

image

TG: రాజ్యసభకు నామినేట్ చేసేందుకు సమర్థుడైన వ్యక్తి తెలంగాణ నుంచి లేరా అని కాంగ్రెస్‌ను మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘సింఘ్వీపైన గౌరవం ఉన్నప్పటికీ ఆయనలాగే మాట తీసుకున్న అభ్యర్థులు ఎందరో ఉన్నారు. ఏదేమైనా ఈ విషయంలో ఢిల్లీ బాసులదే అంతిమ నిర్ణయం. తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు తమను ఆడించే నేతలకు కట్టుబడి ఉన్నారు’ అని పేర్కొన్నారు.

News August 14, 2024

జూనియర్ NTR కాదు.. Mr.NTR!

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ట్యాగ్‌లైన్‌ను మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఆయన అభిమానులు Jr.NTR అని సంబోధించేవారు. కానీ, ఆయన టీమ్ అఫీషియల్ స్టేట్‌మెంట్‌లో Mr.NTR అని పేర్కొంది. 40+ ఏళ్లు దాటినప్పటికీ ఇంకా జూనియర్ ట్యాగ్‌లైన్ ఎందుకని, పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు వచ్చిందని ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. NTR అనేది ఓ బ్రాండ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

News August 14, 2024

స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు గెజిట్ జారీ

image

TG: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీ
ఏర్పాటుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఇటీవల రంగారెడ్డిలోని మీర్‌ఖాన్ పేట్‌లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన చేశారు. 17 కోర్సుల్లో ఏటా 20 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నారు.

News August 14, 2024

రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ REVIEW&RATING

image

నిజాయితీ గల IT ఆఫీసర్ వ్యవస్థను ఎదుర్కొని ఏం చేయగలడనేది ‘మిస్టర్ బచ్చన్’ స్టోరీ. రవితేజ ఎనర్జీ, హీరోయిన్ గ్లామర్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఫస్టాఫ్ హుషారుగా సాగుతుంది. మ్యూజిక్, సత్య కామెడీ, హీరో సిద్ధూ కనిపించే సీన్లు ఆకట్టుకుంటాయి. సెకండాఫ్ వచ్చేసరికి డైరెక్టర్ హరీశ్ శంకర్ డీలాపడ్డారు. సాగదీత, ఊహించే సీన్లు, ట్విస్టులు లేకపోవడం, పాత చింతకాయ పచ్చడి లాంటి స్టోరీ ఇబ్బంది పెడతాయి.
RATING: 2.5/5

News August 14, 2024

అభిషేక్ మ‌ను సింఘ్వీనే ఎందుకు?

image

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో అభిషేక్ మ‌ను సింఘ్వీ ఓడిపోయినా కాంగ్రెస్ అయనకు మ‌ళ్లీ అవకాశం ఇచ్చింది. సింఘ్వీ ప్రముఖ న్యాయవాది. పార్టీకి సంబంధించిన న్యాయ‌ప‌ర‌మైన అంశాల‌ను ఆయ‌నే చూసుకుంటారు. క‌పిల్ సిబ‌ల్ కాంగ్రెస్‌ను వీడడంతో పార్టీలో న్యాయ నిపుణుల లోటు ఏర్పడింది. దీంతో పార్టీకి సింఘ్వీ అవసరం చాలా ఉండడంతో మళ్లీ తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిత్వం దక్కినట్టు తెలుస్తోంది.

News August 14, 2024

జగన్ తప్పిదాలతోనే ఆరోగ్యశ్రీ బకాయిలు: మంత్రి సత్యకుమార్

image

AP: ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో పాలన గాడిలో పడుతోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. జగన్ తప్పిదాలతోనే ఆరోగ్యశ్రీ నిధులు బకాయిలు పడ్డాయని విమర్శించారు. తాము 2 నెలల్లోనే ఆస్పత్రులకు బకాయిలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కోల్‌కతాలో డాక్టర్ హత్య ఘటనను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్యుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News August 14, 2024

పౌర సేవలకు ఒక యాప్: చంద్రబాబు

image

AP: పౌరులకు అవసరమైన సేవలన్నీ ఒక యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టాలని ఐటీ శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాన్ని స్టార్టప్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు. సైబర్ సెక్యూరిటీకి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలన్నారు.

News August 14, 2024

మీ కోసం ఉన్నదంతా పెట్టేస్తా: రామ్ పోతినేని

image

రేపు ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో అభిమానులను ఉద్దేశించి హీరో రామ్ పోతినేని ట్వీట్ చేశారు. ‘చేతనైనంతా.. కుదిరినంతా.. వీలైనంతా.. కాదు. మీ కోసం ఎప్పుడూ ఉన్నదంతా పెట్టేస్తా. సినిమా తీస్తున్నప్పుడు మాకు కలిగిన మెంటల్‌ మ్యాడ్‌నెస్‌ను మీరూ పొందుతారని భావిస్తున్నాం. మరికొన్ని గంటల్లో డబుల్ ఇస్మార్ట్ మీది కానుంది’ అని పేర్కొన్నారు.

News August 14, 2024

దోషిని ఉరి తీయాలి: CM మ‌మ‌తా బెనర్జీ

image

ట్రైనీ డాక్ట‌ర్‌పై హ‌త్యాచారం కేసులో దోషిని ఉరితీయాల‌ని బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ డిమాండ్ చేశారు. అవసరమైతే దీని కోసం ర్యాలీ తీస్తామని స్పష్టం చేశారు. ఈ కేసులో కోల్‌క‌తా పోలీసుల వ‌ద్ద ఆధారాలు ఉన్నాయ‌ని, వాటిని సీబీఐకి స‌మ‌ర్పించిన‌ట్టు తెలిపారు. ‘ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని ఉరితీయడమే మాకు కావాలి. వచ్చే ఆదివారం వరకు సీబీఐ న్యాయం చేస్తుందని ఆశిస్తున్నా’ అని ఆమె అన్నారు.

News August 14, 2024

BIG BREAKING: వినేశ్‌కు భారీ షాక్.. అప్పీల్ డిస్మిస్

image

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌లో షాక్ తగిలింది. వినేశ్ అప్పీల్‌ను కోర్టు డిస్మిస్ చేసినట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(IOA) నిర్ధారించింది. దీంతో ఆమె సిల్వర్ మెడల్ గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయారు. రెజ్లింగ్ ఫైనల్‌కు ముందు 100 గ్రాముల బరువు ఎక్కువ ఉండటంతో IOC ఆమెను డిస్‌క్వాలిఫై చేసింది.