News August 14, 2024

రేపు గుడివాడకు సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు రేపు కృష్ణా జిల్లా గుడివాడ పర్యటనకు వెళ్లనున్నారు. పట్టణంలోని రామబ్రహ్మం పార్కులో ఆయన అన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు తొలిసారి గుడివాడ వెళ్తున్నారు. దీంతో సీఎం పర్యటనకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా రేపు రాష్ట్రవ్యాప్తంగా 100 క్యాంటీన్లు తెరవనున్నారు. వీటిలో రూ.5కే భోజనం అందించనున్నారు.

News August 14, 2024

సరిపోదా శనివారం.. వాట్ ఏ వేరియేషన్

image

వివేక్ ఆత్రేయ, నాని కాంబినేషన్లో తెరకెక్కిన రెండో చిత్రం ‘సరిపోదా శనివారం’. మొదటి సినిమా ‘అంటే సుందరానికి’ పూర్తి క్లాస్‌గా ఉంటుంది. రెండోది మాత్రం భిన్నంగా యాక్షన్, ఎమోషనల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కినట్లు ట్రైలర్‌లో తెలుస్తోంది. ఆత్రేయ నుంచి ఈ వేరియేషన్ ఊహించలేదని, నానికి అదిరిపోయే రోల్ పడినట్లుగా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సారి బాక్సాఫీస్‌పై దండయాత్ర తప్పదని పోస్టులు చేస్తున్నారు.

News August 14, 2024

లంకతో సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్

image

శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయంతో సిరీస్ మొత్తానికి దూరమైనట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఆయన స్థానంలో ఒలీ పోప్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో జరిగే పాకిస్థాన్ పర్యటనకు ఆయన అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కాగా హండ్రెడ్ లీగ్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో స్టోక్స్‌కు చీలమండ గాయమైంది.

News August 14, 2024

ఆగస్టు 14: చరిత్రలో ఈ రోజు

image

1910: స్వాతంత్ర్య సమరయోధుడు గాదె చిన్నప్పరెడ్డి మరణం
1947: పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం
1957: కమెడియన్ జానీ లీవర్ జననం
1968: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే జననం
2011: బాలీవుడ్ నటుడు షమ్మీ కపూర్ మరణం
2012: మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావు దేశ్‌ముఖ్ మరణం
1983: సింగర్ సునిధి చౌహాన్ జననం

News August 14, 2024

NSUI రాష్ట్ర అధ్యక్షుడిగా యడవల్లి

image

TG: NSUI రాష్ట్ర అధ్యక్షుడిగా యడవల్లి వెంకటస్వామిని AICC నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. మరో 8 రాష్ట్రాలకూ NSUI అధ్యక్షులను నియమించారు. బిహార్-జయశంకర్ ప్రసాద్, చంఢీగఢ్-సికందర్, ఢిల్లీ-ఆశీశ్ లాంబా, హిమాచల్ ప్రదేశ్-అభినందన్ ఠాకూర్, ఝార్ఖండ్-బినయ్ ఓరియన్, మణిపుర్-జాయ్సన్, ఒడిశా-ఉదిత్ నారాయణ్, పశ్చిమ బెంగాల్-ప్రియాంక ఛౌదరి నియమితులయ్యారు.

News August 14, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 14, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: ఆగస్టు 14, బుధవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:43 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5:59 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:48 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:42 గంటలకు
✒ ఇష: రాత్రి 7.58 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News August 14, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 14, 2024

శుభ ముహూర్తం

image

✒ తేది: ఆగస్టు 14, బుధవారం
✒నవమి: ఉదయం 10.23 గంటలకు
✒అనూరాధ: మధ్యాహ్నం 12.12 గంటలకు
✒వర్జ్యం: సాయంత్రం 5.57 గంటల నుంచి 7.36 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: ఉదయం 11.46 నుంచి 12.37 గంటల వరకు

News August 14, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* AP:పాఠశాల విద్య సిలబస్‌లో మార్పులు: CBN
* టీడీపీ అబద్ధపు హామీలకు జనం మోసపోయారు: జగన్
* మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు రాజీవ్ అరెస్ట్, 23 వరకు రిమాండ్
* TG: గురుకులాలను ప్రక్షాళన చేస్తాం: భట్టి
* విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించండి: మంత్రి పొన్నం
* రేపు రాష్ట్రవ్యాప్తంగా OPలు బంద్: జూడాలు
* లిక్కర్ స్కామ్‌లో కవిత జుడీషియల్ కస్టడీ పొడిగింపు
* ఈ నెల 22న దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు