News August 13, 2024

ఆగస్టు 15ను బంగ్లాలో సంతాప దినంగా పాటించండి: షేక్ హసీనా

image

బంగ్లాదేశ్‌లో ఆగస్టు 15ను జాతీయ సంతాప దినంగా పాటించాలని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పిలుపునిచ్చారు. ఆమె తరఫున కుమారుడు సాజిబ్ వాజెద్ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల జరిగిన విధ్వంసం, హింసాత్మక ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. జాతిపిత బంగబంధు భవన్ వద్ద మృతులకు నివాళులర్పించాలని కోరారు. హత్యలు, విధ్వంసక చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి, శిక్షించాలని డిమాండ్ చేశారు.

News August 13, 2024

ఏడాదికి రూ.2.52 లక్షల జీతం.. కాగ్నిజెంట్‌పై ట్రోల్స్!

image

MNCలూ బీటెక్ పూర్తిచేసిన ఫ్రెషర్స్‌కు రూ.20వేలు మాత్రమే జీతం ఇస్తున్నాయి. తాజాగా 2024 బ్యాచ్‌కి చెందిన వారికోసం ఆఫ్ క్యాంపస్ మాస్ హైరింగ్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నట్లు కాగ్నిజెంట్ ప్రకటించింది. వార్షిక వేతనం రూ.2.52 లక్షలు ఇస్తామని తెలిపింది. అయితే, దీనిపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. చదువు లేకపోయినా మోమోస్ దుకాణంలో హెల్పర్‌గా చేస్తే నెలకు రూ.25వేలు ఇస్తున్నారని
ఓ పోస్టర్‌ను షేర్ చేశారు.

News August 13, 2024

ఉప్పు, చక్కెరలో మైక్రోప్లాస్టిక్స్‌!

image

ఇండియాలోని అన్ని ర‌కాల‌ పెద్ద‌, చిన్న ఉప్పు, చ‌క్కెర‌ బ్రాండ్స్‌లో మైక్రోప్లాస్టిక్స్ ఉన్న‌ట్టు తేలింది. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిశోధ‌నా సంస్థ ‘టాక్సిక్ లింక్’ 10 ఉప్పు ర‌కాల‌ను, 5 చ‌క్కెర ర‌కాల‌ను సేక‌రించి అధ్యయనం చేసింది. స‌న్న‌ని దారాల మాదిరి, గుండ్రంగా, థిన్ షీట్స్ రూపాల్లో 0.1 mm నుంచి 5 mm పరిమాణాల్లో మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నట్లు వెల్లడించింది. వీటివల్ల గుండెపోటు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

News August 13, 2024

APలో 100 ఇండస్ట్రియల్ పార్కులు: చంద్రబాబు

image

APలో వంద ఎకరాల చొప్పున 100 ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు CM చంద్రబాబు ప్రకటించారు. ఓడరేవులు, ఎయిర్‌పోర్టులు, పారిశ్రామిక పార్కులపై అధికారులతో CM సమీక్ష నిర్వహించారు. ‘ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా రంగాల ఆధారిత పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలి. విజయవాడ మల్లవల్లి పార్కులో పూర్తి కార్యకలాపాలు జరగాలి. ఉపాధి అవకాశాలు, సంపద సృష్టి కేంద్రాలుగా పోర్టుల నిర్మాణం ఉండాలి’ అని CM సూచించారు.

News August 13, 2024

తిరుమల శ్రీవారి గురించి ఈ విషయం తెలుసా?

image

తిరుమల వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ విగ్రహం గురించి రమణ దీక్షితులు గతంలో ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. భక్తులు స్వామివారి ముఖాన్ని మాత్రమే చూడగలరని, కానీ వెనుకవైపు నుంచే అందంగా ఉంటారని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనిని స్వామివారి అర్చకులు మాత్రమే చూడగలరన్నారు. వెనుక భాగంలో శిరస్సు చక్రం, వంపులు తిరిగిన వెంట్రుకలు, యజ్ఞోపవీతం, కౌపీనం, బాజీ బందులు, కుచ్చులు స్పష్టంగా కనిపిస్తాయని వివరించారు.

News August 13, 2024

వినేశ్ ఫొగట్ అప్పీల్.. తీర్పు మరోసారి వాయిదా

image

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌ అప్పీల్‌పై తీర్పు మరోసారి వాయిదా పడింది. ఆగస్టు 16న తీర్పు వెల్లడిస్తామని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) వెల్లడించింది. శుక్రవారం రాత్రి 9.30 గంటలకు తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఒలింపిక్స్-2024 రెజ్లింగ్ ఫైనల్‌కు ముందు 100 గ్రాముల బరువు ఎక్కువ ఉండటంతో IOC ఆమెను డిస్‌క్వాలిఫై చేసింది. తనకు సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలని వినేశ్ అప్పీల్ చేశారు.

News August 13, 2024

టీమ్ ఇండియా రివైజ్డ్ షెడ్యూల్

image

2024-25లో టీమ్ ఇండియా స్వదేశంలో ఆడే మ్యాచులపై BCCI రివైజ్డ్ షెడ్యూల్ విడుదల చేసింది. బంగ్లాదేశ్‌తో సెప్టెంబర్ 19 నుంచి తొలి టెస్టు, 27 నుంచి రెండో టెస్టు, అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో 3 టీ20లు ఉంటాయని తెలిపింది. ఫస్ట్ టీ20 ధర్మశాలలో కాకుండా గ్వాలియర్‌లో జరగనుంది. ఇక ENGతో 2025 జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2 తేదీల్లో 5 T20లు జరుగుతాయంది. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో మూడు వన్డేలు ఉంటాయని వివరించింది.

News August 13, 2024

సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు ఇస్తే ఇళ్ల మంజూరుకు కేంద్రం సిద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. గ్రామాల్లో ఇళ్లు లేని పేదలకు కేంద్రం ఇళ్లు మంజూరు చేస్తుందని తెలిపారు. ఇందు కోసం కేంద్రం చేపట్టే సర్వేలో రాష్ట్ర ప్రభుత్వం భాగం కావాలని కోరారు. ఇళ్లు లేని పేదల జాబితాను రూపొందించి కేంద్రానికి పంపాలన్నారు.

News August 13, 2024

రీల్స్ చేస్తూ బిల్డింగ్ పైనుంచి పడిపోయింది!

image

యువత సోషల్ మీడియాకు అడిక్ట్ అయి రీల్స్ ద్వారా వైరలయ్యేందుకు ప్రాణాలకు తెగిస్తున్నారు. తాజాగా ఘజియాబాద్‌(UP)లోని ఇందిరాపురం సొసైటీలో ఓ యువతి ఆరో ఫ్లోర్ బాల్కనీలో నిలబడి రీల్స్ చేసేందుకు యత్నించింది. ఒక్కసారిగా తన చేతిలో నుంచి మొబైల్ జారిపోవడంతో పట్టుకునేందుకు ప్రయత్నించి ఆమె కూడా పడిపోయింది. దీంతో ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఇలా రీల్స్ చేసి వైరలవడం కంటే మంచి ర్యాంకు తెచ్చుకుని ఫేమస్ అవడం బెస్ట్.

News August 13, 2024

పాఠశాల విద్య సిలబస్‌లో మార్పులు: CBN

image

AP: భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పాఠశాల విద్య సిలబస్‌లో మార్పులు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌళిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలన్నారు. గత ప్రభుత్వ విధానాలతో పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. విలువలతో కూడిన నాణ్యమైన విద్య ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.