News August 13, 2024

తల్లి పుట్టినరోజున తిరుమలకు జాన్వీ కపూర్

image

అలనాటి నటి శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమె కుమార్తె జాన్వీ కపూర్ తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతీ ఏటా జాన్వీ ఇదే అనుసరిస్తుంటారు. ఈ సందర్భంగా తిరుపతి మెట్లు, తల్లితో తన చిన్నప్పటి ఫొటో, తాను చీరలో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ‘హ్యాపీ బర్త్ డే అమ్మా. ఐ లవ్యూ’ అని దానికి క్యాప్షన్ ఇచ్చారు. తిరుపతి అన్నా, తాను చీర కట్టినా తల్లికి ఇష్టమని జాన్వి పలు సందర్భాల్లో వెల్లడించారు.

News August 13, 2024

USvsహసీనా.. ‘సెయింట్ మార్టిన్’ ప్రాధాన్యత ఏంటి?(2/2)

image

ఈ ద్వీపకల్పం బంగాళాఖాతంలో భారత్, బంగ్లాదేశ్, మయన్మార్‌కు దగ్గరలో ఉంది. చైనాతో వివాదం నేపథ్యంలో బంగాళాఖాతంలో పాగా కోసం ప్రయత్నిస్తున్న US చూపు సెయింట్ మార్టిన్‌పై పడింది. ఇక్కడ సైనిక స్థావరం నిర్మిస్తే అటు చైనాపై కన్ను వేయడంతోపాటు మలక్కా జలసంధిపై పట్టు లభిస్తుందని ఆ దేశం భావిస్తోంది. దానికి తాను ఒప్పుకోకపోవడంతోనే బంగ్లాలో అల్లర్లను అమెరికా ప్రోత్సహించిందని హసీనా ఆరోపించగా, వైట్‌హౌస్ ఖండించింది.

News August 13, 2024

USvsహసీనా.. ‘సెయింట్ మార్టిన్’ ఎక్కడుంది?(1/2)

image

సెయింట్ మార్టిన్ ద్వీపకల్పం కోసమే బంగ్లాదేశ్‌లో US చిచ్చు పెట్టిందని మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు. ఇప్పుడు ఆ ఐలాండ్ గురించి తెలుసుకుందాం. బంగ్లాదేశ్‌కు దక్షిణాన బంగాళాఖాతంలో 3 చ.కి.మీ విస్తీర్ణంలో ఇది ఉంది. 1900లో బ్రిటిష్ వారు దీనికి సెయింట్ మార్టిన్ అని పేరు పెట్టారు. తొలుత INDలో భాగంగా ఉండేది. 1947లో పాక్‌కు, 1971 యుద్ధం తర్వాత బంగ్లాదేశ్‌కు దక్కింది. ఇక్కడ 3,700 మంది నివసిస్తున్నారు.

News August 13, 2024

ఈనెల 23 నుంచి ఓటీటీలోకి ‘కల్కి’?

image

నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2989 AD మూవీ రూ.1,000 కోట్లకు పైగా కలెక్షన్లతో అదరగొట్టింది. థియేటర్లలో చూడని వారు OTT రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ క్రేజీ న్యూస్ బయటికొచ్చింది. ఈ నెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అదేరోజున హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతుందని తెలుస్తోంది.

News August 13, 2024

అర్షద్ నదీమ్‌కు బహుమతుల వెల్లువ

image

పాక్ గోల్డ్ మెడలిస్ట్ అర్షద్ నదీమ్‌కు వరల్డ్ అథ్లెటిక్స్ నుంచి రూ.41.97 లక్షలు, పాక్ సర్కారు నుంచి సుమారు రూ.4.5 కోట్లు, అక్కడి పంజాబ్ సీఎం నుంచి 100 మిలియన్(PKR), సింధ్ సీఎం నుంచి 50 మిలియన్(PKR), పాక్ సర్కారు నుంచి హిలాల్-ఈ-ఇంతియాజ్ పురస్కారం, బంగారు కిరీటంతో సన్మానం, సుక్కూర్ ప్రాంతంలో ఓ క్రీడా స్టేడియానికి అతడి పేరు, కరాచీలో అతడి పేరిట ఓ స్పోర్ట్స్ అకాడమీ వంటివి ఏర్పాటు చేయనున్నారు.

News August 13, 2024

విజయవాడ ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

image

విజయవాడ గొల్లపూడి ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేశ్‌ కొడుకు రాజీవ్‌ను <<13840826>>అరెస్ట్<<>> చేసిన ఏసీబీ అధికారులు ఆఫీస్‌కు తీసుకొచ్చారు. దీంతో అతడిని కలిసేందుకు వైసీపీ నేతలు వెల్లంపల్లి, అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్ సహా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రాజీవ్‌ను కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.

News August 13, 2024

OTT, ఆన్‌లైన్ కంటెంట్ బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం

image

బ్రాడ్‌కాస్టింగ్ సేవల నియంత్రణ ముసాయిదా బిల్లుపై కేంద్రం కాస్త వెనక్కి తగ్గినట్టు తెలిసింది. OTT సహా ఆన్‌లైన్ కంటెంట్‌‌ నియంత్రణ, భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రమాదం ఉందని అభ్యంతరాలు రావడమే ఇందుకు కారణాలు. గతనెల ఈ బిల్లును కొందరు స్టేక్ హోల్డర్లతో పంచుకున్నారు. వారు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో మరిన్ని మార్పులతో కొత్త బిల్లును రూపొందించి మళ్లీ అభిప్రాయాలు సేకరిస్తామని కేంద్రం ట్వీట్ చేసింది.

News August 13, 2024

లక్ష్య సేన్ ఏకాగ్రత చెదిరింది: సునీల్ గవాస్కర్

image

ఏకాగ్రత చెదరడంతోనే బ్యాడ్మింటన్ ఆటగాడు లక్ష్య సేన్ ఒలింపిక్ పతకాన్ని అందుకోలేకపోయారని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ‘సెమీ ఫైనల్‌లో 20-17, 7-0 లీడ్ నుంచి, కాంస్య పతకం మ్యాచ్‌లో గెలిచే స్థానం నుంచి లక్ష్య ఓడిపోవడం బాధించింది. కీలక సమయంలో ఏకాగ్రత కోల్పోయారు. నేను తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. కానీ టీవీలో చూస్తున్నప్పుడు నాకైతే అదే అనిపించింది’ అని పేర్కొన్నారు.

News August 13, 2024

భారత గోల్డ్ మెడలిస్ట్‌పై నిషేధం

image

టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన భారత పారా షట్లర్ ప్రమోద్ భగత్‌పై 18 నెలల నిషేధం పడింది. డోపింగ్ ఉల్లంఘనకు పాల్పడినందుకు రాబోయే పారిస్ పారాలింపిక్స్‌కు దూరమయ్యారు. కాగా ఈ నిషేధం భారత మెడల్స్ ఆశలపై ప్రభావం చూపించనుంది.

News August 13, 2024

ఆ దేశాధినేతలు ముగ్గురూ బలమైనవారు: ట్రంప్

image

రష్యా, చైనా, ఉత్తర కొరియా దేశాధినేతలపై US మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఆ ముగ్గురూ అత్యుత్తమ దశలో ఉన్నారని, వారిని అడ్డుకునేందుకు అమెరికాకు బలమైన అధ్యక్షుడు కావాలని మస్క్‌తో జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘పుతిన్, జిన్‌పింగ్, కిమ్ ముగ్గురూ తెలివైనవాళ్లే. ప్రమాదకారులు కూడా. తమ దేశాన్ని రక్షించుకోవాలని చూస్తారు. కమలను, నిద్రముఖం బైడెన్‌ను చూసి నవ్వుకుంటారేమో’ అని పేర్కొన్నారు.