News August 13, 2024

ఆగస్టు 13: చరిత్రలో ఈ రోజు

image

1888: టెలివిజన్ రూపకర్త జాన్ బైర్డ్ జననం
1899: హాలీవుడ్ డైరెక్టర్ ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ జననం
1926: క్యూబా నియంత ఫిడేల్ కాస్ట్రో రుజ్ జననం
1933: సినీ నటి వైజయంతి మాల జననం
1963: సినీ నటి శ్రీదేవి జననం
1975: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ జననం
1986: డైరెక్టర్ అజయ్ భూపతి జననం
1994: సినీ నటుడు రావు గోపాలరావు మరణం
ప్రపంచ ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవం

News August 13, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 13, 2024

చంద్రబాబును కలిసిన పురందీశ్వరి

image

AP: సీఎం చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిద్దరూ రాజకీయ, అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే నామినేటెడ్ పోస్టులు, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా వీరు చర్చించినట్లు సమాచారం. కాగా నామినేటెడ్ పోస్టుల్లో బీజేపీకి 10 శాతం పదవులు కేటాయించినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

News August 13, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: ఆగస్టు 13, మంగళవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:43 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5:59 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:48 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:43 గంటలకు
✒ ఇష: రాత్రి 7.59 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News August 13, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 13, 2024

శుభ ముహూర్తం

image

✒ తేది: ఆగస్టు 13, మంగళవారం
✒అష్టమి: ఉదయం 9.31 గంటలకు
✒విశాఖ: ఉదయం 10.44 గంటలకు
✒వర్జ్యం: మధ్యాహ్నం 2.58-4.40 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: ఉదయం 8.24 నుంచి 09.14 గంటల వరకు
రాత్రి 11.04 నుంచి 11.49 గంటల వరకు

News August 13, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* AP: నకిలీ సదరం సర్టిఫికెట్లపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
* పేదల ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు: మంత్రి DBV స్వామి
* వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్
* TG: యువత దేశానికి మార్గనిర్దేశకులు కావాలి: సీఎం రేవంత్
* సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ కేసీఆర్‌దే: హరీశ్ రావు
* అట్టహాసంగా ముగిసిన పారిస్ ఒలింపిక్స్

News August 12, 2024

చెన్నైకి BRS నేతల బృందం

image

TG: బాల్క సుమన్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతల బృందం త్వరలోనే చెన్నైకి వెళ్లనుంది. డీఎంకే పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఈ టీమ్ అధ్యయనం చేయనుంది. ఆ పార్టీ విధానాలపై కేసీఆర్‌కు నివేదిక సమర్పించనుంది. అనంతరం DMK విధానాలను BRS కూడా అమలు చేసి, 2028 ఎన్నికలకు పార్టీని పటిష్ఠంగా చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

News August 12, 2024

ఆ బిల్లుపై కేంద్రం వెనక్కి!

image

వివాదాస్ప‌ద బ్రాడ్‌కాస్టింగ్ స‌ర్వీసెస్ (నియంత్ర‌ణ‌) ప్ర‌తిపాదిత డ్రాఫ్ట్‌ బిల్లు – 2024ను వెనక్కు తీసుకోవాల‌ని కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. ఈ బిల్లుపై అభిప్రాయాలు చెప్పాలంటూ కేంద్ర ప్ర‌భుత్వం ఎంపిక చేసిన అతికొద్ది మందికి ఫిజిక‌ల్ కాపీలు పంపింది. అయితే, ఈ ప్రతిపాదిత బిల్లుపై విప‌క్షాలు, కంటెంట్ క్రియేట‌ర్లు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

News August 12, 2024

నచ్చిన రేటింగ్ ఇచ్చుకోండి: హరీశ్ శంకర్

image

తన సినిమాకు రివ్యూలు ఏమైనా రాసుకోవచ్చని, నచ్చిన రేటింగ్‌లు ఇచ్చుకోవచ్చని దర్శకుడు హరీశ్ శంకర్ సవాల్ విసిరారు. తన ఆత్మాభిమానం దెబ్బతీసిన ఇద్దరు, ముగ్గురు వ్యక్తులతో ముఖాముఖిగా గొంతెత్తినట్లు తెలిపారు. ‘ఇట్స్ టైమ్ ఫర్ గ్రాటిట్యూడ్ నాట్ ఆటిట్యూడ్’ అంటూ తనదైన శైలిలో పంచ్ డైలాగ్ వేశారు. కాగా మిస్టర్ బచ్చన్ సినిమా ప్రీమియర్లు ఆగస్టు 14 నుంచే మొదలవుతాయని తెలిపారు.