India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏటా ₹25లక్షల జీతం వస్తున్నా, ముగ్గురితో కూడిన తమ కుటుంబానికి ఏమీ మిగలడం లేదని సౌరవ్ దత్త అనే వ్యక్తి చేసిన పోస్ట్ Xలో వైరలవుతోంది. ‘నెలకు ₹1.50లక్షలు వస్తాయి. అందులో ₹లక్ష EMI, రెంట్‌కు, ₹25వేలు ఫుడ్, సినిమాలు, ట్రిప్స్‌కు, ₹25వేలు ఎమర్జెన్సీ/మెడికల్‌కి సరిపోతుంది. ఇలా మొత్తం ఖర్చవుతోంది. ఇన్వెస్ట్‌మెంట్‌కు ఏమీ మిగలడం లేదు’ అని ట్వీట్ చేశారు. ఇంత జీతం మీకే వస్తే ఎలా సేవ్ చేస్తారు? కామెంట్ చేయండి.
ఆగస్టు నెల టాలీవుడ్ హీరోల సినిమాల రీరిలీజ్‌లతో గడిచిపోతోంది. ఇప్పటికే మహేశ్ బాబు బర్త్ డే రోజు ‘మురారీ’ రీరిలీజైంది. తాజాగా నాగార్జున బర్త్ డే సందర్భంగా ‘మాస్’ను మరోసారి థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ ప్రకటించింది. ఈనెల 28న విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ ‘మాస్ అంటే దుమ్ము లేచిపోవాలి’ అని ట్వీట్ చేసింది. చిరు బర్త్ డేకి ‘ఇంద్ర’, ‘శంకర్ దాదా MBBS’ కూడా రీరిలీజ్ కానున్నాయి.
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం (CPI) ఐదేళ్ల కనిష్ఠానికి చేరింది. జులైలో 3.54 శాతంగా నమోదైనట్టు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వెల్లడించింది. ఇది ఇటీవల ఆర్బీఐ నిర్దేశించుకున్న 4 శాతం లక్ష్యం కంటే దిగువకు చేరడం ఇదే తొలిసారి. ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో గత నెలలో ఉన్న 5.08 శాతం కాస్త దిగివచ్చింది. జూన్‌లో ఆహార ద్రవ్యోల్బణం (CFPI) 9.36 శాతంగా ఉండగా, జులైలో 5.42 శాతానికి తగ్గింది.
AP: నకిలీ సదరం సర్టిఫికెట్లపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి రాకుండా చర్యలు తీసుకోవాలని వైద్యశాఖను ఆదేశించారు. దీనిపై పూర్తి సమాచారం సేకరించి, పంచాయతీ రాజ్ శాఖ సమన్వయంతో కట్టడి చేయాలని స్పష్టం చేశారు. అటు ప్రతి నియోజకవర్గంలో పీపీపీ విధానంలో ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. వీటి నిర్మాణానికి ప్రభుత్వమే స్థలం ఇస్తుందని చెప్పారు.
షార్ట్ సెల్లింగ్ అంటే ఒక స్టాక్ ధర పడిపోతుందని ఊహించి దానిపై లాభం పొందటానికి అనుసరించే ఒక స్ట్రాటజీ. దీని కోసం కొన్ని సందర్భాల్లో షార్ట్ సెల్లర్లు కంపెనీలపై తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తారు. దీంతో మిగతా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కాపాడుకోవడానికి తమ వద్ద ఉన్న షేర్ల అమ్మకాలను ప్రారంభిస్తారు. దీంతో ఆ స్టాక్ ధర భారీగా పతనమవుతుంది. తద్వారా షార్ట్ సెల్లర్లు లాభాలు పొందుతుంటారు.
అంతర్జాతీయంగా విస్తరించిన దేశీయ కంపెనీలు అమెరికన్ షార్ట్ సెల్లర్ల దాడులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లిస్టెడ్ కంపెనీలపై కొన్ని ఏజెన్సీలు, వ్యక్తులు చేస్తున్న ఆరోపణల వల్ల దేశీయ మార్కెట్‌లో అంతిమంగా నష్టపోతున్నది మాత్రం సామాన్య ట్రేడర్లే. ఇటీవల కాలంలో షార్ట్ సెల్లర్ల సంఖ్య పెరగడంతో భారతీయ సంస్థలు ముందస్తు వ్యూహాలతో సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.
పాము, ముంగిస ఎదురుపడితే హోరాహోరీ ఫైట్ తప్పదు. దీనికి కారణం ఏంటని మీరెప్పుడైనా ఆలోచించారా? ముంగిస పిల్లలను పాము తింటుంది. తన పిల్లలను రక్షించడానికి పాముపై ముంగిస దాడి చేసి చంపి తింటుంది. విషపు సంచిని మాత్రం వదిలేస్తుంది. పాము కంటే ముంగిస చురుకైంది. పాము విషాన్ని తట్టుకునే శక్తి ముంగిసకు ఉండటంతో ఫైట్‌లోనూ 80% అదే గెలుస్తుంది. ఇంతకీ మీరు ఎప్పుడైనా వీటి ఫైట్ ప్రత్యక్షంగా చూశారా?
‘తంగలాన్’ సినిమాలో బట్టతల ఉన్న వ్యక్తిగా నటించాలని దర్శకుడు పా.రంజిత్ కోరితే తాను వెంటనే అంగీకరించినట్లు హీరో విక్రమ్ తెలిపారు. అలా కనిపించేందుకు ఇబ్బందిగా ఫీలవలేదని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన పలు చోట్ల ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ మూవీ స్టోరీ విభిన్నమని, ఇందులో గ్లామర్‌కు చోటు లేదని తెలిపారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు మరో ప్రపంచంలోకి వెళ్లినట్లు ఉంటుందన్నారు.
సౌతాఫ్రికా మొత్తం మియా లే రౌక్స్ పేరే వినిపిస్తోంది. పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న మియా ఎన్నో ఒడిదుడుకులకోర్చి ఇప్పుడు ఏకంగా ‘మిస్ సౌతాఫ్రికా 2024’గా అవతరించారు. తద్వారా ఈ ఫీట్ సాధించిన తొలి దివ్యాంగురాలిగా ఆమె రికార్డు సృష్టించారామె. తమలోని లోపం వల్ల సమాజం నుంచి బహిష్కరణకు గురైనట్లుగా భావించే వారికి తన విజయం ఒక పాఠమని ఆమె చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన, దివ్యాంగులకు సాయం చేస్తానన్నారు.
AP: ఆరోగ్య శాఖలో ఉత్తమ విధానాలను అమలు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. దేశంలోనే ఉత్తమంగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దాలన్నారు. టెలి మెడిసిన్ ద్వారా మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. గత ప్రభుత్వం ఆసుపత్రులను భ్రష్టు పట్టించిందని విమర్శించారు. ప్రభుత్వాసుపత్రుల్లో పరిశుభ్రత తప్పనిసరని, ఇకపై డోలి మోతలు కనిపించకూడదని సీఎం ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.