News August 12, 2024

సెబీ చీఫ్‌కు హిండెన్‌బర్గ్ మరిన్ని ప్రశ్నలు

image

సెబీ చీఫ్ మాధబి వివరణపై షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ <>వరుస ట్వీట్లు<<>> చేసింది. ఆమె స్పందన మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోందని పేర్కొంది. ‘డబ్బును బదిలీ చేసిన వినోద్ అదానీతో పాటు బెర్ముడా/మారిషస్ ఫండ్‌లో తన పెట్టుబడుల్ని ఆమె బహిరంగంగా ధ్రువీకరించినట్టు అర్థమవుతోంది. ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకే వస్తుంది. మరి సెబీ చీఫ్ ఇకనైనా పూర్తి స్థాయి పారదర్శక ప్రజా దర్యాప్తు చేపడతారా’ అని ప్రశ్నించింది.

News August 12, 2024

ఏపీ, తెలంగాణలో వర్షాలు

image

తెలంగాణలో మరో 3 రోజులపాటు <<13831969>>వానలు<<>> పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఏపీలో మరో 2 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

News August 12, 2024

త్వరలో హైడ్రాలో 3వేల పోస్టుల భర్తీ?

image

HYD విపత్తుల స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ సంస్థ(హైడ్రా)కు కొత్త పోస్టుల మంజూరు అంశాన్ని TG ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పటికే ఆ సంస్థ 3వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిలో కొన్నింటిని నియామకాల ద్వారా, మిగతా వాటిని GHMC, HMDAలోని అదనపు పోస్టులతో భర్తీ చేస్తారని సమాచారం. త్వరలో దీనిపై క్యాబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ భూములను పరిరక్షించడమే హైడ్రా లక్ష్యం.

News August 12, 2024

కొత్తగా 2.74లక్షల మందికి రైతు బీమా!

image

TG: ఈనెల 15 నుంచి 2024-25 రైతు బీమా సంవత్సరం ప్రారంభం కానుంది. 18-59 ఏళ్ల వయసున్న వారు ఈ స్కీమ్‌కు అర్హులు కాగా, 60ఏళ్లు నిండిన వారిని స్కీమ్‌ నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా అర్హులైన 45.13లక్షల మందికి బీమాను రెన్యువల్ చేయనుంది. ఈ నెల 5తో అప్లై గడువు ముగియగా, కొత్తగా 2.74లక్షల మంది అర్హులను గుర్తించింది. వీరితో కలిపి మొత్తం 47.87లక్షల మందికి బీమా వర్తించనుంది.

News August 12, 2024

అభిమానం వెర్రితలలు.. బోర్డు పరీక్షల్లో విరాట్ పేరు!

image

బిహార్‌కు చెందిన ఓ బాలుడికి కోహ్లీ, ఆర్సీబీ అంటే ఎనలేని అభిమానం. అది పరాకాష్ఠకు చేరి బోర్డు ఎగ్జామ్‌లో తన పేరును విరాట్ కోహ్లీ అని, ఆర్సీబీ క్లాసులో చదువుతున్నానని రాశాడు! పేరెంట్స్ పేర్ల కాలమ్‌లో కోహ్లీ తల్లిదండ్రుల పేర్లను, స్కూల్ పేరు ఐపీఎల్ అని రాశాడు. ఇక ఓఎంఆర్‌ ఆప్షన్లలో జవాబులకు బదులు 18RCB అని నింపాడు. ఈ పోస్ట్ వైరల్ అవుతుండటంతో ఇదెక్కడి అభిమానం అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

News August 12, 2024

భారీగా పెరగనున్న భూముల ధరలు?

image

TG: రాష్ట్రంలో భూముల విలువ పెంపుపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. పెంపు ప్రతిపాదనలపై ఈనెలాఖరులో అభ్యంతరాలు, అభిప్రాయాలు స్వీకరించనుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ధరల పెంపును అమల్లోకి తేనున్నట్లు సమాచారం. దీనిపై ఈనెల 17లోగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. వ్యవసాయ భూముల ధర 50-100%, ప్లాట్ల విలువ 15% పెరగనున్నట్లు సమాచారం. ధరల పెంపు యావరేజ్‌గా 30-50% ఉండొచ్చని తెలుస్తోంది.

News August 12, 2024

కూతుళ్లను కాపాడబోయి..

image

TG: మేడ్చల్ <<13829788>>ఘటనలో<<>> హృదయవిదారక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గౌడవెల్లి స్టేషన్ వద్ద ట్రాక్‌మెన్ కృష్ణ పనులు చేస్తుండగా భార్య కవిత ఇద్దరు పిల్లలు వర్షిత(10), వరణి(7)తో కలిసి భోజనం తీసుకొచ్చింది. కొద్దిసేపు ఆగితే అందరం కలిసి ఇంటికి వెళ్దామని కృష్ణ చెప్పాడు. దీంతో పిల్లలు ఆడుకుంటూ ట్రాక్‌పైకి వెళ్లారు. గమనించిన కృష్ణ వారిని కాపాడేందుకు పరిగెత్తగా అంతలోనే దూసుకొచ్చిన రైలు ముగ్గురినీ కబళించింది.

News August 12, 2024

నేడు స్టాక్ మార్కెట్ల క్రాష్ తప్పదా?

image

సెబీ చీఫ్ మాధబిపై హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్ల గమనంపై ఆసక్తి నెలకొంది. నేడు బెంచ్‌మార్క్ సూచీల ఆరంభం గురించి ఇన్వెస్టర్లు కలవరపడుతున్నారు. గ్యాప్‌డౌన్ ఓపెనింగ్ ఉంటుందా? క్రాష్ అవుతాయా? లేక కన్సాలిడేట్ అవుతాయా? అదానీ స్టాక్స్‌లో రియాక్షన్ ఏంటి? చూడాల్సి ఉంది. తాజా రిపోర్టులో హైప్ తప్ప ఆధారాలు లేకపోవడంతో షార్ట్ సెల్లింగ్ తక్కువే ఉంటుందని కొందరు <<13829729>>విశ్లేషకులు<<>> అభిప్రాయపడ్డారు.

News August 12, 2024

ధోనీపై చీటింగ్ కేసు.. 30లోగా స్పందించాలని బీసీసీఐ ఆదేశం

image

ధోనీపై రూ.15 కోట్ల చీటింగ్ కేసు నమోదైంది. దీనిపై ఈనెల 30లోగా స్పందించాలని BCCI ఎథిక్స్ కమిటీ మాజీ కెప్టెన్‌ను ఆదేశించింది. క్రికెట్ అకాడమీ విషయంలో ధోనీ తనను మోసం చేశాడని UPకి చెందిన రాజేశ్ ఫిర్యాదు చేశారు. ఇదే అంశంలో ‘ఆర్క్రా స్పోర్ట్స్’ కంపెనీ యజమానులు మిహిర్, సౌమ్యా దాస్ ఫ్రాడ్ చేశారని గతంలో ధోనీ కేసు వేశారు. ఇప్పుడు ఈ వ్యవహారంలో ధోనీనే తనను చీట్ చేశారని మరో భాగస్వామి రాజేశ్ ఆరోపిస్తున్నారు.

News August 12, 2024

లైంగిక నేరాలకు పాల్పడినవారిపై నిరంతర నిఘా

image

AP: చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారిపై హిస్టరీ షీట్లు తెరవాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. శిక్షలు పడినవారి వివరాలు, చిరునామాలను జిల్లాలవారీగా సేకరిస్తోంది. ఇలాంటి నేర చరిత్ర కలిగిన మృగాల కదలికలపై నిరంతర నిఘా పెట్టనుంది. పోలీసులు గమనిస్తున్నారనే భయం కల్పించడం ద్వారా ఇలాంటి నేరాలను కొంతైనా అదుపు చేయొచ్చని, స్థానికులూ అప్రమత్తంగా ఉంటారని పోలీస్ శాఖ భావిస్తోంది.