News November 3, 2025

SLBC టన్నెల్.. రేపటి నుంచి సర్వే

image

TG: SLBC (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రిపేర్ అవుతోంది. రేపు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వేను ప్రారంభించనున్నారు. సొరంగాల నిపుణుల సహాయంతో ఈ సర్వే చేపట్టనున్నారు. గతేడాది టన్నెల్ కూలి 8 మంది కార్మికులు మరణించడంతో అలాంటి లూస్ సాయిల్ ఎక్కడ ఉందో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సొరంగం మొత్తం పొడవు 43.9 కి.మీ కాగా ఇంకా 9.5 కి.మీ తవ్వాల్సి ఉంది.

News November 2, 2025

బిగ్‌బాస్: దువ్వాడ మాధురి ఎలిమినేట్

image

బిగ్‌బాస్ సీజన్ 9 నుంచి ఈ వారం దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయ్యారు. నామినేషన్స్ ప్రక్రియలో మాధురి, సంజన, రీతూ చౌదరి, కళ్యాణ్, తనూజ, రాము, డిమోన్ పవన్, గౌరవ్‌లు ఉన్నారు. ఆడియన్స్ నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన మాధురి ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. కాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మాధురి హౌస్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

News November 2, 2025

హైడ్రాలో BRS అనుకూల అధికారులు: జగ్గారెడ్డి

image

TG: హైడ్రాపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కొందరు అధికారులు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చి BRSకు లాభం కలిగేలా చూస్తున్నారనే అనుమానం ఉందన్నారు. ‘హైడ్రా అంశాన్ని తెరపైకి తెచ్చి జూబ్లీహిల్స్‌లో నవీన్‌ను ఓడించే కుట్ర జరుగుతోంది. ఎన్నికలప్పుడే KTRకు హైడ్రా ఎందుకు గుర్తుకొచ్చిందో చెప్పాలి. BRS అనుకూల హైడ్రా అధికారుల వల్ల ఎవరైనా నష్టపోతే CM రేవంత్ దృష్టికి తీసుకెళ్తా’ అని చెప్పారు.

News November 2, 2025

నో రిప్లై.. రేపటి నుంచి కాలేజీలు బంద్

image

TG: ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రేపటి నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ చేపట్టాలని యాజమాన్యాలు తాజాగా మరోసారి చర్చించి నిర్ణయం తీసుకున్నాయి. రూ.900 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చి రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. ఈ నెల 4న మంత్రులకు రిప్రజెంటేషన్ ఇస్తామని, 6న లక్ష మంది ప్రైవేటు కాలేజీల సిబ్బందితో సభ జరుపుతామని, 10న పది లక్షల మంది విద్యార్థులతో లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని చెప్పారు.

News November 2, 2025

రేర్ ఎర్త్ మాగ్నెట్స్.. చైనాకు చెక్ పెట్టనున్న భారత్

image

రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఉత్పత్తిలో 90% వాటా కలిగిన చైనాకు సవాల్ విసిరేందుకు భారత్ సిద్ధమైంది. దేశీయంగా ఈ రంగంలో ప్రోత్సాహకాలను $290M నుంచి $788Mకు పెంచనున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, పునరుత్పాదక, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు ఈ రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఎంతో కీలకం. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది.

News November 2, 2025

తుఫానుతో నష్టపోయిన నేతన్నలకు రూ.5వేలు: మంత్రి

image

AP: మొంథా తుఫానుతో నష్టపోయిన చేనేత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి సవిత తెలిపారు. నీటమునిగి తడిచిపోయిన నూలు, రంగులు, రసాయనాలకు రూ.5 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తున్నామని చెప్పారు. వర్షాలతో ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు 50 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, కేజీ పంచదార ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

News November 2, 2025

నదుల పక్కన ఇంటి నిర్మాణాలు చేయవచ్చా?

image

వాగులు, నదుల పక్కన ఇల్లు కట్టుకోవద్దని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. జల ప్రవాహాలు ఎక్కువైతే.. ఆస్తి, ప్రాణ నష్టం కలిగే ప్రమాదం ఉందన్నారు. ‘నీటి ఒత్తిడి వల్ల పునాదుల బలం తగ్గి, ఇంట్లో స్థిరత్వం లోపిస్తుంది. ప్రకృతి శక్తుల వైపరీత్యం నుంచి ఇల్లు సురక్షితంగా ఉండాలంటే, వరుణ దేవుని ఆగ్రహానికి గురికావొద్దంటే ఈ స్థలాలను నివారించాలి. భద్రత కోసం వీటికి దూరంగా ఉండటం ఉత్తమం’ అని చెప్పారు. <<-se>>#Vasthu<<>>

News November 2, 2025

అవి నిరాధార ఆరోపణలు: ప్రశాంత్ వర్మ

image

తనపై ఓ నిర్మాణ సంస్థ ఫిర్యాదు చేసినట్లు వస్తున్న వార్తలను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఖండించారు. అవన్నీ నిరాధారమైన, తప్పుడు ఆరోపణలని స్పష్టం చేశారు. ‘నాకు, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్‌కు మధ్య ఉన్న వివాదం తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ వద్ద పరిశీలనలో ఉంది. దీనిపై వారు విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటారు. అప్పటిదాకా వివాదాలు సృష్టించవద్దు’ అని ఓ ప్రకటనలో కోరారు.

News November 2, 2025

‘కాశీబుగ్గ’ తొక్కిసలాట అప్డేట్స్

image

* మృతుల కుటుంబాలకు కేంద్ర మంత్రి రామ్మోహన్, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు రూ.15 లక్షల చొప్పున పరిహారం అందజేశారు.
* కేంద్రం ప్రకటించిన రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా త్వరలో అందుతుందని రామ్మోహన్ చెప్పారు.
* పలాస ఆస్పత్రి నుంచి 15 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. మరో 11 మందికి సీహెచ్‌సీతో చికిత్స కొనసాగుతోంది. మెరుగైన వైద్యం కోసం ఒకరిని శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించాం: మంత్రి సత్యకుమార్ యాదవ్

News November 2, 2025

20 నెలల్లోనే రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు: శ్రీధర్ బాబు

image

TG: ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను అత్యున్నత స్థానంలో నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పని చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 20 నెలల వ్యవధిలోనే రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పారు. BRS పాలనలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూనే… మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేరుస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్‌లో మంత్రి ప్రచారం నిర్వహించారు.