India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలుగు రాష్ట్రాల్లో ‘మొంథా’ తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో వర్షాలు, వరద ప్రభావిత ప్రాంత ప్రజలు వేడి చేసిన నీటినే తాగాలని అధికారులు సూచించారు. తద్వారా వ్యాధుల ముప్పు నుంచి బయటపడొచ్చని చెప్పారు. ఈ సమయంలో జ్వరం బారిన పడితే నిర్లక్ష్యం వహించకుండా వైద్యులను సంప్రదించాలని తెలిపారు. మరోవైపు కొన్ని చోట్ల అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు.

US తక్షణమే న్యూక్లియర్ వెపన్ టెస్టింగ్ ప్రారంభిస్తుందని ప్రెసిడెంట్ ట్రంప్ పేర్కొన్నారు. తాను డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఇతర అణుశక్తి దేశాల చర్యలకు సమాధానంగా తామీ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ‘న్యూక్లియర్ వెపన్స్‌లో అగ్రస్థానంలో అమెరికా ఉంది. తర్వాత రష్యా, చైనా ఉన్నాయి. కానీ ఐదేళ్లలో పరిస్థితి మారొచ్చు. నాకిది ఇష్టం లేకపోయినా తప్పట్లేదు’ అని తెలిపారు.

దోమల వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి మార్కెట్లో దొరికే కాయిల్స్, క్రీమ్స్, మస్కిటో మ్యాట్ ప్రొడక్ట్స్ వాడతాం. వీటి ప్రభావం మనపై కూడా పడుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఇంట్లో కొన్ని మొక్కలు పెంచుకోవాలంటున్నారు నిపుణులు. బంతి, తులసి, లావెండర్, రోజ్మేరీ, కలబంద మొక్కలు దోమలను తరిమేయడంలో సహకరిస్తాయి. అలాగే ఇంటి బయట వేప, యూకలిప్టస్ చెట్లను పెంచినా దోమల బెడద తగ్గుతుందంటున్నారు నిపుణులు.

ఆస్ట్రేలియా క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. బంతి తగిలి యువ క్రికెటర్ బెన్ ఆస్టిన్(17) ప్రాణాలు కోల్పోయాడు. మెల్‌బోర్న్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా బెన్ మెడకు బంతి బలంగా తాకడంతో చనిపోయాడు. అతడి మృతి పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మంచి భవిష్యత్ ఉన్న ఆటగాడిని కోల్పోయామని పేర్కొంది. కాగా పదకొండేళ్ల క్రితం ఆసీస్ బ్యాటర్ ఫిలిప్ హ్యూస్ కూడా బంతి తాకి ప్రాణాలు కోల్పోయారు.

అయోధ్యలో రామ మందిరం కోసం 2022 నుంచి ఇప్పటి వరకు రూ.3వేల కోట్లకుపైగా విరాళాలు అందాయి. ఇందులో దాదాపు రూ.1,500 కోట్లను నిర్మాణం కోసం ఖర్చు చేసినట్లు రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. నవంబర్ 25న ఆలయంలో జరిగే జెండా ఆవిష్కరణ వేడుకకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మరో 8 వేల మందిని ఆహ్వానించనున్నట్లు చెప్పారు.

మహాత్మాగాంధీ అంతర్ రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయం 23 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం https://hindivishwa.org/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

గుమ్మడి పంట నాటిన 75 నుంచి 80 రోజులకు గుమ్మడి తీగపై కాయలు ఏర్పడతాయి. లేత కాయలు త్వరగా చెడిపోతాయి. కాబట్టి బాగా ముదిరి, పండిన కాయలనే కోయాలి. ముదిరిన కాయలు 4 నుంచి 6 నెలల వరకు నిల్వ ఉంటాయి. కాబట్టి ఎంత దూరపు మార్కెట్‌కైనా సులభంగా తరలించవచ్చు. కాయల్ని తొడిమతో సహా కోసి, కొన్ని రోజుల పాటు ఆరనివ్వాలి. కోసిన కాయలను శుభ్రపరచి సైజులను బట్టి గ్రేడింగ్ చేసి మార్కెట్‌కు పంపాలి.

వంట గ్యాస్ వినియోగదారులు ఏటా MAR 31లోపు ఆధార్ బయోమెట్రిక్ ఆధారిత e-KYC చేయాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. లేదంటే PM ఉజ్వల యోజన కింద సబ్సిడీ రాదని తెలిపింది. దీంతో పెట్రోలియం కంపెనీలు డిస్ట్రిబ్యూటర్లకు టార్గెట్లు పెట్టి ఈ-కేవైసీ చేయిస్తున్నాయి. వినియోగదారులు మొబైల్ యాప్ ద్వారా కూడా బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ చేసుకోవచ్చు. అందుకోసం ఇక్కడ <

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO)లో 542 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హత గలవారు NOV 24లోపు అప్లై చేసుకుని రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి. వెహికల్ మెకానిక్, MSW పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ITI ఉత్తీర్ణులు అర్హులు. రాతపరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, PET, ట్రేడ్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్:bro.gov.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం<<-se_10012>> జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

అనుష్క నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘అరుంధతి’ 16 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లో రీమేక్ కానున్నట్లు సమాచారం. ఇందులో జేజమ్మగా శ్రీలీల నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తారని, ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయని టాక్. తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.