News November 2, 2025

ఇస్రో దేశ ప్రజలను గర్వపడేలా చేస్తోంది: మోదీ

image

అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03 ప్రయోగం <<18179210>>విజయవంతం<<>> కావడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మన అంతరిక్ష రంగం దేశ ప్రజల్ని గర్వపడేలా చేస్తూనే ఉందని కొనియాడారు. ఇస్రోకు అభినందనలు తెలిపారు. ‘మన సైంటిస్టుల ఘనత వల్ల అంతరిక్ష రంగం నూతన ఆవిష్కరణలకు, ప్రయోగాలకు పర్యాయపదంగా మారింది. వారి విజయాలు దేశ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. ఎన్నో జీవితాలకు సాధికారత కల్పిస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు.

News November 2, 2025

రాజకీయ హింస.. ఏడాదిలో 281 మంది మృతి

image

విద్యార్థుల ఆందోళనలతో బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా అధికారం కోల్పోయినప్పటికీ పొలిటికల్ వయలెన్స్ కొనసాగుతూనే ఉంది. గత ఏడాది AUG నుంచి ఈ ఏడాది SEP వరకు అల్లర్లలో 281 మంది మరణించారని మానవ హక్కుల సంఘం వెల్లడించింది. అలాగే అక్రమ నేరారోపణలతో 40 మంది చట్టవిరుద్ధ హత్యలకు గురయ్యారని తెలిపింది. మరో 153 మందిని దారుణంగా ఉరితీశారని పేర్కొంది. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు జవాబుదారీగా ఉండటం లేదని అభిప్రాయపడింది.

News November 2, 2025

పంకజ్ త్రిపాఠి తల్లి కన్నుమూత

image

బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి హేమ్వంతి దేవి(89) అనారోగ్యంతో రెండు రోజుల కిందట మరణించారు. బిహార్‌లోని స్వస్థలం గోపాల్‌గంజ్‌లో నిన్న అంత్యక్రియలు కూడా పూర్తయినట్లు నటుడి టీమ్ ఇవాళ ప్రకటించింది. త్రిపాఠి తండ్రి బెనారస్ తివారీ(99) రెండేళ్ల క్రితం చనిపోయారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్ ద్వారా పంకజ్ తెలుగు వారికీ దగ్గరైన విషయం తెలిసిందే.

News November 2, 2025

తుఫాను: రైతులను పరామర్శించనున్న జగన్

image

AP: మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను తమ అధినేత జగన్ పరామర్శిస్తారని వైసీపీ తెలిపింది. ఈ నెల 4న కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరులో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారని పేర్కొంది. కాగా జగన్ ఇవాళ బెంగళూరు నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి వచ్చారు.

News November 2, 2025

సచిన్‌తో లోకేశ్, బ్రాహ్మణి సెల్ఫీ

image

ICC ఛైర్మన్ జైషాతో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. తన భార్య బ్రాహ్మణితో పాటు వెళ్లి జైషా, ఆయన తల్లి సోనాలీ షాను కలిసినట్లు ట్వీట్ చేశారు. క్రికెట్, యువత భాగస్వామ్యం, దేశ క్రీడా భవిష్యత్తు గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. నవీముంబైలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు లోకేశ్, బ్రాహ్మణి వెళ్లారు. టీమ్ఇండియా జెర్సీలు ధరించిన వారిద్దరూ సచిన్‌తో పాటు పలువురిని కలిశారు.

News November 2, 2025

FINAL: టీమ్ ఇండియాకు శుభారంభం

image

సౌతాఫ్రికాతో జరుగుతున్న ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమ్ ఇండియా నిలకడగా ఆడుతోంది. 21 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 122 రన్స్ చేసింది. ఓపెనర్ స్మృతి 58 బంతుల్లో 45 రన్స్ చేసి ఔటయ్యారు. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం క్రీజులో షెఫాలీ (58*), జెమీమా రోడ్రిగ్స్ (9*) క్రీజులో ఉన్నారు.

News November 2, 2025

కార్తీకమాసంలో భక్తుల రద్దీ.. ప్రభుత్వం అలర్ట్

image

AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనతో దేవాదాయశాఖ అప్రమత్తమైంది. కార్తీక మాసంలో సోమవారం, పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో రద్దీని నియంత్రించేందుకు భక్తులకు మైకుల ద్వారా నిరంతర సూచనలు ఇవ్వాలని జిల్లా ఎండోమెంట్ అధికారులను ఆదేశించింది. బారికేడ్లు పటిష్ఠంగా ఉంచాలని సూచించింది. ఒకే ప్రదేశంలో భారీ జనసమూహం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది.

News November 2, 2025

గిల్ ఫెయిల్.. జైస్వాల్‌కు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్లు

image

శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌పై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. అతడు T20ల్లో వరుసగా విఫలం అవుతున్నా ఎందుకు అవకాశాలు ఇస్తున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గిల్ గత 10 టీ20 ఇన్నింగ్సుల స్కోర్ 20, 10, 5, 47, 29, 4, 12, 37*, 5, 15 (ఈరోజు)గా ఉంది. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు. దీంతో గిల్‌ను పక్కనబెట్టి యశస్వీ జైస్వాల్‌కు ఓపెనింగ్ ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మీ కామెంట్?

News November 2, 2025

ఇతిహాసాలు క్విజ్ – 54 సమాధానాలు

image

1. కర్ణుడిని బ్రహ్మాస్త్ర మంత్రం మరిచిపోయేలా శపించింది ‘పరుశరాముడు’.
2. అర్జునుడిని చంపిన తన కొడుకు పేరు ‘బభ్రువాహనుడు’.
3. త్రిపురాసురుని సంహారంలో శివుడి రథ సారథి ‘బ్రహ్మ’.
4. సతీదేవి దేహం భూమ్మీద పడిన స్థలాలను ‘శక్తిపీఠాలు’ అని అంటారు.
5. ఇంద్రుడు భీష్ముడికి ఇచ్చిన వరం ‘ఇచ్చామరణం’ (తనకు ఇష్టం వచ్చినప్పుడు మరణించే వరం).
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 2, 2025

కార్తీక పౌర్ణమి ఏరోజు జరపాలంటే?

image

ఈ ఏడాది కార్తీక పౌర్ణమి NOV 5న జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. నదీ స్నానాలకు 4:52 AM – 5:44 AM అనుకూలంగా ఉందన్నారు. పూజా కార్యక్రమాలను 7:58 AM – 9:00 AM జరపాలని సూచించారు. దీపారాధనకు సా.5:15 గంటల నుంచి రా.7:05 వరకు ఉత్తమమన్నారు. పౌర్ణమి రోజున 365 వత్తుల దీపం పెట్టి, శివకేశవులను పూజించి, ఉపవాసం ఉంటే.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నమ్మకం.☞ కార్తీక పౌర్ణమి విశేషాలు, పూజ నియమాల కోసం <<-se_10013>>భక్తి<<>>.