India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: తాను బీజేపీ కానీ, మరే ఇతర పార్టీలతో కానీ టచ్‌లో లేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ‘రోజూ సీఎం రేవంత్ వెంట ఉంటే నంబర్ 2 అవుతానా? నేను సీఎం కావాలంటే మా అధిష్ఠానం కొన్ని సమీకరణాలు చూస్తుంది. నాకు సీఎం కావాలని లేదు. నాపై కావాలనే కొందరు బురద జల్లుతున్నారు. నేను ఇతర పార్టీలతో టచ్‌లో ఉన్నానని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు’ అని ఆయన మండిపడ్డారు.
దేశ వ్యాప్తంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల జీతాలను కేంద్రం పెంచనుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తితో జీతాలు పెంచేందుకు ఈసీ అనుమతించింది. జీతాల పెంపు ఎప్పటికప్పుడు జరిగేదే అని, కొత్త నిర్ణయం కాదన్న ప్రభుత్వ వివరణతో ఈసీ ఏకీభవించింది. ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో కొత్త వేతనాలు అమల్లోకి వస్తాయి.
CM పదవిలో ఉండి అరెస్టయిన తొలి వ్యక్తిగా కేజ్రీవాల్ నిలిచారు. దీంతో CMను అరెస్ట్ చేయవచ్చా అనే సందేహం చాలా మందిలో కలుగుతోంది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లను మాత్రమే పదవిలో ఉండగా అరెస్ట్ చేయరాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లు అధికార విధులకు సంబంధించి కోర్టులకు జవాబుదారీగా ఉండరని పేర్కొన్నారు. PM, CMలను చట్టప్రకారం అరెస్ట్ చేయవచ్చని అంటున్నారు.
AP: రాష్ట్రంలోని కస్తూర్బా విద్యాలయాల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఆరో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరేందుకు ప్రవేశ ప్రక్రియ నిర్వహించనున్నారు. 7, 8, 9 తరగతుల్లో చేరేందుకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి.. స్క్రూటినీ చేసి ఫైనల్ లిస్ట్ రూపొందించనున్నారు. ఎంపికైన వారికి ఫోన్ ద్వారా సమాచారమిస్తారు. apkgbv.apcfss.in వెబ్‌సైట్‌లో ఏప్రిల్ 11లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
TG:ఈ నెల 24న తెలంగాణ బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. గడ్చిరోలిలో ఇటీవల జరిగిన <<12882117>>ఎన్‌కౌంటర్‌కు<<>> నిరసనగా ఈ బంద్ నిర్వహిస్తున్నారు. ‘ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌ను హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలి. నలుగురిని పోలీసులు ప్రాణాలతో తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి, ఆ తర్వాత చంపారు. ఈ ఎన్‌కౌంటర్‌కు బాధ్యులైన వారిని శిక్షించాలనే డిమాండ్‌తో బంద్ చేపడుతున్నాం’ అని రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ వెల్లడించారు.
AP: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఇవాళ మూడో జాబితా విడుదల చేయనుంది. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా మహేశ్ యాదవ్ ఖరారైనట్లు సమాచారం. ఈయన యనమల రామకృష్ణుడికి అల్లుడు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు, అమలాపురం ఎంపీ అభ్యర్థిగా హరీశ్ (జీఎంసీ బాలయోగి కుమారుడు), బాపట్లకు కృష్ణ ప్రసాద్, హిందూపురంలో పార్థసారథికి టికెట్లు ఖరారైనట్లు సమాచారం. ఇవాళ వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ ఇవాళ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనుంది. ఆయనను కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. మరోవైపు తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది. నిన్న రాత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసి ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించిన సంగతి తెలిసిందే.
నేటి నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. ధనాధన్ ఆటతో ఆటగాళ్లు క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించనున్నారు. రెండు నెలలకుపైగా జరగనున్న ఈ టోర్నీలో 10 జట్లు పాల్గొంటున్నాయి. తొలి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సీఎస్కే-ఆర్సీబీ మధ్య జరగనుంది. అలాగే ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీ అదిరిపోనుంది. ఏఆర్ రెహమాన్, అక్షయ్ కుమార్, సోనూ నిగమ్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్లు తమ ప్రదర్శనలతో అలరించనున్నారు.
దివంగత హీరో ఉదయ్ కిరణ్ బయోపిక్‌ను తీసేందుకు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై గ్రౌండ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. కాగా ఉదయ్ కిరణ్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. ఆ తర్వాత వరుస ఫ్లాప్‌లు, ఆర్థిక సమస్యలతో సతమతమై ఆత్మహత్య చేసుకున్నారు.
TG: మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. నిన్న కాంగ్రస్ సీనియర్ నేత జానారెడ్డిని ఆయన కలిశారు. కాంగ్రెస్‌లో చేరికపై వీరిద్దరూ చర్చించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన హస్తం గూటికి చేరడం పక్కా అని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంద్రకరణ్ రెడ్డి స్పందించాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.