India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బాత్రూమ్‌లో ఎక్కువగా గుండెపోటు కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. దీనికి స్నానం ప్రధాన కారణం కాదని, మలమూత్ర విసర్జన సమయంలో ఎక్కువగా ఒత్తిడి చేయడమే అసలు సమస్యని స్పష్టం చేశారు. ఈ ఒత్తిడి వల్ల ‘వాల్సాల్వా మ్యాన్యువర్’ జరిగి రక్తపోటులో ఆకస్మిక హెచ్చుతగ్గులు సంభవిస్తాయని తెలిపారు. దీనివల్ల రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయిన వారికి ఆక్సిజన్ సరఫరా తగ్గి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.

ICAI సెప్టెంబర్ సెషన్ 2025 సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్ ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు విడుదల కానున్నాయి. ఫౌండేషన్ స్థాయి ఫలితాలు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ లేదా రోల్ నెంబర్ నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. వెబ్‌సైట్: https://icai.nic.in/

అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా.. భారత మహిళా జట్టుకు కలగా ఉన్న వరల్డ్ కప్ నిన్నటి మ్యాచ్‌తో సాకారమైంది. రాత్రంతా సెలబ్రేషన్స్‌తో అలసిపోయి పొద్దున్నే నిద్ర లేచిన ప్లేయర్లు చేతిలో వరల్డ్ కప్‌లో బెడ్‌పై నుంచే ఫొటోకు పోజులిచ్చారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ ‘ఇంకా మనం కలలు కంటున్నామా?’ అని క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఫొటోలో అరుంధతి, రాధా యాదవ్, స్మృతి మంధాన ఉన్నారు.

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 162 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్-సీ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, ఇంటర్+ ఐటీఐ+ NAC అర్హత కలిగినవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

భారత మహిళల జట్టుకు అభినందనలు తెలిపిన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర బీజేపీ కౌంటర్ ఇచ్చింది. భారత ప్లేయర్ల పోరాటం రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆమె Xలో పోస్ట్ చేశారు. దానికి ‘మీరేమో అమ్మాయిలు రా.8 గంటలకల్లా ఇంటికి చేరాలని చెప్పారు. వీళ్లేమో రా.12 గంటల వరకు ఆడుతూనే ఉన్నారు’ అంటూ BJP కౌంటర్ ట్వీట్ చేసింది. గతంలో ఓ రేప్ కేసు విషయంలో మమత చేసిన <<17986509>>వ్యాఖ్యలు<<>> వివాదం కావడం తెలిసిందే.

పవర్‌గ్రిడ్‌లో 20 ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. CA/ICWA ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష(CBT),ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.40వేలు చెల్లిస్తారు.వెబ్‌సైట్: www.powergrid.in/

స్కాంద పురాణం ప్రకారం.. కార్తీక సోమవారం నాడు శివుడి అనుగ్రహం పొందడానికి 6 నియమాలున్నాయి. వీటిలో నక్తం (నక్షత్రాన్ని చూసి నైవేద్యాన్ని స్వీకరించడం), ఉపవాసం, ఏక భుక్తం(ఒక పూట భోజనం), తెల్లవారున చన్నీటి స్నానం, అయాచితం (ఇతరులిచ్చిన ఆహారం మాత్రమే తినడం), తిలధానం(నల్ల నువ్వులు దానం చేయడం) ముఖ్యమైనవి. ఈ నియమాలలో ఏ ఒక్కటి పాటించినా శివుడు సంతోషించి, భక్తుల మనోభీష్టాలు నెరవేరుస్తాడని ప్రగాఢ విశ్వాసం.

☛ వైనతేయ గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. ఏటా చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ వశిష్ట గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ అభయ గంగ: నాటిన 4 ఏళ్లకు కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 135 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 72 శాతం. కొబ్బరి నూనెకు ఇది అనుకూలం.

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 6 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. నిన్న 84,442 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 24,692 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 3.51 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

ప్రస్తుతకాలంలో వయసుతో సంబంధం లేకుండా అందర్నీ హెయిర్ ఫాల్ సమస్య వేధిస్తోంది. దీనికి చెక్ పెట్టడానికి ఈ తమలపాకులు ఉపయోగపడతాయి. * తమలపాకులని కడిగి పేస్టుచేసి అందులో కాస్త నెయ్యి కలపాలి. దీన్ని మాడునుంచి జుట్టు చివర్ల వరకు పట్టించాలి. గంట తర్వాత కడిగేస్తే సరిపోతుంది. * తమలపాకు పేస్ట్‌లో కాస్త కొబ్బరి నూనె, ఆముదం కలిపి జుట్టుకు పట్టించాలి. గంట తర్వాత కడిగేస్తే జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది.
Sorry, no posts matched your criteria.