India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: టీడీపీ అధినేత చంద్రబాబుతో మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. ఆయనకు ఇంకా టికెట్ ఖరారు కాని నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తనకు విశాఖ జిల్లాలోనే టికెట్ కేటాయించాలని గంటా కోరినట్లు తెలుస్తోంది. అయితే ఆయనను చీపురుపల్లిలో పోటీ చేయాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం.
వైసీపీ అభ్యర్థుల్లో రెండు కుటుంబాల తండ్రీకొడుకులకు టికెట్లు దక్కాయి. పుంగనూరు ఎమ్మెల్యేగా కీలక నేతగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి పోటీ చేయనున్నారు. ఇక ఇదే తరహాలో ఈయన కొడుకు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా తిరిగి బరిలో నిలుస్తారని పార్టీ ప్రకటించింది. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు MP స్థానం, ఆయన కొడుకు మోహిత్- చంద్రగిరి MLA టికెట్లు పొందారు.
రాష్ట్రంలో మొత్తం 25 పార్లమెంటు స్థానాలున్నాయి. 2019 ఎన్నికల్లో YCP 22 సీట్లు గెలుచుకోగా.. టీడీపీ 3 సీట్లకే పరిమితమైంది.
* మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో వైసీపీ 151, టీడీపీ 23, జనసేన 1 సీటు గెలిచాయి. 2014తో పోల్చితే వైసీపీకి 84సీట్లు పెరిగాయి. టీడీపీ 49 సీట్లు కోల్పోయింది.
కార్పొరేట్ కంపెనీలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో రాజకీయ పార్టీలకు భారీగా నిధులు అందించాయి. అయితే ఓ 25 సంస్థలు తమ స్థోమతకు మించి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది. వీటి విలువ రూ.5 కోట్లలోపే అయినా ఏకంగా రూ.250కోట్లు విలువైన బాండ్స్ కొన్నాయి. వీటిలో తొమ్మిది కంపెనీలు ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ వచ్చాక (2018) ఏర్పడటం గమనార్హం. ఈ లిస్ట్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీలూ ఉన్నాయి.
లాభాల్లో గరిష్ఠంగా 7.5శాతాన్నే డొనేట్ చేయాలనే నిబంధన పోవడంతో టర్నోవర్‌తో సంబంధం లేకుండా కంపెనీలు విరాళాలు ఇస్తున్నాయి. 2023లో టీషార్క్స్ ఇన్‌ఫ్రా, టీషార్క్స్ ఓవర్‌సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ చెరో రూ.లక్షతో ఏర్పడిన కొన్ని నెలలకే రూ.7.5కోట్లు విలువైన బాండ్స్ కొన్నాయి. అపర్నా ఫార్మ్స్ రూ.5లక్షలతో ఏర్పడగా రూ.30కోట్లు విలువైన బాండ్స్ కొంది. ఇలా సంస్థలు స్థోమతకు మించి బాండ్స్ కొనడం చర్చనీయాంశమైంది.
AP: 25 MP స్థానాల్లో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన YCP.. అనకాపల్లి స్థానాన్ని పెండింగ్‌లో ఉంచింది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ సత్యవతికి మరోసారి టికెట్ ఇచ్చేందుకు హైకమాండ్ ఆసక్తిగా లేదు. దీంతో ఇక్కడ ఎవర్ని బరిలోకి దించుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా కమలం పార్టీ తరఫున సీఎం రమేశ్ బరిలో నిలుస్తారనే ప్రచారం జరుగుతుండగా.. BCల్లో బలమైన అభ్యర్థికై YCP అన్వేషిస్తోంది.
హీరోయిన్ కృతి ఖర్బందా వివాహం చేసుకున్నారు. ఆమె మెడలో పుల్కిత్ సామ్రాట్ మూడు ముళ్లు వేశారు. కొన్నేళ్లుగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. హరియాణాలోని మనేసార్‌లో వీరి వివాహం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో పంజాబీ స్టైల్‌లో ఘనంగా జరిగింది. కాగా ఈమె తెలుగులో తీన్‌మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం 3D, బ్రూస్‌లీ వంటి సినిమాల్లో నటించారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కాసేపట్లో ఈసీ షెడ్యూల్ ప్రకటించనుంది. నోటిఫికేషన్, నామినేషన్లు, పోలింగ్ తేదీలు, ఎన్ని విడతల్లో ఎలక్షన్స్ నిర్వహిస్తారనే విషయాన్ని వెల్లడించనుంది. ఇక షెడ్యూల్ విడుదలతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఈసీ ప్రకటనను WAY2NEWSలో లైవ్ చూడొచ్చు.
స్వభాషారాష్ట్రం కోసం ఆత్మార్పణకు పూనుకొన్న యోధుడు పొట్టి శ్రీరాములు. ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం 1952 OCT 10 నుంచి 58 రోజుల పాటు ఆయన మద్రాస్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి అసువులు బాసి అమరజీవి అయ్యారు. ఆయన ధీరోదాత్త ఆత్మత్యాగ ఫలితమే ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర అవతరణ. 1953 OCT 1న కర్నూలు జిల్లా రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. 2008లో నెల్లూరు జిల్లా పేరును శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు.
AP: 2014లో MLAలుగా గెలిచిన వారు ఎంపీలుగా, MPలు ఎమ్మెల్యేలుగా ఈసారి YCP నుంచి పోటీ చేయనున్నారు. పొన్నూరు MLA కిలారు రోశయ్య- గుంటూరు MP, చంద్రగిరి MLA చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- ఒంగోలు MP, రాజోలు MLA వరప్రసాద్- అమలాపురం MP, నెల్లూరు సిటీ MLA అనిల్ కుమార్- నరసరావుపేట MP, రాజమండ్రి MP భరత్- రాజమండ్రి సిటీ MLA, కాకినాడ MP వంగా గీత- పిఠాపురం MLA, నెల్లూరు MP ప్రభాకర్‌రెడ్డి- నెల్లూరు రూరల్ MLA.
Sorry, no posts matched your criteria.