News November 3, 2025

RSV ఇన్ఫెక్షన్‌ను ఎలా నివారించాలంటే?

image

వర్షాకాలం, చలికాలంలో ఇన్‌ఫెక్షన్లు ప్రబలినప్పుడు గుంపులోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. బిడ్డను తీసుకొని ఫంక్షన్లకు వెళ్లకూడదు. దగ్గు, జలుబు ఉన్నవాళ్లకు తల్లిదండ్రులు, పిల్లలు దూరంగా ఉండాలి. సరైన ఇమ్యూనిటీ లేని పిల్లలకు RSV ఇమ్యూనోగ్లోబ్యులిన్‌ వ్యాక్సిన్‌ ఇస్తారు. పిల్లల్లో లక్షణాలు ఎక్కువగా ఉంటే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. పిల్లలకు పోషకాలున్న ఆహారం ఎక్కువగా ఇవ్వాలి.

News November 3, 2025

ESICలో 94 పోస్టులు

image

ESIC ఫరీదాబాద్‌లో 94 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. సంబంధిత విభాగంలో ఎండీ, డీఎన్‌బీ, ఎంఎస్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 7న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.500, SC, STలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in/

News November 3, 2025

ఇలా చేస్తే తిరుమలలో వేగంగా దర్శనం!

image

శ్రీవారి దర్శనానికి ఎన్నో దారులున్నాయి. వీటిలో రక్తదానం చేసినవారికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. రక్తదానాన్ని ప్రోత్సహించేందుకు దీనిని 1985లో ప్రారంభించినా చాలామందికి ఇది తెలియదు. రక్తదాతలకు రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్‌తో పాటు ఒక లడ్డూ & ప్రశంసాపత్రాన్ని అందిస్తారు. ఇందుకోసం కొండపై ఉన్న అశ్విని ఆస్పత్రిలో రోజూ పరిమిత వ్యక్తులు రక్తదానం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. Share it

News November 3, 2025

వరల్డ్ కప్ విన్.. BJP&కాంగ్రెస్ శ్రేణుల ఫైట్

image

ప్రధాని మోదీ హాజరైతే అందులో భారత్‌కు ఓటమి తప్పదని కాంగ్రెస్ శ్రేణులు ట్వీట్లు చేస్తున్నాయి. ‘మోదీ హాజరైన చంద్రయాన్-2 & 2023 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ విఫలమైంది. అదే మోదీ గైర్హాజరైన చంద్రయాన్-3, 2024 T20 WC, 2025 WWC వంటి వాటిలో భారత్ గెలిచింది. అంటే మోదీ హాజరుకు, వైఫల్యానికి సంబంధం ఉంది’ అని సెటైర్ వేస్తున్నాయి. రాహుల్ గాంధీ ఉండటం వల్లే కాంగ్రెస్ ఓడిపోతోందని బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.

News November 3, 2025

విషాదం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

image

TG: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర <<18183462>>బస్సు ప్రమాదంలో<<>> ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మరణించారు. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్‌‌కు నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు. పెద్ద కూతురి పెళ్లి కోసం ముగ్గురు కూతుళ్లు నందిని (డిగ్రీ ఫస్టియర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), తనూష (ఎంబీఏ) హైదరాబాద్‌ నుంచి సొంతూరుకు వచ్చారు. ఈ తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా బస్సు ప్రమాదం జరిగి చనిపోయారు.

News November 3, 2025

కస్టమర్‌తో ర్యాపిడో రైడర్ అసభ్య ప్రవర్తన

image

AP: కస్టమర్‌తో ర్యాపిడో బైక్ రైడర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి 12.30am బ్యూటీ పార్లర్ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఓ మహిళ ర్యాపిడో బుక్ చేసుకుంది. గమ్యం చేరాక రైడర్(పెద్దయ్య) ఆమెకు బలవంతంగా ముద్దు పెట్టాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె భర్త ర్యాపిడో రైడర్‌ను పట్టుకున్నారు. నైట్ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు రాగా వారికి అప్పగించడంతో కేసు నమోదు చేశారు.

News November 3, 2025

అనిల్ అంబానీకి ఈడీ షాక్.. రూ.3వేల కోట్ల ఆస్తులు అటాచ్

image

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణల కేసు దర్యాప్తులో భాగంగా ఆయనకు సంబంధించిన రూ.3వేల కోట్లకుపైగా ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో ఆయన నివాసంతో పాటు ముంబై, ఢిల్లీ, నోయిడా, పుణే, హైదరాబాద్, చెన్నై సహా ఇతర ప్రాంతాల్లోని కమర్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ.3,084 కోట్లు అని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

News November 3, 2025

బస్సు ప్రమాదం.. ప్రభుత్వం పరిహారం ప్రకటన

image

TG: రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, ఆర్టీసీ తరఫున రూ.2లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున అందిస్తామని పేర్కొన్నారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. అంతకుముందు కేంద్రం <<18184274>>పరిహారం<<>> ప్రకటించింది.

News November 3, 2025

డిఫరెంట్ లుక్‌లో సీనియర్ హీరోయిన్

image

పై ఫొటోలో కనిపిస్తున్న అలనాటి హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ‘అమ్మోరు’లో అమ్మవారిగా, ‘బాహుబలి’లో రాజమాత శివగామిగా మెప్పించిన రమ్యకృష్ణ. ఇదేంటి ఇలా మారిపోయారని అనుకుంటున్నారా? కొత్త సినిమా కోసం ఆమె ఇలా డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. ఈ ఫొటోను దర్శకుడు ఆర్జీవీ Xలో పోస్ట్ చేశారు. ఆయన తెరకెక్కిస్తోన్న ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ సినిమాలో రమ్య నటిస్తున్నారు. ఆమె లుక్ ఎలా ఉంది?

News November 3, 2025

మెగ్నీషియంతో జుట్టుకు మేలు

image

వయసుతో సంబంధం లేకుండా అందర్నీ వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. దీనికోసం పైపైన ఎన్ని షాంపూలు, నూనెలు వాడినా ఉపయోగం ఉండదంటున్నారు నిపుణులు. మెగ్నీషియం లోపం వల్ల మాడుకు రక్త ప్రసరణ తగ్గడంతో పోషకాలు అందక జుట్టు సమస్యలు వస్తాయి. పాలకూర, గుమ్మడి గింజలు, బాదం, అవిసెగింజలు, చియా, బీన్స్‌, చిక్కుళ్లు, అరటి, జామ, కివీ, బొప్పాయి, ఖర్జూరాలు, అవకాడో వంటివి ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.