News April 18, 2025

వరల్డ్ ప్రెస్ ఫొటో ఆఫ్‌ ది ఇయర్‌గా యుద్ధ బాధితుడి చిత్రం

image

గాజా‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో గాయపడిన ఓ బాలుడి చిత్రం ఈ ఏడాది వరల్డ్ ప్రెస్ ఫొటో ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికైంది. పాలస్తీనాకు చెందిన ఫొటోగ్రాఫర్ సమర్ అబు ఎలూఫ్ ఈ ఫొటో తీశారు. ఈ చిత్రంలోని బాలుడు రెండు చేతులు కోల్పోయి దీనస్థితిలో కనిపిస్తున్నాడు. ఈ యుద్ధం వల్ల భవిష్యత్తు తరాలు ఎలా అంధకారంలోకి వెళ్లాయో ఈ చిత్రం చెబుతుందని వరల్డ్ ప్రెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు.

News April 18, 2025

కాంగ్రెస్, బీజేపీ ఒకటి కాదని నిరూపించే సమయమిది: కేటీఆర్

image

TG: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రధాని మోదీ కేవలం మాటలకే పరిమితం కావొద్దని KTR కోరారు. అందులో జీవవైవిధ్యాన్ని నాశనం చేయడమే కాకుండా ఆర్థిక కుంభకోణం జరిగిందని చెప్పారు. భూముల తాకట్టు వ్యవహారాన్ని CBI, SEBI, RBI దృష్టికి తీసుకెళ్లామన్నారు. కేంద్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు. TGలో కాంగ్రెస్, BJP ఒకటి కాదని నిరూపించే సమయమిదని వ్యాఖ్యానించారు.

News April 18, 2025

మెలోనీ అంటే నాకు చాలా ఇష్టం: ట్రంప్

image

ఇటలీ PM జార్జియా మెలోనీ అంటే తనకు చాలా ఇష్టమని ట్రంప్ తెలిపారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. మెలోనీ గొప్ప ప్రధాని అని, వ్యక్తిగతంగానూ ఆవిడతో మంచి అనుబంధం ఉందన్నారు. ఆవిడలో చాలా ప్రతిభ ఉందని, ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఒకరంటూ కొనియాడారు. టారిఫ్స్ పెంపుపై US వైఖరిని మెలోనీ వ్యతిరేకించినా.. యూరోపియన్ దేశాల నుంచి ట్రంప్‌ని కలిసిన తొలి ప్రధాని ఆవిడే.

News April 18, 2025

IPL: అనూహ్య ‘నో బాల్’.. ఎలాగంటే?

image

నిన్న MI, SRH మ్యాచ్‌లో ఓ అనూహ్య నో బాల్ వెలుగులోకి వచ్చింది. అన్సారీ బౌలింగ్‌లో రికెల్టన్ షాట్ ఆడగా కమిన్స్ క్యాచ్ పట్టారు. అయితే, బ్యాటర్ ఔట్ కాలేదు. దీనికి కారణం నో బాల్. రూల్ ప్రకారం బ్యాట్‌ను బంతి తాకక ముందే కీపర్ గ్లౌవ్స్ స్టంప్స్ కంటే ముందుకొస్తే నో బాల్ ఇస్తారు. నిన్న క్లాసెన్ గ్లౌవ్స్ ఇలాగే ముందుకొచ్చాయి. అయితే, కీపర్ తప్పునకు బౌలర్‌కు శిక్ష ఏంటని పలువురు క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు.

News April 18, 2025

సినిమాలు వదిలేస్తున్నట్లు ప్రచారం.. డైరెక్టర్ బూతు పురాణం!

image

తాను సినిమాలు తీయడం మానేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఖండించారు. ‘నేను ఫిల్మ్ మేకింగ్‌ను వదిలేయట్లేదు. షారుఖ్ ఖాన్ కంటే బిజీగా ఉన్నా. 2028 వరకు డేట్స్ ఖాళీ లేవు. 5 సినిమాలు డైరెక్ట్ చేస్తున్నా. త్వరలోనే రిలీజ్ అవుతాయి. నేను నిరాశతో ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయానని అనుకునే వాళ్లందరూ మీది మీరు..’ అంటూ అసభ్య పదజాలంతో <>ట్వీట్<<>> చేశారు.

News April 18, 2025

భారీగా తగ్గిన ధరలు.. కేజీ రూ.10

image

తెలుగు రాష్ట్రాల్లో టమాటా రేట్లు భారీగా పడిపోవడంతో గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతున్నారు. క్వింటా కనీస ధర రూ.800, గరిష్ఠ ధర రూ.1,480 పలుకుతోంది. వారం క్రితం గరిష్ఠ ధర రూ.1,800 నుంచి రూ.2,300 వరకు ఉంది. ఈ సీజన్లో సాగు పెరగడం, క్వాలిటీ లేకపోవడం ధరల పతనానికి కారణాలుగా చెబుతున్నారు. కనీస మద్దతు ధర రూ.1,500 ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. బహిరంగ మార్కెట్లో టమాటా కేజీ రూ.10-20గా ఉంది.

News April 18, 2025

ఇషాన్ కిషన్‌పై SRH ఫ్యాన్స్ ఫైర్

image

IPLలో వరుసగా విఫలమవుతున్న SRH స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్‌పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తొలి మ్యాచులో సెంచరీతో రాణించినా ఆ తర్వాత జరిగిన అన్ని మ్యాచుల్లోనూ ఆయన తేలిపోయారు. శతకం తర్వాత జరిగిన 6 మ్యాచుల్లో కలిపి 32 పరుగులే చేశారు. ముంబైతో జరిగిన మ్యాచులోనూ సింగిల్ డిజిట్‌కే ఔటయ్యి తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో ఇషాన్‌ను రూ.11.25 కోట్లకు తీసుకుని SRH భారీ మూల్యమే చెల్లించుకుంటోందని ఫైర్ అవుతున్నారు.

News April 18, 2025

గుడ్‌ప్రైడే ఎందుకు జరుపుకుంటారో తెలుసా!

image

గుడ్ ఫ్రైడే రోజున ఏసుక్రీస్తు శిలువపై మరణించారని క్రైస్తవులు విశ్వసిస్తారు. మానవాళి సంక్షేమం కోసం ప్రేమ, కరుణ, క్షమాపణ లాంటి గొప్ప సద్గుణాల్ని ఏసు బోధిస్తుంటారు. అది నచ్చని అప్పటి రాజులు క్రీస్తును శిలువ వేస్తారు. ఆ రోజునే క్రైస్తవులు గుడ్‌ఫ్రైడేగా జరుపుకుంటారు. నల్లని వస్త్రాలు ధరించి తమ పాపాలకు ఏసును క్షమాపణ అడుగుతారు. ఇది జరిగిన 3వ రోజు ఆయన మళ్లీ జన్మించారనే నమ్మకంతో ఈస్టర్ డే జరుపుకుంటారు.

News April 18, 2025

భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు

image

AP: వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ గోశాలపై ఆయన అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.

News April 18, 2025

‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ పబ్లిక్ టాక్

image

కళ్యాణ్ రామ్, విజయశాంతి కీలకపాత్రల్లో నటించిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా ప్రీమియర్ షోలు స్టార్ట్ అయ్యాయి. ఈ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో యాక్షన్ సీన్స్ బాగున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందంటున్నారు. కళ్యాణ్ రామ్, విజయశాంతి నటన మూవీకి ప్లస్ పాయింట్ అని, అయితే స్టోరీ ఊహించేలా ఉందని పోస్టులు చేస్తున్నారు. కాసేపట్లో Way2News ఫుల్ రివ్యూ.

error: Content is protected !!