News March 30, 2024

ఏపీ స్పీకర్‌కు వ్యతిరేక పవనాలు!

image

ఆముదాలవలసలో ఏపీ స్పీకర్ తమ్మినేనికి సొంత పార్టీ నుంచే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. స్థానికంగా వైసీపీ కీలక నేత సువ్వారి గాంధీకి, తమ్మినేనికి మధ్య విభేదాలున్నాయి. ఈ క్రమంలోనే సీతారాంకు టికెట్ ఇవ్వడాన్ని గాంధీ వ్యతిరేకిస్తున్నారు. పార్టీ పదవులకు, నామినేటెడ్ పదవులకు గాంధీ దంపతులు, సంబంధీకులు రాజీనామాలు చేసేశారు. స్వతంత్రంగా బరిలో దిగుతామంటున్నారు. దీంతో 20వేల వరకు ఓట్లు చీలే అవకాశం కనిపిస్తోంది.

News March 30, 2024

ఆర్సీబీకి కొరకరాని కొయ్యగా కోల్‌కతా

image

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ తన రికార్డు నిలబెట్టుకుంది. వరుసగా తొమ్మిదో ఏడాది కూడా బెంగళూరుపై నెగ్గింది. సొంత మైదానంలో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 2016 నుంచి చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతాకు ఓటమే ఎదురుకాలేదు. ఈ స్టేడియం కేకేఆర్‌కు సొంత మైదానంలా మారింది.

News March 30, 2024

శర్వానంద్ సినిమాకు బాలయ్య మూవీ టైటిల్?

image

యువనటుడు శర్వానంద్ ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’ టైటిల్‌ను వాడుకోవాలని అనుకుంటున్నారట మూవీ టీమ్. అబ్బరాజు తన గత సినిమాకు కూడా సామజవరగమన వంటి అచ్చ తెలుగు టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే.

News March 30, 2024

నాకు తండ్రి కావాలని ఉంది: విజయ్ దేవరకొండ

image

తనకు తండ్రి కావాలని ఉందని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ ప్రమోషన్లలో భాగంగా ఆయన మాట్లాడారు. ‘నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. కచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటా. నేను చేసుకోబోయే అమ్మాయి నా తల్లిదండ్రులకు నచ్చాలి. అప్పుడు వివాహం చేసుకుంటా’ అని ఆయన పేర్కొన్నారు. కాగా విజయ్ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ వచ్చే నెల 5న విడుదల కానుంది.

News March 30, 2024

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బుమ్రా?

image

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యపై యాజమాన్యం వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. అతడిపై ముంబై ఫ్రాంచైజీ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఆ జట్టు ఓటములకు అతడే కారణమని భావిస్తున్నట్లు టాక్. దీంతో ఆ జట్టు పగ్గాలను స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అప్పగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేనేజ్‌మెంట్ తీవ్ర ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సీజన్‌లో ముంబై ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది.

News March 30, 2024

మళ్లీ హైజాక్.. రంగంలోకి భారత నేవీ

image

అరేబియా సముద్రంలో మరో నౌక హైజాక్‌కు గురైంది. ఇరాన్‌‌కు చెందిన బోటుపై దాడి చేసిన 9మంది సాయుధ సముద్రపు దొంగలు, దాన్ని వారి స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. యెమెన్‌కు సుమారు 90 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న భారత నేవీ అరేబియా సముద్రంలో రంగంలోకి దిగింది. ఆపరేషన్ కొనసాగుతోందని, నౌకను రక్షిస్తామని అధికారులు తెలిపారు.

News March 30, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 30, 2024

మార్చి 30: చరిత్రలో ఈరోజు

image

1867: రష్యా నుంచి అలాస్కాను కొన్న అమెరికా
1929: భారత్‌, ఇంగ్లండ్ మధ్య తొలిసారి విమాన సేవలు
1935: రచయిత తంగిరాల వెంకట సుబ్బారావు జననం
1943: గాయకుడు, నటుడు జిత్ మోహన్ మిత్ర జననం
1948: దివంగత నటుడు కన్నడ ప్రభాకర్ జననం
1983: నటుడు నితిన్ జననం
1971: తొలి తెలుగు నటి సురభి కమలాబాయి మరణం
2011: తెలుగు నటుడు నూతన్ ప్రసాద్ మరణం
☞ ప్రపంచ ఇడ్లీ దినోత్సవం

News March 30, 2024

ఈ రోజు నమాజ్ వేళలు

image

తేది: మార్చి 30, శనివారం
ఫజర్: తెల్లవారుజామున గం.5:00
సూర్యోదయం: ఉదయం గం.6:12
జొహర్: మధ్యాహ్నం గం.12:20
అసర్: సాయంత్రం గం.4:44
మఘ్రిబ్: సాయంత్రం గం.6:29
ఇష: రాత్రి గం.07.42
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 30, 2024

శుభ ముహూర్తం

image

తేది: మార్చి 30, శనివారం
బహుళ పంచమి: రాత్రి 09:14 గంటలకు
అనురాధ: రాత్రి 10:03 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 06:04-06:53 గంటల వరకు
06:53-07:42 గంటల వరకు
వర్జ్యం: తెల్లవారుజాము 12:50-02:25 గంటల వరకు