India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. సాగు నీరు అందక నష్టపోయిన పంటలను పరిశీలించి, రైతులను పరామర్శించనున్నారు. జనగామ జిల్లాలోని ధరావత్ తండా, సూర్యపేట జిల్లాలోని తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటిస్తారు. మ.3 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించి, అనంతరం నల్గొండ జిల్లా నిడమనూరులో రైతులతో మాట్లాడతారు.
TG: రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగ విరమణలు ప్రారంభమయ్యాయి. 2021లో అప్పటి సర్కార్ ఉద్యోగుల విరమణ వయస్సును 58 నుంచి 61కి పెంచింది. దీంతో అప్పట్లో రిటైర్ అవ్వాల్సిన వారి ఉద్యోగ విరమణ మరో మూడేళ్లు పెరిగింది. ఆ గడువు మార్చి 31తో ముగుస్తోంది. ఇవాళ ఆదివారం కావడంతో సుమారు 336 మంది ఉద్యోగులు నిన్నే విరమణ పొందారు.
భారతీయులకు ఆధార్ కార్డు చాలా ముఖ్యం. అంతటి ప్రాధాన్యం ఉన్న ఆధార్‌ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొందరు నిర్లక్ష్యంగా పోగొట్టుకుంటారు. అలాంటప్పుడు వెంటనే కొత్త కార్డుకు అప్లై చేసుకోవాలి. retrieve-eid-uid వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పేరు, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ, క్యాప్చా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మొబైల్‌కు OTP వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అద్దె ఇంట్లో ఉంటున్న వారు హౌస్ అలవెన్స్ కోసం రెంటల్ అగ్రిమెంట్ చూపించి పన్ను మినహాయింపు పొందొచ్చు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు మోసానికి తెరతీసినట్లు ఆదాయపు పన్నుశాఖ గుర్తించింది. పన్ను నుంచి తప్పించుకోవడం కోసం ఇతరుల పాన్ కార్డుల్ని అనధికారికంగా వాడేస్తున్నారట. సదరు పాన్‌కార్డుదారుడికీ ఆ విషయం తెలీదు. ఇలా అద్దెకు లేకపోయినా రెంట్ చెల్లిస్తున్నట్లు పేర్కొన్న 8-10వేల కేసులపై దర్యాప్తు చేస్తున్నారు.
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 733 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు 10+2 విధానంలో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ITI కోర్సుల్లో పాసై ఉండాలి. 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసున్న వారు అర్హులు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి. చివరి తేదీ ఏప్రిల్ 12.
> secr.indianrailways.gov.in
సుధాకర్ చెరుకూరి నిర్మాతగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా మరో సినిమా తెరకెక్కనుంది. గతేడాది వీరి కాంబినేషన్‌లో వచ్చిన దసరా సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. నాని 33 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ కొత్త చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌కి ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ మేరకు ప్రీ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘నాయకుడిగా ఉండటానికి గుర్తింపు అవసరం లేదు’ అని క్యాప్షన్ ఇచ్చారు.
AP: చంద్రబాబు, ఆయన తోక పార్టీకి ఏనాడూ వాలంటీర్లు అంటే ఇష్టం లేదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేష్‌తో ఈసీకి లేఖ రాయించి వాలంటీర్ల సేవలను నిలిపివేయించారని దుయ్యబట్టారు. ‘ప్రజలకు మేలు చేసేది ఏదైనా బాబుకి నచ్చదు. పెన్షన్ల కోసం వృద్ధులు ఎండలో నిలబడి సొమ్మసిల్లి పడిపోతే ఆయనకు సంతోషం. వాలంటీర్లపై చంద్రబాబు కపట ప్రేమ నేడు బయటపడింది’ అంటూ విరుచుకుపడ్డారు.
ఈరోజు వరల్డ్ ఇడ్లీ డే సందర్భంగా ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఓ విషయాన్ని వెల్లడించింది. HYDలో ఓ కస్టమర్ గత 12నెలల్లో ₹7.3లక్షలు ఖర్చు చేసి ఇడ్లీలు ఆర్డర్ పెట్టారని తెలిపింది. ఏడాదికి లెక్కేస్తే రోజుకు ₹2000. టిఫిన్‌కే అంత ఖర్చు చేస్తే.. లంచ్, డిన్నర్‌కి ఎంత ఖర్చు చేసి ఉంటారో మీరే అంచనా వేయండి. ఇదిలా ఉంటే దేశంలో బెంగళూరు, HYD, చెన్నై అత్యధికంగా ఇడ్లీలు ఆర్డర్ చేస్తున్నట్లు పేర్కొంది.
TG: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూముల కుంభకోణం జరిగిందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. ‘తుంకుంటా మండలంలో 26 ఎకరాల అటవీ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేశారు. బొమ్మరాసిపేటలో 1065 ఎకరాల ప్రైవేటు భూమిని ధరణిని అడ్డం పెట్టుకుని వేరే వ్యక్తులకు బదలాయించారు. గజ్వేల్‌లో బినామీలకు, షాద్‌నగర్‌లో రూ.9లక్షల చొప్పున అసైన్డ్ భూములు కంపెనీలకు అప్పగించారు’ అని మండిపడ్డారు.
AP: అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ‘టీడీపీ హయాంలో పరిశ్రమలు తెస్తే వైసీపీ నేతలు వాటి నుంచి వసూళ్లు మొదలుపెట్టారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపాం. ఛార్జీలు పెంచకుండా కోతలు లేని కరెంట్ ఇచ్చాను. ప్రజలు జగన్‌ను ఓడించడం ఖాయం. మన సభలు జనాలతో కళకళలాడుతుంటే.. జగన్ సభలు వెలవెలబోతున్నాయి’ అని ఎద్దేవా చేశారు.
Sorry, no posts matched your criteria.