News April 7, 2024

FLASH: ముంబైకి తొలి విజయం

image

ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై తొలి విజయాన్ని అందుకుంది. ఢిల్లీపై 29 పరుగుల తేడాతో గెలిచింది. 235 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 205/8 స్కోర్ చేయగలిగింది. పృథ్వీ షా 66, అభిషేక్ పోరెల్ 41 రాణించగా, చివర్లో స్టబ్స్ 25 బంతుల్లోనే 71 పరుగులు(7 సిక్సులు, 3 ఫోర్లు) చేసినా ఫలితం లేకపోయింది. ముంబై బౌలర్లలో గెరాల్డ్ 4, బుమ్రా 2 వికెట్లు, షెఫర్డ్ ఒక వికెట్ తీశారు.

News April 7, 2024

IPL: టాస్ గెలిచిన LSG

image

ఈరోజు LSG, GTకి మధ్య జరగనున్న మ్యాచ్‌లో లక్నో టాస్ గెలుపొంది బ్యాటింగ్ ఎంచుకుంది. లక్నో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

GT జట్టు: గిల్, సుదర్శన్, విజయ్ శంకర్, బీఆర్ శరత్, తెవాతియా, రషీద్, నల్కండే, నూర్ అహ్మద్, ఉమేశ్, స్పెన్సర్, మోహిత్

LSG జట్టు: డికాక్, రాహుల్, పడిక్కల్, స్టొయినిస్, పూరన్, బదోనీ, కృనాల్, బిష్ణోయీ, యశ్ థాకూర్, నవీన్ ఉల్-హక్, మయాంక్ యాదవ్

News April 7, 2024

దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్: CBN

image

AP: తాము అధికారంలోకి వస్తే దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్ ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. పలువురు దివ్యాంగులు తమను కలిసిన సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘వైసీపీ పాలనలో దివ్యాంగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మేం అధికారంలోకి రాగానే దివ్యాంగులకు అండగా ఉంటాం. సాధారణ పెన్షన్లు కూడా నెలకు రూ.4వేలకు పెంచుతాం. మహిళలకు నెలకు రూ.1500 అందిస్తాం. ఇంట్లో ఎంతమంది ఉన్నా.. అందరికీ ఇస్తాం’ అని చెప్పారు.

News April 7, 2024

‘హ్యాపీ డేస్’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్

image

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘హ్యాపీ డేస్’ మూవీ రీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 19 ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గ్లోబల్ సినిమాస్ ఈ చిత్రాన్ని థియేటర్లలో రీరిలీజ్ చేయనుంది. కాగా ఈ మూవీలో వరుణ్ సందేశ్, నిఖిల్ సిద్ధార్థ, తమన్నా, కమలినీ ముఖర్జీ కీలకపాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమా 2007లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

News April 7, 2024

ఘోరం: 29 గంటలపాటు ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్య

image

కేరళలోని వయనాడ్ వెటర్నరీ విద్యార్థి సిద్ధార్థన్(20) FEB 18న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో తాజాగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ‘FEB 16న ఉ.9 నుంచి మరుసటి రోజు మ.2 వరకు 29 గంటలపాటు సిద్ధార్థన్‌పై సీనియర్లు క్రూరంగా దాడి చేశారు. బెల్టులతో కొడుతూ ర్యాగింగ్ చేశారు. దీంతో మానసిక ఒత్తిడికి గురై అతను బాత్‌రూమ్‌లో ఉరివేసుకున్నాడు’ అని పోలీసులు నివేదించారు. కాగా ఈ కేసును CM విజయన్ CBIకి అప్పగించారు.

News April 7, 2024

పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇస్తాం: స్టాలిన్

image

విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ వైతిలింగానికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. పుదుచ్చేరి సీఎం రంగస్వామి కేంద్రం చేతిలో కీలుబొమ్మ అని విమర్శించారు. బీజేపీ పదేళ్ల పాలనలో ఈ ప్రాంతానికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. కాగా ఇక్కడి ఏకైక ఎంపీ స్థానానికి ఈ నెల 19న పోలింగ్ జరగనుంది.

News April 7, 2024

మరో 2 నెలల్లో మళ్లీ ‘జగన్ అనే నేను’: వైఎస్ జగన్

image

AP: మరో 2 నెలల్లో మళ్లీ ‘జగన్ అనే నేను’ అంటూ తాను ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. ‘అధికారాన్ని చంద్రబాబు దోచుకోవడానికి ఉపయోగించాడు. నేను సంక్షేమానికి వినియోగించాను. ప్రతి గ్రామంలో మా సంక్షేమ కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టడమే. ఇలాంటి మోసగాళ్ల బారి నుంచి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునేందుకు మీరంతా సిద్ధమేనా’ అంటూ ప్రశ్నించారు.

News April 7, 2024

అభివృద్ధికి ఓటేస్తారా? విధ్వంసానికి వేస్తారా?: చంద్రబాబు

image

AP: అభివృద్ధికి ఓటు వేస్తారా? విధ్వంసానికి వేస్తారా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు. ‘ఈ ఐదేళ్లలో వైసీపీ అరాచకాలు తప్ప ఏమీ చేయలేదు. సంక్షేమానికి ఓటు వేస్తారా? సంక్షోభం సృష్టించిన వైసీపీకి వేస్తారా? వైసీపీలో అరాచకాలు చూసి ఆ పార్టీ నేతలు టీడీపీలోకి వస్తున్నారు. జగన్ 27 సంక్షేమ పథకాలను రద్దు చేశారు’ అని పామర్రులో టీడీపీ ప్రజాగళం సభలో బాబు ఆరోపించారు.

News April 7, 2024

చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమైనా గుర్తొస్తుందా?: సీఎం జగన్

image

చంద్రబాబు పేరు చెబితే ఒక పథకమైనా గుర్తొస్తుందా అంటూ ‘మేమంతా సిద్ధం’ సభలో సీఎం జగన్ ప్రశ్నించారు. ‘మేనిఫెస్టోను 99శాతం అమలు చేసి ఎన్నికలకు వెళ్తున్నాం. సంక్షేమం చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గగ్గోలు పెట్టారు. ప్రతి సంక్షేమ పథకంలో మీ బిడ్డ కనిపిస్తాడు. వాలంటీర్లను చంద్రబాబు ఆంబోతులంటూ కించపరిచాడు. ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గని కడుపుమంట చంద్రబాబుది’ అని పేర్కొన్నారు.

News April 7, 2024

కోచ్ అవతారం ఎత్తనున్న పాక్ సెలక్టర్లు

image

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో తమ జట్టుకు పాకిస్థాన్ సెలక్టర్లు కోచ్‌గా వ్యవహరించనున్నారు. మహమ్మద్ యూసుఫ్, అబ్దుల్ రజాక్ తాత్కాలిక హెడ్ కోచ్, అసిస్టెంట్ కోచ్‌గా సేవలు అందించనున్నారు. WC నుంచి పాక్ జట్టు కోచ్ లేకుండానే మ్యాచ్‌లు ఆడుతోంది. ఇటీవల కొందరి పేర్లను పరిశీలించినా వారు ఆసక్తి చూపలేదు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు జాసన్ గిల్లెస్పీ, సౌతాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్ పేర్లను PCB పరిశీలిస్తోంది.