India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో తమ జట్టుకు పాకిస్థాన్ సెలక్టర్లు కోచ్‌గా వ్యవహరించనున్నారు. మహమ్మద్ యూసుఫ్, అబ్దుల్ రజాక్ తాత్కాలిక హెడ్ కోచ్, అసిస్టెంట్ కోచ్‌గా సేవలు అందించనున్నారు. WC నుంచి పాక్ జట్టు కోచ్ లేకుండానే మ్యాచ్‌లు ఆడుతోంది. ఇటీవల కొందరి పేర్లను పరిశీలించినా వారు ఆసక్తి చూపలేదు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు జాసన్ గిల్లెస్పీ, సౌతాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్ పేర్లను PCB పరిశీలిస్తోంది.
లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది. సోమవారం ఉదయం 10.30 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పు వెల్లడిస్తారు. ఏప్రిల్ 16 వరకు తన కొడుకుకు పరీక్షలు ఉన్నాయని అప్పటి వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
వరుస అప్‌డేట్‌లతో పుష్ప-2 టీజర్‌పై మేకర్స్ అంచనాలను పెంచుతున్నారు. మాస్ జాతర అంటూ ఇప్పటికే పలు పోస్టర్లు విడుదల చేసిన మేకర్స్ తాజాగా మరో పోస్టర్‌తో అంచనాలను అమాంతం పెంచేశారు. చేతిలో గొడ్డలితో సింహాసనంపై కూర్చున్న పుష్పరాజ్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక బన్నీ బర్త్ డే సందర్భంగా రేపు ఉదయం 11.07 నిమిషాలకు టీజర్ రిలీజ్ కానుంది. పుష్పరాజ్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే గంటలు లెక్కేసుకుంటున్నారు.
AP: టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రకాశం జిల్లా ‘మేమంతా సిద్ధం’ సభలో సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ‘అవ్వాతాతల్ని చంపుతున్న హంతకుడు చంద్రబాబు. తన మనిషి నిమ్మగడ్డతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయించి పెన్షన్లను నిలిపివేయించాడు. మండే ఎండల్లో పేదల్ని రోడ్డుపై నిలబెట్టాడు. రాజకీయం కోసం పేదల్ని చంపే చంద్రబాబుది శాడిజం కాక మరేమిటి? చంద్రబాబు రాజకీయం మొత్తం దగా, మోసం, వెన్నుపోటే’ అని మండిపడ్డారు.
మాతృత్వంపై కన్నడ నటి హితా చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. మీకు పెళ్లై నాలుగేళ్లవుతున్నా ఎందుకు పిల్లల్ని కనలేదు? అన్న ప్రశ్నకు ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘నాకు పిల్లల్ని కనాలనే ఉద్దేశం లేదు. ఈ విషయంలో భర్త మద్దతు కూడా ఉంది. నా దృష్టిలో సొంతంగా పిల్లల్ని కనడం కన్నా ఓ కుక్క పిల్లని కూడా సొంత బిడ్డలా పెంచుకోవచ్చు. ఇక వృద్ధాప్యం గురించి నాకు ఏ మాత్రం బాధలేదు’ అని ఆమె చెప్పారు.
AP: ఎన్నికల ప్రచారంలో NDA కూటమి దూకుడు పెంచనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు కలిసి ఉమ్మడిగా ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఇరు పార్టీల అధినేతలు ప్రచారం చేయనున్నారు. 10న తణుకు, నిడదవోలు, 11న పి.గన్నవరం, అమలాపురంలో వీళ్ల ప్రచారం ఉండే ఛాన్సుంది.
జై భీమ్ ఫేమ్ TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తోన్న వెట్టియాన్ మూవీని అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. గన్ పట్టుకుని మాస్ లుక్‌లో ఉన్న సూపర్ స్టార్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
AP: వివేకా హత్య కేసుపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి స్పందించారు. ‘ఎవరో సాక్ష్యాలు తారుమారు చేస్తుంటే ఎంపీ అవినాశ్ రెడ్డి అక్కడ ఏం చేస్తున్నారు? హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్న వారికి వైసీపీ టికెట్లు వచ్చాయి. వివేకాను హత్య చేసిన వాళ్లు దర్జాగా బయట తిరుగుతున్నారు. అన్ని ఆధారాలు ఉన్నా చర్యలు లేవు. నిందితుడికే టికెట్ ఇచ్చి గెలిపించాలని జగన్ చూస్తున్నారు’ అని ఆమె ఫైరయ్యారు.
TG: బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7లక్షల కోట్ల అప్పులు చేసిందని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని చెప్పారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అగ్రనేతలు రైతులను లూటీ చేశారని, ఇప్పుడు వారి కోసం ధర్నాలంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
TG: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక కోసం BRS అభ్యర్థి ఎంపికపై మాజీ సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో కేటీఆర్, హారీశ్‌రావు సహా పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ తమ అభ్యర్థిగా శ్రీగణేశ్ పేరును ప్రకటించిన నేపథ్యంలో బలమైన అభ్యర్థి కోసం కేసీఆర్ వేట కొనసాగిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.