News April 8, 2024

విడాకులు తీసుకోనున్న స్టార్ హీరో

image

తమిళ స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకోనున్నారు. చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు చెన్నై మీడియా తెలిపింది. 2022 జనవరిలోనే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి తర్వాత వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురే ఐశ్వర్య. ధనుష్-ఐశ్వర్యలకు 2004లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు.

News April 8, 2024

విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు కొత్త ఫీచర్స్: TSSPDCL

image

వినియోగదారులు తమ సమస్యల పరిష్కారం కోసం ఇక విద్యుత్ శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు TSSPDCLకు సంబంధించిన మొబైల్ యాప్‌లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. కంప్లైట్స్ పరిష్కరించడం, ఇతర సేవల కోసం ‘కన్జూమర్ గ్రీవెన్స్’ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు TSSPDCL ట్వీట్ చేసింది.

News April 8, 2024

ఏలూరులో 50 కిలోల బంగారం సీజ్

image

AP: ఎన్నికల వేళ రాష్ట్రంలో భారీగా బంగారం పట్టుబడటం చర్చనీయాంశమైంది. ఏలూరు జిల్లాలోని కలపర్రు టోల్‌గేట్ వద్ద అధికారులకు 50 కిలోల బంగారం పట్టుబడింది. సరైన పత్రాలు లేకపోవడంతో బంగారాన్ని సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు కర్ణాటకలోనూ ఓ బంగారం షాపు యజమాని నివాసంలో చేపట్టిన దాడుల్లో మూడు కిలోల బంగారం, రూ.5.60కోట్ల క్యాష్ పోలీసులు సీజ్ చేశారు.

News April 8, 2024

శిశువులకు సెక్స్ సర్జరీలపై పిటిషన్.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

image

పుట్టుక సమయంలోనే శిశువులకు ఇంటర్‌సెక్స్ సర్జరీలను నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ అంశంలో అభిప్రాయం తెలపాలంటూ కేంద్రం, ASG ఐశ్వర్యకు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నోటీసులు ఇచ్చారు. పిల్లల ప్రమేయం లేకుండానే వారిని మగ లేదా ఆడగా మార్చడానికి ఆపరేషన్లు చేయడం శిక్షార్హమని పిటిషనర్ పేర్కొన్నారు. తమిళనాడు మాత్రమే ఇలాంటి సర్జరీలను నిషేధించిందన్నారు.

News April 8, 2024

SBI ‘అమృత్ కలశ్’ పథకం గడువు పొడిగింపు

image

స్పెషల్ డిపాజిట్ స్కీమ్ ‘అమృత్ కలశ్’ గడువును SBI సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. 400 రోజుల కాలవ్యవధితో ఉన్న ఈ పథకంలో సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 7.6%, మిగిలిన వారికి 7.1% వడ్డీ లభిస్తుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం వడ్డీపై TDS ఉంటుంది. రూ.2 కోట్ల వరకు డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది. కాగా సాధారణ డిపాజిట్లలో రెండేళ్ల కాలవ్యవధికి సీనియర్లకు 7.3%, ఇతరులకు 6.80% వడ్డీ లభిస్తుంది.

News April 8, 2024

హ్యాపీ బర్త్ డే బన్నీ: జనసేనాని

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘జాతీయ అవార్డుగ్రహీత, చక్కటి అభినయ కౌశలం కలిగిన కథానాయకుడు అల్లు అర్జున్‌కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో బన్నీ మరిన్ని పురస్కారాలు, విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పవన్ ప్రకటన విడుదల చేశారు.

News April 8, 2024

IPL: బ్యాటింగ్‌, బౌలింగ్‌లో మనోళ్లదే హవా

image

IPL2024లో భారత క్రికెటర్ల హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు 21 మ్యాచులు జరగ్గా.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మనోళ్లు సత్తా చాటుతున్నారు. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ 316 రన్స్, సాయి సుదర్శన్ 191, రియాన్ పరాగ్ 185, శుభ్‌మన్ గిల్ 183, శాంసన్ 178 రన్స్‌తో టాప్‌లో కొనసాగుతున్నారు. బౌలింగ్‌లో యుజ్వేంద్ర చాహల్ 8 వికెట్లు, ఖలీల్ అహ్మద్ 7, మోహిత్ శర్మ 7తో టాప్-3లో ఉన్నారు. T20 WC ముంగిట ఇది మంచి పరిణామమే.

News April 8, 2024

‘కన్నప్ప’లో స్టార్ నటీనటులు

image

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ ఫిల్మ్ ‘కన్నప్ప’లో నటిస్తోన్న నటీనటుల జాబితా పెరుగుతోంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సైతం ఈ మూవీలో నటిస్తుండటంతో బిజినెస్ మరింత పెరిగింది. ‘కన్నప్ప’లో నటించేది వీరే.. మంచు విష్ణు, మోహన్ బాబు, ప్రభాస్, మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం, శరత్ కుమార్, కౌశల్, నయనతార, దేవరాజ్‌తో పాటు మరికొందరున్నారు.

News April 8, 2024

కేశినేని నాని మైండ్ పనిచేయట్లేదు: కేశినేని చిన్ని

image

AP: విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నానిపై సోదరుడు, టీడీపీ నేత కేశినేని చిన్ని ఫైరయ్యారు. ఆయన మాదిరి తాను బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టలేదని, ప్రజలను మోసం చేయలేదని స్పష్టం చేశారు. ‘నాని ఓసారి అమరావతి రాజధాని కావాలంటారు.. మరోసారి వద్దంటారు. ఆయనకు మైండ్ పనిచేయట్లేదు. నాని పదేళ్లుగా ఎంపీగా ఉన్నా.. నేనెప్పుడూ ఆఫీస్‌కు వెళ్లలేదు. ఎక్కడా ఆయన తమ్ముడినని చెప్పుకోలేదు’ అని పేర్కొన్నారు.

News April 8, 2024

CSKకు గుడ్ న్యూస్

image

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ నేటి మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నారు. వీసా పనిపై బంగ్లాదేశ్‌కు వెళ్లిన అతడు గత మ్యాచ్‌కు దూరమయ్యారు. తాజాగా అతడు జట్టులో చేరినట్లు తెలుస్తోంది. ఇవాళ చెన్నై వేదికగా కేకేఆర్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముస్తాఫిజుర్, పతిరణ అందుబాటులో ఉంటారని చెన్నై బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమన్స్ తెలిపారు.