News April 8, 2024

CSKకు గుడ్ న్యూస్

image

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ నేటి మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నారు. వీసా పనిపై బంగ్లాదేశ్‌కు వెళ్లిన అతడు గత మ్యాచ్‌కు దూరమయ్యారు. తాజాగా అతడు జట్టులో చేరినట్లు తెలుస్తోంది. ఇవాళ చెన్నై వేదికగా కేకేఆర్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముస్తాఫిజుర్, పతిరణ అందుబాటులో ఉంటారని చెన్నై బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమన్స్ తెలిపారు.

News April 8, 2024

US సాయం చేయకపోతే ఉక్రెయిన్ ఓడిపోతుంది: జెలెన్‌స్కీ

image

రష్యాతో యుద్ధంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు అమెరికా సాయం చేయకపోతే రష్యా చేతిలో ఓటమి తప్పదన్నారు. అమెరికా కాంగ్రెస్ తమకు మిలిటరీ సాయాన్ని ఆమోదించాలని కోరారు. సాయం లేకపోతే తమ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని పేర్కొన్నారు. ఒకవేళ ఉక్రెయిన్ ఓడితే.. ఇతర రాష్ట్రాలపైనా దాడులు జరుగుతాయన్నారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌పై రష్యా మొదలుపెట్టిన దాడి రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది.

News April 8, 2024

జైస్వాల్.. నీ ఆటతీరు మార్చుకో: ఆకాశ్ చోప్రా

image

రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఆట తీరుపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘జైస్వాల్ మళ్లీ స్కోరు చేయలేకపోయాడు. ఆడిన 4మ్యాచుల్లోనూ మూడింట్లో లెఫ్టార్మ్ పేసర్లకే చిక్కాడు. అసలు నువ్వేం చేస్తున్నావ్ యశస్వీ? దయచేసి పట్టుదలగా నిలబడి బ్యాటింగ్ చెయ్యి.. కొన్ని పరుగులు సాధించు’ అని చోప్రా సూచించారు. కాగా గత సీజన్లో ఈ యంగ్ ప్లేయర్ 14 మ్యాచుల్లో 625 రన్స్ చేశారు.

News April 8, 2024

‘బీజేపీతో పొత్తు’.. ఆరోపణలను ఖండించిన ఎన్ఐఏ

image

బెంగాల్‌లో ఎన్నికల వేళ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 2022 పేలుళ్ల కేసులో ఇద్దరు తృణమూల్ నేతలను అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టిన ఆ పార్టీ.. ఎన్నికల వేళ NIA BJP మధ్య పొత్తు కుదిరిందని ఆరోపించింది. మరోవైపు మహిళను వేధించారన్న ఆరోపణలతో NIA అధికారులపై బెంగాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు అరెస్ట్ అయిన TMC నేత మనోబ్రోతో భార్య మోని ఫిర్యాదు చేశారు. కాగా TMC ఆరోపణలను NIA ఖండించింది.

News April 8, 2024

CA పరీక్షల వాయిదాకు కోర్టు నో

image

చార్టెర్డ్ అకౌంటెన్సీ (CA) పరీక్షలు వాయిదా వేయాలన్న విద్యార్థుల పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా పరీక్షలను జూన్‌లో నిర్వహించాలని కొంత మంది సీఏ విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో షెడ్యూల్ ప్రకారమే మే నెలలో సీఏ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

News April 8, 2024

EMU, MEMU, DEMU రైళ్లంటే తెలుసా?

image

EMU(ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) రైళ్లు విద్యుత్ సాయంతో నడుస్తాయి. తక్కువ దూరం ప్రయాణిస్తాయి. ప్రధాన నగరాల్లోని సబర్బన్ ఏరియాలను కలుపుతాయి. ఇవి కాలుష్య రహితమైనవి. MEMU(మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) రైళ్లు సబర్బన్ కంటే ఎక్కువ దూరాలను కవర్ చేస్తాయి. విద్యుత్ ద్వారా నడుస్తాయి. DEMU(డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) రైళ్లు డీజిల్‌తో నడుస్తాయి. నాన్ఎలక్ట్రిఫైడ్ సెక్షన్లలో సేవలందిస్తాయి.

News April 8, 2024

ఉగ్రవాదులకు కాంగ్రెస్ బిర్యానీ పెట్టింది: సీఎం

image

మోదీ నాయకత్వంలో భారతదేశ ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తీవ్రవాదం, ఉగ్రవాదం ముగిసిపోయాయన్నారు. ఉగ్ర అనుమానితుల పట్ల కాంగ్రెస్ మెతక వైఖరి అనుసరించిందని విమర్శించారు. ఆ పార్టీ పాలనలో పేదలు ఆకలితో అలమటించారని, ఉగ్రవాదులకు మాత్రం బిర్యానీ పెట్టి పోషించారని ఫైరయ్యారు. మోదీ సర్కారు గత నాలుగేళ్లుగా 80 కోట్ల మంది పౌరులకు ఉచిత రేషన్ అందిస్తోందని యోగి గుర్తు చేశారు.

News April 8, 2024

ఈ వారం విడుదలయ్యే సినిమాలివే..

image

ఈ వారం పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. అజయ్ దేవ్‌గన్-ప్రియమణి ‘మైదాన్’ ఏప్రిల్ 10న విడుదల కానుంది. తెలుగులో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’, ‘బిచ్చగాడు’తో తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచిన విజయ్ ఆంటోనీ మూవీ ‘లవ్ గురు’ ఈ నెల 11న థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. విశ్వక్‌సేన్ ‘గామి’ (జీ5), ‘ప్రేమలు’(ఆహా), ‘లాల్ సలామ్’ (సన్ నెక్ట్స్)లో ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.

News April 8, 2024

టీజర్‌కు యూట్యూబ్ షేక్.. ప్రశంసలు కురిపించిన హీరో నాని

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజైన ‘పుష్ప-2’ సినిమా టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ వీడియోకు యూట్యూబ్‌లో కేవలం 40 నిమిషాల్లోనే రెండు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈక్రమంలో బన్నీకి బర్త్ డే విషెస్ తెలుపుతూ టీజర్‌ అదిరిపోయిందని నేచురల్ స్టార్ నాని ట్వీట్ చేశారు. సుక్కు సార్ మాత్రమే ఇలాంటివి చేయగలరని, బన్నీ మాత్రమే అలా చేయగలరంటూ అభినందించారు. నటి అనసూయ సైతం ప్రశంసలతో ముంచెత్తారు.

News April 8, 2024

మా వాడంటే ఇంత ఓర్వలేని తనమా?: VDK మేనమామ ఫైర్

image

విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీపై నెగటివ్ ప్రచారంపై అతని మేనమామ యశ్ రంగినేని ఫైరయ్యారు. ‘ఎందుకురా మా వాడి వెంట ఇలా పడ్డారు. ఇంత కసా? ఇంత ఓర్వలేని తనమా? లేక మావోడి కటౌట్ చూసి భయమా? వేరే హీరో సినిమాలకు లేని లాజిక్స్ మావోడి మూవీలకు మాత్రం భూతద్దం పెట్టి వెతుకుతున్నారు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి హీరోగా పెరు తెచ్చుకుంటే తప్పా?’ అని ఇన్‌స్టాలో పోస్టు చేశారు.