India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు గుడ్ న్యూస్. గత నెలలో నిర్వహించిన పరీక్షల మూల్యాంకనం పూర్తైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 47,88,738 జవాబు పత్రాలను 25వేల మందికి పైగా సిబ్బంది మూల్యాంకనం చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో మూల్యాంకనంలో ఎలాంటి ఆటంకం చోటు చేసుకోలేదని పేర్కొన్నారు. వచ్చే నెలలో పదో తరగతి ఫలితాలు రానున్నట్లు సమాచారం.
అక్కినేని అఖిల్, దర్శకుడు సురేందర్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సినిమా విడుదలై ఏడాది కావొస్తున్నా ఇంకా OTTలోకి రాలేదు. తాజాగా ఓ అభిమాని నిర్మాత అనిల్ సుంకరను ట్యాగ్ చేస్తూ ఏజెంట్ OTT రిలీజ్ చేయమని కోరారు. దీనికి ఆయన బదులిస్తూ మూవీ డిజిటల్ రైట్స్ B4Uకి ఇచ్చామని, వారు సోనీకి ఇచ్చినట్లు తెలిపారు. త్వరలో OTTలోకి వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.
చెపాక్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్కే సునాయాస విజయం సాధించింది. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రుతురాజ్ హాఫ్ సెంచరీతో(67* రన్స్) రాణించారు. దూబే 18 బంతుల్లో 28 రన్స్‌తో మెరుపులు మెరిపించారు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు, నరైన్ ఒక వికెట్ తీశారు. ఈ సీజన్‌లో కేకేఆర్‌కు ఇదే తొలి ఓటమి.
AP: తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘క్రోధి నామ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. క్రోధి అంటే కోపంతో ఉన్నవారు.. మీ ఆగ్రహం ధర్మాగ్రహం కావాలి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పాలన రావాలని కోరుకుందాం. ఈ ఉగాది ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించాలి’ అని ఆయన ఆకాంక్షించారు.
TG: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఇప్పటి వరకు రూ. 71కోట్లకు పైగా డబ్బు, విలువైన ఇతర వస్తువుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ.29.30 కోట్ల నగదు, రూ.9.54 కోట్ల మద్యం, రూ.15.34 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.10.33 కోట్ల విలువైన అభరణాలు, రూ.7.04 కోట్ల విలువైన ఇతర వస్తువులు ఉన్నట్లు వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాలు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్న సంగతి తెలిసిందే.
TG: మోడల్ స్కూళ్లలో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మే 25న ఫలితాలను విడుదల చేస్తామని.. అర్హత సాధించిన వారు మే 27 నుంచి 31వ తేదీ వరకు ప్రవేశాలు పొందవచ్చని పేర్కొంది. 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతి నుంచి 9వ తరగతి ప్రవేశాల కోసం ఏప్రిల్ 7న పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
నేటి కాలుష్యం కారణంగా ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడం సవాలుగా మారుతోంది. అయితే, నీటితో తరచూ శుభ్రం చేసుకుంటే ముఖాన్ని రక్షించుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. ‘మృతకణాలు, సహజసిద్ధంగా చర్మం నుంచి వచ్చే నూనె వలన వదనం కళావిహీనం అవుతుంటుంది. రోజుకు కనీసం 2సార్లు ముఖాన్ని నీటితో కడుక్కోవడం ద్వారా ఈ సమస్యకు కొంతమేర చెక్ పెట్టొచ్చు. సుదీర్ఘకాలంలో మొటిమలు తగ్గే ఛాన్స్ కూడా ఉంది’ అని నిపుణులు చెబుతున్నారు.
TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని బీఆర్ఎస్ కోరింది. ఎన్నికల కోడ్ వేళ కేసీఆర్‌పై రాహుల్ దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని పేర్కొంది. ఎంపీ ఎన్నికల్లో రాహుల్ ప్రచారం చేయకుండా నిషేధించాలంది. మరోవైపు కేటీఆర్‌పై కొండా సురేఖ నిరాధార ఆరోపణలు చేశారని.. ఆమెనూ ప్రచారంలో పాల్గొనకుండా నిషేధించాలని కోరింది.
TG: వరంగల్(D) నెక్కొండలో ఐస్‌క్రీములు విక్రయించే వ్యక్తి ఐస్‌క్రీమ్ డబ్బాలో వీర్యం/మూత్రం కలిపారనే వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఐస్‌క్రీమ్ శాంపిల్స్‌ను పరీక్షించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు తాజాగా నివేదికను విడుదల చేశారు. దీనిలో ఎలాంటి వీర్యం/మూత్రం ఆనవాళ్లను గుర్తించలేదని నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు.
శౌర్యవ్ దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘హాయ్ నాన్న’. దేశీయంగా వివిధ అవార్డుల్ని సొంతం చేసుకున్న ఈ ఫిల్మ్, అంతర్జాతీయంగానూ సత్తా చాటింది. న్యూయార్క్‌లో జరిగిన ‘ది ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్’లో ఏకంగా 11 పురస్కారాలను దక్కించుకుంది. ఉత్తమ చిత్రం సహా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి తదితర విభాగాల్లో మూవీకి అవార్డుల పంట పండింది. అంతర్జాతీయంగా ఈ సినిమాను ‘హాయ్ డాడీ’గా రిలీజ్ చేశారు.
Sorry, no posts matched your criteria.