News April 9, 2024

ఆ పాట నాకు చాలా ఇష్టం: ఎన్టీఆర్

image

‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు బలగం సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’ పాట అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఈ విషయం గేయ రచయిత కాసర్ల శ్యామ్‌కు చెప్పానన్నారు. ఆయన వాడే పదాల్లో మట్టి వాసన ఉంటుందని కొనియాడారు. సిద్ధూ, విశ్వక్ సేన్‌ను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. కొత్త ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడానికి ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలన్నారు.

News April 9, 2024

గాజాలో పరిస్థితులు ఆందోళనకరం: భారత్

image

గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభం ఆందోళన కలిగిస్తోందని UNOలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఇప్పటికే మహిళలు, చిన్నారులు వేల సంఖ్యలో మరణించారని.. దీనిని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. సామాన్య పౌరులను బందీలుగా చేసుకోవడాన్ని ఏమాత్రం సమర్థించమని పేర్కొన్నారు. అక్కడి ప్రజలకు మానవతా సాయాన్ని పెంచాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

News April 9, 2024

ఇవాళ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బ్రేక్

image

AP: సీఎం జగన్ చేస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఇవాళ బ్రేక్ పడింది. ఉగాది పండుగ సందర్భంగా జగన్ విరామం ప్రకటించారు. పల్నాడు జిల్లా గంటావారిపాలెంలో ఆయన ఉగాది వేడుకల్లో పాల్గొననున్నారు. సతీమణి భారతీరెడ్డితో కలిసి పూజలు చేయనున్నారు. రేపటి నుంచి యథావిధిగా యాత్ర కొనసాగనుంది.

News April 9, 2024

ఏడడుగులు కలిసి నడిస్తే వివాహమైనట్లే: అలహాబాద్ హైకోర్టు

image

వివాహ విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లి జరిగిందనడానికీ కన్యాదానం ప్రమాణం కాదనీ, వధూవరులు ఏడడుగులు నడిచినప్పుడే వారు దంపతులైనట్లు తెలిపింది. అత్తింటి వారు దాఖలు చేసిన క్రిమినల్ కేసులో అశుతోశ్ యాదవ్‌ను ఉద్దేశించి కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తనకు కన్యాదానం జరగలేదని వివాహం చెల్లదని యాదవ్ వాదించగా.. హిందూ వివాహ చట్ట ప్రకారం ఏడడుగులే ముఖ్యమని పేర్కొంది.

News April 9, 2024

ఆ సినిమాను ఎంజాయ్ చేయలేకపోయా: జగపతి బాబు

image

‘గుంటూరు కారం’ సినిమాను తాను ఎంజాయ్ చేయలేకపోయానని నటుడు జగపతి బాబు అన్నారు. మహేశ్‌తో కలిసి పనిచేయడం తనకు ఎప్పుడూ ఇష్టమేనని.. సినిమాలో కొన్ని పాత్రల్లో మార్పులు చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. క్యారెక్టరైజేషన్ ఎక్కువగా ఉండటంతో గందరగోళం ఏర్పడిందన్నారు. తన పాత్ర కోసం చేయాల్సిందంతా చేశానని తెలిపారు.

News April 9, 2024

తుని: దాడిశెట్టి హ్యాట్రిక్కా? దివ్య బోణీ కొట్టేనా?

image

AP: ఏకపక్ష తీర్పునకు కేరాఫ్ అడ్రస్ తుని. 1952 నుంచి 1978 వరకు INC, 1983 నుంచి 2004 వరకు TDP, 2009లో INC, 2014, 19లో YCP గెలిచింది. 15 ఎన్నికల్లో కేవలం ఐదుగురే MLAలయ్యారు. వెంకట కృష్ణంరాజు బహదూర్, విజయలక్ష్మి, రాజా అశోక్‌బాబు(INC), యనమల రామకృష్ణుడు(TDP), దాడిశెట్టి రాజా(YCP) గెలిచారు. ఈసారి దాడిశెట్టి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తుండగా, టీడీపీ యనమల దివ్యను బరిలో దింపింది.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 9, 2024

తమిళనాడులో 35 చోట్ల ఈడీ సోదాలు

image

తమిళనాడులో 35 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. డీఎంకే ముఖ్యనేతల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ కేసులో అరెస్టైన సాధిక్‌తో సంబంధమున్న సినీ ప్రముఖుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. దర్శకుడు, నటుడు అమీర్ ఇంట్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

News April 9, 2024

మే 10న OTTలోకి ‘ఆడుజీవితం’!

image

బ్లెస్సీ డైరెక్షన్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఆడుజీవితం’ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ+హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. మే 10 నుంచి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. 2.53 గంటల నిడివితో థియేటర్లలో రిలీజ్ చేయగా, ఓటీటీలో 3.30 గంటలు ఉంటుందని తెలుస్తోంది. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

News April 9, 2024

ఇవాళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గృహ ప్రవేశం

image

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఇటీవల అద్దెకు తీసుకున్న ఇంట్లో గృహ ప్రవేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అక్కడే ఉగాది వేడుకల్లో పాల్గొంటారని పేర్కొన్నాయి. కాగా రేపు తణుకు, నిడదవోలు, 11న పి.గన్నవరం, అమలాపురంలో చంద్రబాబుతో కలిసి ఆయన ప్రచారం చేయనున్నారు.

News April 9, 2024

BREAKING: గుండెపోటుతో ఐపీఎస్ అధికారి కన్నుమూత

image

TG: సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ గుండెపోటుతో చనిపోయారు. ఉదయం ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఏఐజీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ డీజీగా ఉన్నారు. ఈయన 1991 బ్యాచ్‌కు చెందినవారు. గతంలో ఆపరేషన్ ఐజీ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ, కరీంనగర్ ఎస్పీగా చేశారు.