News April 9, 2024

కూటమి 128 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాల్లో గెలుపు: పండితులు

image

AP: తెలుగు నూతన సంవత్సరంలో ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. తెలుగుజాతికి పూర్వవైభవం తీసుకురావాలని సంకల్పం తీసుకుందామని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకల్లో పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలనేది తన ఆలోచన అని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో TDP-JSP-BJP కూటమి 128 అసెంబ్లీ, 24 ఎంపీ సీట్లు గెలుస్తుందని పండితులు చెప్పారు.

News April 9, 2024

CEC రాజీవ్ కుమార్‌కు Z కేటగిరీ భద్రత!

image

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కమార్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన దేశంలో ఎక్కడికెళ్లినా CRPF జవాన్లు భద్రత కల్పించనున్నట్లు సమాచారం. జెడ్ కేటగిరీ కింద CEC వెంట నిరంతరం ఆరుగురు గన్‌మెన్లు ఉంటారు. అలాగే ఆయన ఇంటి వద్ద ఇద్దరు సిబ్బంది రక్షణగా ఉండనున్నారు.

News April 9, 2024

విజయ్ దేవరకొండకి జంటగా క్రేజీ హీరోయిన్?

image

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన క్రేజీ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. విజయ్ తర్వాతి చిత్రంలో ఆయనకు జోడీగా ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజూ నటించనున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో ఈ జోడీ ఖరారైనట్లు వెల్లడించాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ మూవీలో విజయ్ పోలీస్‌గా కనిపిస్తారని సమాచారం.

News April 9, 2024

ఒకే కుటుంబం.. ఒకేసారి 17 మందికి పెళ్లి

image

ఒక పెళ్లి చేయడానికే తంటాలు పడుతున్న రోజులివి. అలాంటిది ఒకే ఇంట్లో 12 మంది మనవరాళ్లు, ఐదుగురు మనవళ్లకు 2 రోజుల్లోనే పెళ్లి చేశాడో తాత. రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలోని సూర్జారామ్ గోదారా అనే వ్యక్తి తన సొంతింట్లోనే ఈ సామూహిక వివాహాలు జరిపించాడు. ఏప్రిల్ 1, 2 తేదీల్లో ఈ వేడుక జరిగింది. అందరి పేర్లతో ఒకే శుభలేఖ ముద్రించడం విశేషం. అటు ఖర్చు తగ్గించడంతోపాటు వేడుక జీవితంలో గుర్తుండిపోయేలా చేశాడు.

News April 9, 2024

ఈ ఏడాది నా కొడుకుకి చాలా కీలకం: కవిత

image

బోర్డ్ ఎగ్జామ్స్ రాయనున్న తన కుమారుడికి ఈ ఏడాది చాలా కీలకమని లేఖలో కవిత పేర్కొన్నారు. తల్లిగా కుమారుడి పక్కన ఉండాల్సిన సమయమిదని తెలిపారు. తన చిన్న కుమారుడి పరీక్ష సమయంలో పక్కన లేకపోవడం అతనిపై ప్రభావం చూపిస్తుందనే భయాన్ని ఆమె వ్యక్తం చేశారు. దయచేసి తన బెయిల్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని జడ్జిని కోరారు.

News April 9, 2024

నా బ్యాచ్‌మేట్‌ను కోల్పోయాను: CV ఆనంద్

image

తన బ్యాచ్‌మేట్ అయిన తెలంగాణ IPS అధికారి రాజీవ్ రతన్ గుండెపోటుతో చనిపోవడం పట్ల ACB డీజీ సీవీ ఆనంద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘రాజీవ్ చనిపోయారనే వార్తతో నిద్రలేచాను. ఉగాది పండుగ రోజున ఇలాంటి బ్యాడ్ న్యూస్ వింటాననుకోలేదు. గత నెలలోనే మేము ఆల్ ఇండియా పోలీస్ గోల్ఫ్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు షిల్లాంగ్ వెళ్లాం. ఆయన భార్య, కుమారునికి నా ప్రగాఢ సానుభూతి. కేవలం ఆయన జ్ఞాపకాలే మిగిలాయి’ అని ట్వీట్ చేశారు.

News April 9, 2024

BIG BREAKING: లేఖ విడుదల చేసిన కవిత

image

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత మీడియాకు నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు. ‘లిక్కర్ కేసుతో నాకెలాంటి సంబంధం లేదు. నేను తప్పు చేశాననడానికి ఆధారాలు కూడా లేవు. రెండున్నరేళ్ల విచారణలో ఎలాంటి రుజువు లభించలేదు. వేరే వ్యక్తుల స్టేట్‌మెంట్‌తో నన్ను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో నేను ఎలాంటి ఆర్థిక లబ్ధి పొందలేదు. కేవలం బాధితురాలిని మాత్రమే’ అని కవిత పేర్కొన్నారు.

News April 9, 2024

చరిత్రలో తొలిసారి

image

దేశీయ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ రోజు రోజుకూ కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. సెన్సెక్స్ చరిత్రలోనే తొలిసారి 75 వేల మార్కును తాకింది. ఇవాళ 300 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతోంది. నిన్న దేశీయ మార్కెట్‌లో నమోదైన కంపెనీల విలువ రూ.400 లక్షల కోట్ల మార్క్ దాటిన సంగతి తెలిసిందే.

News April 9, 2024

ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లకు అండగా RCB?

image

ఈ IPL సీజన్‌లో ఫామ్‌లోలేని ఆటగాళ్లు RCBపై చెలరేగి ఆడుతున్నారు. దీనిపై నెట్టింట జోకులు పేలుతున్నాయి. తొలి 3 మ్యాచ్‌ల్లో 35 రన్స్ చేసిన బట్లర్.. RCBపై శతకంతో రెచ్చిపోయాడు. అసలు బ్యాటింగే మర్చిపోయిన సునీల్ నరైన్ 22 బంతుల్లోనే 47 రన్స్ బాదాడు. ఫామ్‌లోలేని డీకాక్ 56 బంతుల్లో 81 పరుగులు సాధించారు. హర్‌ప్రీత్ బ్రార్‌కు RCBతో మ్యాచ్ అంటే పండగే. వీళ్లతో మ్యాచ్ అంటే బ్రార్ 2, 3 వికెట్లు తీయాల్సిందే.

News April 9, 2024

పుష్ప-2: ఒక్క సీన్ కోసం.. 51 టేక్స్!

image

‘పుష్ప-2’ సినిమా కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వార్త వైరల్ అవుతోంది. సినిమాలో ఓ సీన్ కోసం అల్లు అర్జున్ ఏకంగా 51 టేక్స్ తీసుకున్నట్లు సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో క్వాలిటీ కోసం అల్లు అర్జున్ డెడికేషన్ ఇలాగే ఉంటుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. పుష్ప సినిమాతో AAకు భారీ ఫాలోయింగ్ ఏర్పడగా.. పార్ట్-2 కోసం దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు.