News April 9, 2024

BREAKING: ఎమ్మెల్సీ కవితకు ఎదురుదెబ్బ

image

లిక్కర్ స్కామ్ కేసులో BRS MLC కవితకు మరో షాక్ తగిలింది. నేటితో జుడీషియల్ గడువు ముగియగా ED అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈడీ విజ్ఞప్తి మేరకు రిమాండ్ గడువును ఈ నెల 23 వరకు పొడిగించింది. గత నెల 15న కవితను ED అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను నిన్న కోర్టు కొట్టేసింది.

News April 9, 2024

సంక్రాంతికి ‘రవితేజ-75’ సినిమా రిలీజ్

image

ఉగాది సందర్భంగా మాస్ మహారాజా రవితేజ నటించబోయే కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. రవితేజ 75వ సినిమాను భాను బోగవరపు తెరకెక్కించనున్నట్లు నిర్మాత నాగవంశీ ప్రకటించారు. ‘వచ్చే సంక్రాంతికి రవన్న దావత్ ఇస్తుండు… రెడీ అయిపొండ్రి’ అంటూ ఆయన ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఫుల్ టూ కామెడీ, డాన్స్, యాక్షన్ సీన్స్‌తో అదరగొడతామని నాగవంశీ ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చారు.

News April 9, 2024

BREAKING: కవిత మాట్లాడేందుకు అనుమతి నిరాకరణ

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోర్టులో మాట్లాడేందుకు జడ్జి అనుమతి నిరాకరించారు. అయితే జడ్జి అనుమతితో కుటుంబ సభ్యులు కవితను కలిశారు. కాగా రిమాండ్ పొడిగించేందుకు ఈడీ వద్ద కొత్తగా కారణమేమీ లేదని కవిత తరఫు న్యాయవాది వాదించారు. కవిత బయట ఉంటే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ పేర్కొంది.

News April 9, 2024

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి

image

మూడు వారాలుగా కనిపించకుండా పోయిన హైదరాబాద్ విద్యార్థి మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ (25) మృతి చెందినట్లు న్యూయార్క్‌లోని భారత రాయబాయ కార్యాలయం ప్రకటించింది. అర్ఫాత్‌ను గుర్తించేందుకు అక్కడి అధికారులతో కలిసి రాయబాయ కార్యాలయం అధికారులు పనిచేశారు. అయినప్పటికీ అతణ్ని రక్షించలేకపోయారు. క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ కోసం 2023లో అర్ఫాత్ అమెరికా వెళ్లారు.

News April 9, 2024

కోర్టులో కవితను హాజరుపరిచిన ఈడీ

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఇవాళ్టితో జుడీషియల్ కస్టడీ ముగియనుండడంతో గడువు పొడిగించాలని కోర్టును అధికారులు కోరారు. కవితతో కోర్టులో మాట్లాడేందుకు 2 నిమిషాల సమయమివ్వాలని ఆమె తరఫు న్యాయవాది కోరారు. అప్లికేషన్ ఇవ్వాలని కోర్టు సూచించింది.

News April 9, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు: సిద్ధార్థనాథ్

image

ఏపీ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ సిద్ధార్థనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో అమరావతిని రాజధానిగా చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో కేంద్ర పథకాలను అమలు చేయట్లేదని విమర్శించారు.

News April 9, 2024

రైతులకు గుడ్‌న్యూస్.. రుణ పరిమితి పెంపు!

image

TG: ఎకరం వరికి ఇకపై ₹42-45వేల వరకు పంట రుణం ఇవ్వాలని ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాంకేతిక కమిటీ బ్యాంకర్లకు సిఫార్సు చేసింది. పత్తికి ₹44-46వేలు, మొక్కజొన్నకు ₹32-34వేలు, పసుపుకు ₹87వేల వరకు ఇవ్వాలని నిర్దేశించింది. ఆయిల్ పామ్‌కు ₹40-42 వేలు నుంచి ₹42-44వేలకు, మిర్చికి ₹70-80 వేల నుంచి ₹82-84 వేలకు, టమాటాకు ₹50వేల నుంచి ₹53-55వేలకు పెంచింది. గొర్రెలు, మేకల యూనిట్లకూ రుణపరిమితి పెంచాలని సూచించింది.

News April 9, 2024

పాకిస్థాన్ హెడ్ కోచ్‌గా అజహర్

image

పాకిస్థాన్ హెడ్ కోచ్‌గా ఆ దేశ మాజీ ఆటగాడు అజహర్ మహమూద్ ఎంపికయ్యారు. ఈ నెల 18 నుంచి న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ఆయన కోచ్‌గా పనిచేయనున్నారు. కాగా అజహర్ పాక్ తరఫున 164 మ్యాచ్‌లు ఆడి 162 వికెట్లు పడగొట్టారు. అలాగే బ్యాటింగ్‌లో 2421 పరుగులు చేశారు. గతంలో పాక్ బౌలింగ్ కోచ్‌గా కూడా విధులు నిర్వర్తించారు. కాగా అజహర్ ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు 23 మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించారు.

News April 9, 2024

శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు

image

AP: ఉగాది పండగ వేళ శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అలంకార దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతిస్తున్నారు. పండగ కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ భక్తులు భారీగా వచ్చారు.

News April 9, 2024

తెలుగులో ఉగాది విషెస్ తెలిపిన ప్రధాని మోదీ

image

తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా తెలుగులో ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ‘కొత్తదనాన్నీ, పునరుత్తేజాన్నీ తనతో తీసుకొచ్చే ఉగాది.. కొత్త సంవత్సరానికి నాంది పలుకుతుంది. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరి జీవితాల్లో అమితమైన సంతోషాన్నీ, శ్రేయస్సునీ నింపాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ పండుగ మీ అందరి జీవితాల్లో అన్ని అంశాల్లో సంతోషాన్ని తీసుకువస్తుందని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.