India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్ట సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సమర్థవంతంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులను తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చరిత్ర సృష్టించారు. టోర్నీ హిస్టరీలో 1000 పరుగులు చేసి, 100 వికెట్లు తీయడంతోపాటు 100 క్యాచ్‌లు పట్టిన తొలి ఆటగాడిగా నిలిచారు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రెండు క్యాచులు అందుకోవడం ద్వారా ఐపీఎల్‌లో క్యాచ్‌ల శతకం పూర్తి చేసుకున్నారు. అలాగే అత్యధిక సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచిన CSK ప్లేయర్‌గానూ నిలిచారు.
తెలుగు ప్రజలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉగాది శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్టర్‌ను పోస్ట్ చేసింది. అందులో క్రికెటర్లు సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో హైదరాబాద్ సత్తా చాటుతోంది. 4 మ్యాచ్‌లు ఆడి రెండింట్లో గెలిచి రెండింట్లో ఓడింది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 277 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది.
‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు బలగం సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’ పాట అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఈ విషయం గేయ రచయిత కాసర్ల శ్యామ్‌కు చెప్పానన్నారు. ఆయన వాడే పదాల్లో మట్టి వాసన ఉంటుందని కొనియాడారు. సిద్ధూ, విశ్వక్ సేన్‌ను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. కొత్త ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడానికి ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలన్నారు.
గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభం ఆందోళన కలిగిస్తోందని UNOలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఇప్పటికే మహిళలు, చిన్నారులు వేల సంఖ్యలో మరణించారని.. దీనిని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. సామాన్య పౌరులను బందీలుగా చేసుకోవడాన్ని ఏమాత్రం సమర్థించమని పేర్కొన్నారు. అక్కడి ప్రజలకు మానవతా సాయాన్ని పెంచాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
AP: సీఎం జగన్ చేస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఇవాళ బ్రేక్ పడింది. ఉగాది పండుగ సందర్భంగా జగన్ విరామం ప్రకటించారు. పల్నాడు జిల్లా గంటావారిపాలెంలో ఆయన ఉగాది వేడుకల్లో పాల్గొననున్నారు. సతీమణి భారతీరెడ్డితో కలిసి పూజలు చేయనున్నారు. రేపటి నుంచి యథావిధిగా యాత్ర కొనసాగనుంది.
వివాహ విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లి జరిగిందనడానికీ కన్యాదానం ప్రమాణం కాదనీ, వధూవరులు ఏడడుగులు నడిచినప్పుడే వారు దంపతులైనట్లు తెలిపింది. అత్తింటి వారు దాఖలు చేసిన క్రిమినల్ కేసులో అశుతోశ్ యాదవ్‌ను ఉద్దేశించి కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తనకు కన్యాదానం జరగలేదని వివాహం చెల్లదని యాదవ్ వాదించగా.. హిందూ వివాహ చట్ట ప్రకారం ఏడడుగులే ముఖ్యమని పేర్కొంది.
‘గుంటూరు కారం’ సినిమాను తాను ఎంజాయ్ చేయలేకపోయానని నటుడు జగపతి బాబు అన్నారు. మహేశ్‌తో కలిసి పనిచేయడం తనకు ఎప్పుడూ ఇష్టమేనని.. సినిమాలో కొన్ని పాత్రల్లో మార్పులు చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. క్యారెక్టరైజేషన్ ఎక్కువగా ఉండటంతో గందరగోళం ఏర్పడిందన్నారు. తన పాత్ర కోసం చేయాల్సిందంతా చేశానని తెలిపారు.
AP: ఏకపక్ష తీర్పునకు కేరాఫ్ అడ్రస్ తుని. 1952 నుంచి 1978 వరకు INC, 1983 నుంచి 2004 వరకు TDP, 2009లో INC, 2014, 19లో YCP గెలిచింది. 15 ఎన్నికల్లో కేవలం ఐదుగురే MLAలయ్యారు. వెంకట కృష్ణంరాజు బహదూర్, విజయలక్ష్మి, రాజా అశోక్‌బాబు(INC), యనమల రామకృష్ణుడు(TDP), దాడిశెట్టి రాజా(YCP) గెలిచారు. ఈసారి దాడిశెట్టి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తుండగా, టీడీపీ యనమల దివ్యను బరిలో దింపింది.
<<-se>>#ELECTIONS2024<<>>
తమిళనాడులో 35 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. డీఎంకే ముఖ్యనేతల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ కేసులో అరెస్టైన సాధిక్‌తో సంబంధమున్న సినీ ప్రముఖుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. దర్శకుడు, నటుడు అమీర్ ఇంట్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.