News April 9, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు: సిద్ధార్థనాథ్

image

ఏపీ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ సిద్ధార్థనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో అమరావతిని రాజధానిగా చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో కేంద్ర పథకాలను అమలు చేయట్లేదని విమర్శించారు.

News April 9, 2024

రైతులకు గుడ్‌న్యూస్.. రుణ పరిమితి పెంపు!

image

TG: ఎకరం వరికి ఇకపై ₹42-45వేల వరకు పంట రుణం ఇవ్వాలని ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాంకేతిక కమిటీ బ్యాంకర్లకు సిఫార్సు చేసింది. పత్తికి ₹44-46వేలు, మొక్కజొన్నకు ₹32-34వేలు, పసుపుకు ₹87వేల వరకు ఇవ్వాలని నిర్దేశించింది. ఆయిల్ పామ్‌కు ₹40-42 వేలు నుంచి ₹42-44వేలకు, మిర్చికి ₹70-80 వేల నుంచి ₹82-84 వేలకు, టమాటాకు ₹50వేల నుంచి ₹53-55వేలకు పెంచింది. గొర్రెలు, మేకల యూనిట్లకూ రుణపరిమితి పెంచాలని సూచించింది.

News April 9, 2024

పాకిస్థాన్ హెడ్ కోచ్‌గా అజహర్

image

పాకిస్థాన్ హెడ్ కోచ్‌గా ఆ దేశ మాజీ ఆటగాడు అజహర్ మహమూద్ ఎంపికయ్యారు. ఈ నెల 18 నుంచి న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ఆయన కోచ్‌గా పనిచేయనున్నారు. కాగా అజహర్ పాక్ తరఫున 164 మ్యాచ్‌లు ఆడి 162 వికెట్లు పడగొట్టారు. అలాగే బ్యాటింగ్‌లో 2421 పరుగులు చేశారు. గతంలో పాక్ బౌలింగ్ కోచ్‌గా కూడా విధులు నిర్వర్తించారు. కాగా అజహర్ ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు 23 మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించారు.

News April 9, 2024

శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు

image

AP: ఉగాది పండగ వేళ శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అలంకార దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతిస్తున్నారు. పండగ కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ భక్తులు భారీగా వచ్చారు.

News April 9, 2024

తెలుగులో ఉగాది విషెస్ తెలిపిన ప్రధాని మోదీ

image

తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా తెలుగులో ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ‘కొత్తదనాన్నీ, పునరుత్తేజాన్నీ తనతో తీసుకొచ్చే ఉగాది.. కొత్త సంవత్సరానికి నాంది పలుకుతుంది. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరి జీవితాల్లో అమితమైన సంతోషాన్నీ, శ్రేయస్సునీ నింపాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ పండుగ మీ అందరి జీవితాల్లో అన్ని అంశాల్లో సంతోషాన్ని తీసుకువస్తుందని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

News April 9, 2024

BREAKING: 3,712 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 3,712 ఉద్యోగాల భర్తీకి CHSL(10+2) నోటిఫికేషన్‌ను SSC విడుదల చేసింది. మే 7న రా.11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. లోయర్ డివిజినల్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులున్నాయి. ఆగస్టు 1, 2024 నాటికి 18-27 ఏళ్ల వయసు(రిజర్వేషన్ బట్టి సడలింపు), ఇంటర్ ఉత్తీర్ణులైన వారు అర్హులు. టైర్-1 పరీక్షలు జూన్, జులైలో ఉంటాయి.
వెబ్‌సైట్: ssc.gov.in

News April 9, 2024

రాజీవ్ రతన్ మరణం పట్ల సీఎం దిగ్భ్రాంతి

image

తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌ రాజీవ్ రతన్ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్ట సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సమర్థవంతంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులను తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.

News April 9, 2024

IPL చరిత్రలో ఒకే ఒక్కడు..

image

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చరిత్ర సృష్టించారు. టోర్నీ హిస్టరీలో 1000 పరుగులు చేసి, 100 వికెట్లు తీయడంతోపాటు 100 క్యాచ్‌లు పట్టిన తొలి ఆటగాడిగా నిలిచారు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రెండు క్యాచులు అందుకోవడం ద్వారా ఐపీఎల్‌లో క్యాచ్‌ల శతకం పూర్తి చేసుకున్నారు. అలాగే అత్యధిక సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచిన CSK ప్లేయర్‌గానూ నిలిచారు.

News April 9, 2024

తెలుగు ప్రజలకు SRH శుభాకాంక్షలు

image

తెలుగు ప్రజలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉగాది శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్టర్‌ను పోస్ట్ చేసింది. అందులో క్రికెటర్లు సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో హైదరాబాద్ సత్తా చాటుతోంది. 4 మ్యాచ్‌లు ఆడి రెండింట్లో గెలిచి రెండింట్లో ఓడింది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 277 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది.

News April 9, 2024

ఆ పాట నాకు చాలా ఇష్టం: ఎన్టీఆర్

image

‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు బలగం సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’ పాట అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఈ విషయం గేయ రచయిత కాసర్ల శ్యామ్‌కు చెప్పానన్నారు. ఆయన వాడే పదాల్లో మట్టి వాసన ఉంటుందని కొనియాడారు. సిద్ధూ, విశ్వక్ సేన్‌ను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. కొత్త ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడానికి ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలన్నారు.