News April 9, 2024

AP ELECTIONS: సీపీఐ(ఎం) అభ్యర్థులు వీరే

image

* అరకు (ఎంపీ)-పాచిపెంట అప్పలనర్స
* రంపచోడవరం-లోతా రామారావు
* కురుపాం-మండంగి రమణ
* అరకు-దీసరి గంగరాజు, గాజువాక-జగ్గునాయుడు
* గన్నవరం-కళ్ళం వెంకటేశ్వరరావు
* నెల్లూరు సిటీ-మూలం రమేశ్
* కర్నూలు-గౌస్ దేశాయి, సంతనూతలపాడు-ఉబ్బా ఆదిలక్ష్మి
* విజయవాడ సెంట్రల్-బాబురావు, మంగళగిరి-శివశంకర్

News April 9, 2024

ప్రజలందరికీ శుభాలు జరగాలి: సీఎం జగన్

image

AP: తెలుగు ప్రజలకు సీఎం జగన్ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ ఏడాది ప్రజలందరికీ శుభాలు జరగాలి. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలి. అన్ని వృత్తుల వారు ఆనందంగా ఉండాలి. ప్రతి ఇల్లూ కళకళలాడాలి. మన సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి’ అని ఆకాంక్షించారు.

News April 9, 2024

IPL: నేడు పంజాబ్ VS హైదరాబాద్

image

ఐపీఎల్-2024లో భాగంగా ఇవాళ PBKS, SRH జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చండీగఢ్ వేదికగా రాత్రి 7:30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ రెండు టీమ్స్ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు 21 సార్లు తలపడ్డాయి. 14 మ్యాచుల్లో SRH గెలవగా, 7 మ్యాచుల్లో PBKS విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో హైదరాబాద్ 5వ స్థానంలో, పంజాబ్ 6వ స్థానంలో ఉన్నాయి. నేడు గెలుపెవరిది? కామెంట్ చేయండి.

News April 9, 2024

నేటి నుంచి భద్రాచలంలో శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు

image

భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామివారి దేవస్థానంలో ఉగాది సందర్భంగా శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఈనెల 23 వరకు బ్రహ్మోత్సవాలు జరగనుండగా, ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 17న శ్రీరామనవమి సందర్భంగా ఉ.10:30 గంటల నుంచి మ.12:30 గంటల వరకు మిథిలా మండపంలో శ్రీసీతారామ కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 18న మహా పట్టాభిషేకం జరగనుంది.

News April 9, 2024

ప్రభాస్ చేతి నిండా సినిమాలే..

image

రెబల్ స్టార్ ప్రభాస్ చేతి నిండా సినిమాలతో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన కల్కి 2898ఏడీ, రాజాసాబ్, సలార్-2, స్పిరిట్, కన్నప్ప(కీలక పాత్ర)తో బిజీగా ఉండగా.. ఇప్పుడు హను రాఘవపూడి చిత్రం కూడా ఒప్పుకొన్నారు. పీరియడ్ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమాను తీయనున్నట్లు హను ప్రకటించారు. కాగా.. మున్ముందు వరుసగా సినిమాలుండటంతో ప్రభాస్ ప్రస్తుతం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం.

News April 9, 2024

ఉగాది రోజు ఏం చేయాలి?

image

ఉగాది రోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి కొత్త దుస్తులు ధరించాలి. దైవదర్శనం చేసుకుని, పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. ఇళ్లను, వ్యాపార నిలయాలను మామిడి, పూల తోరణాలు, అరటి బోదెలతో అలంకరించాలి. దేవతార్చన, పంచాంగ పూజ చేయాలి. ఉగాది పచ్చడి, భక్ష్యాలు, పూర్ణాలు నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం పంచాంగ శ్రవణం, కవిత్వ, సాహిత్య గోష్ఠుల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది.

News April 9, 2024

ఏపీ పాలిసెట్ దరఖాస్తులకు రేపే లాస్ట్ డేట్

image

ఏపీ పాలిసెట్-2024 <>దరఖాస్తు<<>> గడువు రేపటితో ముగియనుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం గడువు ఈనెల 5తో ముగియాల్సి ఉండగా, 10వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అలాగే పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు ఉండదని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి ఇప్పటికే స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 27న పరీక్ష జరుగుతుందని తెలిపారు.

News April 9, 2024

కేజ్రీవాల్ పిటిషన్‌పై నేడు తీర్పు

image

ఎక్సైజ్ పాలసీ కేసులో తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. జస్టిస్ స్వర్ణ కాంత శర్మ మధ్యాహ్నం 2:30 గంటలకు తీర్పును వెల్లడించనున్నారు. ఈనెల 3న ఈడీ, కేజ్రీవాల్ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న జడ్జి తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

News April 9, 2024

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్

image

వేసవి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు 48 స్పెషల్ రైళ్లను నడుపనున్నట్లు ద.మ రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు సికింద్రాబాద్-నాగర్‌సోల్ (07517), నాగర్‌సోల్-సికింద్రాబాద్ (07518), తిరుపతి-మచిలీపట్నం (07121), మచిలీపట్నం-తిరుపతి (07122), CST ముంబై-కరీంనగర్ (01067), కరీంనగర్-CST ముంబై (01068), యశ్వంత్‌పూర్-కాలాబుర్గి(06505), కాలాబుర్గి-యశ్వంత్‌పూర్ (06506) మధ్య నడుస్తాయని తెలిపింది.

News April 9, 2024

ధోనీ రికార్డును సమం చేసిన జడేజా

image

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోనీ పేరిట ఉన్న ఓ రికార్డును ఆ జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సమం చేశారు. అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచిన CSK ప్లేయర్‌గా నిలిచారు. ధోనీ, జడేజా ఇప్పటివరకు 15 సార్లు PoTM అవార్డ్స్ గెలవగా, ఆ తర్వాతి స్థానాల్లో సురేశ్ రైనా (12), రుతురాజ్ గైక్వాడ్ (10), హస్సీ (10) ఉన్నారు.