News April 8, 2024

తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు: చంద్రబాబు

image

AP: తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘క్రోధి నామ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. క్రోధి అంటే కోపంతో ఉన్నవారు.. మీ ఆగ్రహం ధర్మాగ్రహం కావాలి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పాలన రావాలని కోరుకుందాం. ఈ ఉగాది ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించాలి’ అని ఆయన ఆకాంక్షించారు.

News April 8, 2024

రాష్ట్రంలో రూ. 71 కోట్ల నగదు, వస్తువుల పట్టివేత

image

TG: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఇప్పటి వరకు రూ. 71కోట్లకు పైగా డబ్బు, విలువైన ఇతర వస్తువుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ.29.30 కోట్ల నగదు, రూ.9.54 కోట్ల మద్యం, రూ.15.34 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.10.33 కోట్ల విలువైన అభరణాలు, రూ.7.04 కోట్ల విలువైన ఇతర వస్తువులు ఉన్నట్లు వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాలు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

News April 8, 2024

ఫలితాల విడుదలపై కీలక ప్రకటన

image

TG: మోడల్ స్కూళ్లలో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మే 25న ఫలితాలను విడుదల చేస్తామని.. అర్హత సాధించిన వారు మే 27 నుంచి 31వ తేదీ వరకు ప్రవేశాలు పొందవచ్చని పేర్కొంది. 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతి నుంచి 9వ తరగతి ప్రవేశాల కోసం ఏప్రిల్ 7న పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

News April 8, 2024

ముఖాన్ని ఇలా రక్షించుకోవచ్చు!

image

నేటి కాలుష్యం కారణంగా ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడం సవాలుగా మారుతోంది. అయితే, నీటితో తరచూ శుభ్రం చేసుకుంటే ముఖాన్ని రక్షించుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. ‘మ‌ృతకణాలు, సహజసిద్ధంగా చర్మం నుంచి వచ్చే నూనె వలన వదనం కళావిహీనం అవుతుంటుంది. రోజుకు కనీసం 2సార్లు ముఖాన్ని నీటితో కడుక్కోవడం ద్వారా ఈ సమస్యకు కొంతమేర చెక్ పెట్టొచ్చు. సుదీర్ఘకాలంలో మొటిమలు తగ్గే ఛాన్స్ కూడా ఉంది’ అని నిపుణులు చెబుతున్నారు.

News April 8, 2024

రాహుల్, కొండా సురేఖపై ఈసీకి ఫిర్యాదు

image

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని బీఆర్ఎస్ కోరింది. ఎన్నికల కోడ్ వేళ కేసీఆర్‌పై రాహుల్ దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని పేర్కొంది. ఎంపీ ఎన్నికల్లో రాహుల్ ప్రచారం చేయకుండా నిషేధించాలంది. మరోవైపు కేటీఆర్‌పై కొండా సురేఖ నిరాధార ఆరోపణలు చేశారని.. ఆమెనూ ప్రచారంలో పాల్గొనకుండా నిషేధించాలని కోరింది.

News April 8, 2024

TWIST: ఆ ఐస్‌క్రీమ్‌‌లో అలాంటివేమీ కలవలేదు

image

TG: వరంగల్(D) నెక్కొండలో ఐస్‌క్రీములు విక్రయించే వ్యక్తి ఐస్‌క్రీమ్‌ డబ్బాలో వీర్యం/మూత్రం కలిపారనే వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఐస్‌క్రీమ్‌ శాంపిల్స్‌ను పరీక్షించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు తాజాగా నివేదికను విడుదల చేశారు. దీనిలో ఎలాంటి వీర్యం/మూత్రం ఆనవాళ్లను గుర్తించలేదని నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు.

News April 8, 2024

‘హాయ్ నాన్న’కు పురస్కారాల పంట

image

శౌర్యవ్ దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘హాయ్ నాన్న’. దేశీయంగా వివిధ అవార్డుల్ని సొంతం చేసుకున్న ఈ ఫిల్మ్, అంతర్జాతీయంగానూ సత్తా చాటింది. న్యూయార్క్‌లో జరిగిన ‘ది ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్’లో ఏకంగా 11 పురస్కారాలను దక్కించుకుంది. ఉత్తమ చిత్రం సహా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి తదితర విభాగాల్లో మూవీకి అవార్డుల పంట పండింది. అంతర్జాతీయంగా ఈ సినిమాను ‘హాయ్ డాడీ’గా రిలీజ్ చేశారు.

News April 8, 2024

జడేజా అరుదైన ఘనత

image

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించారు. ఇవాళ KKRతో మ్యాచులు రెండు క్యాచులు పట్టడం ద్వారా ఐపీఎల్‌లో 100 క్యాచులు పట్టిన ఆటగాళ్ల లిస్ట్‌లో చేరారు. దీంతో ముంబై ప్లేయర్ రోహిత్ శర్మతో కలిసి జడేజా ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. ఓవరాల్‌గా ఈ లిస్ట్‌లో కోహ్లీ(110), రైనా(109), పొలార్డ్(103) ముందు వరసలో ఉన్నారు.

News April 8, 2024

దారుణం.. చిన్నారులపై ప్రధానోపాధ్యాయుడి లైంగిక వేధింపులు!

image

TG: పిల్లలకు పాఠాలు నేర్పాల్సిన గురువే కీచకుడిగా మారాడు. భువనగిరి జిల్లాలో ఓ స్కూల్‌లో చాక్లెట్ల ఆశచూపి 3వ తరగతి విద్యార్థినులపై ప్రధానోపాధ్యాయుడు మాధవరెడ్డి ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇటీవల ఓ చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో అసలు విషయం బయటపడింది. న్యాయం కోసం చిన్నారుల తల్లిదండ్రులు నిరసనకు దిగడంతో పోలీసులు ప్రధానోపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

News April 8, 2024

అకౌంట్లోకి డబ్బులు ఎప్పుడంటే?

image

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత నిధులు మే ఆఖరి వారంలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు 16 విడతలుగా నిధులు విడుదల చేయగా.. 17వ విడత నిధులను మే ఆఖరి వారం లేదా జూన్ తొలి వారంలో అకౌంట్లో జమ చేయనున్నట్లు సమాచారం. ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ కేంద్రం ఏటా 3 విడతల్లో రూ.2వేల చొప్పున రూ.6వేలు అందిస్తోంది. ఫిబ్రవరి 28న చివరి విడత నిధులు జమ అయ్యాయి.