News April 9, 2024

శుభ ముహూర్తం

image

తేది: ఏప్రిల్ 9, మంగళవారం
చైత్రము
శు.పాడ్యమి: రాత్రి 8:31 గంటలకు
రేవతి: ఉదయం 7:32 గంటలకు, అశ్విని: ఉదయం 5:06 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 8:27 నుంచి ఉదయం 9.16 గంటల వరకు
తిరిగి రాత్రి 10:58 నుంచి రాత్రి 11:45 వరకు
వర్జ్యం లేదు

News April 9, 2024

TODAY HEADLINES

image

* TG: నాపై కుట్ర జరుగుతోంది: సీఎం రేవంత్ రెడ్డి
* ఫోన్ ట్యాపింగ్‌లో నాపై తప్పుడు ప్రచారం: MLC నవీన్
* ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరణ
* AP: జనసేనకు మెగాస్టార్ చిరంజీవి రూ.5 కోట్ల విరాళం
* జనసేన నుంచి తప్పుకున్న పోతిన మహేశ్
* పీకే సలహాలు తీసుకుని ఉంటే మునిగేవాళ్లం: బొత్స
* రూ.400 లక్షల కోట్లకు చేరిన BSE లిస్టెడ్ కంపెనీల విలువ

News April 8, 2024

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్

image

AP: పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు గుడ్ న్యూస్. గత నెలలో నిర్వహించిన పరీక్షల మూల్యాంకనం పూర్తైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 47,88,738 జవాబు పత్రాలను 25వేల మందికి పైగా సిబ్బంది మూల్యాంకనం చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో మూల్యాంకనంలో ఎలాంటి ఆటంకం చోటు చేసుకోలేదని పేర్కొన్నారు. వచ్చే నెలలో పదో తరగతి ఫలితాలు రానున్నట్లు సమాచారం.

News April 8, 2024

‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్.. నిర్మాత ఏమన్నారంటే?

image

అక్కినేని అఖిల్, దర్శకుడు సురేందర్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సినిమా విడుదలై ఏడాది కావొస్తున్నా ఇంకా OTTలోకి రాలేదు. తాజాగా ఓ అభిమాని నిర్మాత అనిల్ సుంకరను ట్యాగ్ చేస్తూ ఏజెంట్ OTT రిలీజ్ చేయమని కోరారు. దీనికి ఆయన బదులిస్తూ మూవీ డిజిటల్ రైట్స్ B4Uకి ఇచ్చామని, వారు సోనీకి ఇచ్చినట్లు తెలిపారు. త్వరలో OTTలోకి వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.

News April 8, 2024

IPL: చెన్నై సునాయాస విజయం

image

చెపాక్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్కే సునాయాస విజయం సాధించింది. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రుతురాజ్ హాఫ్ సెంచరీతో(67* రన్స్) రాణించారు. దూబే 18 బంతుల్లో 28 రన్స్‌తో మెరుపులు మెరిపించారు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు, నరైన్ ఒక వికెట్‌ తీశారు. ఈ సీజన్‌లో కేకేఆర్‌కు ఇదే తొలి ఓటమి.

News April 8, 2024

తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు: చంద్రబాబు

image

AP: తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘క్రోధి నామ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. క్రోధి అంటే కోపంతో ఉన్నవారు.. మీ ఆగ్రహం ధర్మాగ్రహం కావాలి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పాలన రావాలని కోరుకుందాం. ఈ ఉగాది ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించాలి’ అని ఆయన ఆకాంక్షించారు.

News April 8, 2024

రాష్ట్రంలో రూ. 71 కోట్ల నగదు, వస్తువుల పట్టివేత

image

TG: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఇప్పటి వరకు రూ. 71కోట్లకు పైగా డబ్బు, విలువైన ఇతర వస్తువుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ.29.30 కోట్ల నగదు, రూ.9.54 కోట్ల మద్యం, రూ.15.34 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.10.33 కోట్ల విలువైన అభరణాలు, రూ.7.04 కోట్ల విలువైన ఇతర వస్తువులు ఉన్నట్లు వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాలు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

News April 8, 2024

ఫలితాల విడుదలపై కీలక ప్రకటన

image

TG: మోడల్ స్కూళ్లలో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మే 25న ఫలితాలను విడుదల చేస్తామని.. అర్హత సాధించిన వారు మే 27 నుంచి 31వ తేదీ వరకు ప్రవేశాలు పొందవచ్చని పేర్కొంది. 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతి నుంచి 9వ తరగతి ప్రవేశాల కోసం ఏప్రిల్ 7న పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

News April 8, 2024

ముఖాన్ని ఇలా రక్షించుకోవచ్చు!

image

నేటి కాలుష్యం కారణంగా ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడం సవాలుగా మారుతోంది. అయితే, నీటితో తరచూ శుభ్రం చేసుకుంటే ముఖాన్ని రక్షించుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. ‘మ‌ృతకణాలు, సహజసిద్ధంగా చర్మం నుంచి వచ్చే నూనె వలన వదనం కళావిహీనం అవుతుంటుంది. రోజుకు కనీసం 2సార్లు ముఖాన్ని నీటితో కడుక్కోవడం ద్వారా ఈ సమస్యకు కొంతమేర చెక్ పెట్టొచ్చు. సుదీర్ఘకాలంలో మొటిమలు తగ్గే ఛాన్స్ కూడా ఉంది’ అని నిపుణులు చెబుతున్నారు.

News April 8, 2024

రాహుల్, కొండా సురేఖపై ఈసీకి ఫిర్యాదు

image

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని బీఆర్ఎస్ కోరింది. ఎన్నికల కోడ్ వేళ కేసీఆర్‌పై రాహుల్ దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని పేర్కొంది. ఎంపీ ఎన్నికల్లో రాహుల్ ప్రచారం చేయకుండా నిషేధించాలంది. మరోవైపు కేటీఆర్‌పై కొండా సురేఖ నిరాధార ఆరోపణలు చేశారని.. ఆమెనూ ప్రచారంలో పాల్గొనకుండా నిషేధించాలని కోరింది.