News April 9, 2024

ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు షాక్!

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. రిమాండ్‌ను చట్టవిరుద్ధంగా పరిగణించలేమన్న కోర్టు.. ఈడీ అరెస్ట్ చేయడాన్ని సమర్థించింది. వారి వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. కేజ్రీవాల్ సహకరించకపోవడం జుడీషియల్ కస్టడీలో ఉన్న వారిపై ప్రభావం చూపిందని తెలిపింది.

News April 9, 2024

త్వరలో బాలయ్య ‘Unstoppable’ సీజన్-4

image

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తోన్న టాక్ షో ‘Unstoppable’ మళ్లీ రాబోతోంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ టాక్ షో అతి త్వరలోనే రాబోతోందని ‘ఆహా’ ప్రకటించింది. అయితే, ఈ సీజన్‌-4లో ఓ ట్విస్ట్ ఉంటుందని వెల్లడించింది. దీంతో ఆ ట్విస్ట్ ఏంటా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ సీజన్‌లోనైనా మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లను గెస్టులుగా పిలవాలని కామెంట్స్ చేస్తున్నారు.

News April 9, 2024

సమ్మర్‌లో వీటితో డీహైడ్రేషన్‌కు చెక్?

image

సమ్మర్‌లో ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే కొన్ని పండ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నీరు ఎక్కువగా ఉన్న పుచ్చకాయ తింటే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. దోసకాయ తీసుకుంటే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. కొబ్బరి నీరు తీసుకుంటే డీహైడ్రేషన్‌ను సమర్థవంతంగా అడ్డుకుంటుంది. అలాగే టమాటాలు, బూడిదగుమ్మడి, నారింజ, స్ట్రాబెర్రీ, బెల్ పెప్పర్స్ తినాలి.

News April 9, 2024

కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే

image

AP: వైసీపీకి రాజీనామా చేసిన ఆమంచి కృష్ణమోహన్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతానని ప్రకటించారు. వైసీపీ, టీడీపీతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పారు. రెండు పార్టీలకూ సమాన దూరం పాటిస్తానన్నారు. చీరాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

News April 9, 2024

ఇజ్రాయెల్‌పై టర్కీ ఆంక్షలు

image

హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న టర్కీ, తాజాగా ఆ దేశంపై వాణిజ్యపరమైన ఆంక్షల్ని విధించింది. సిమెంట్, ఉక్కు సహా 54 ఉత్పత్తులపై నేటి నుంచి ఎగుమతి ఆంక్షలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపి, పాలస్తీనావాసులకు సహాయాన్ని వెళ్లనిచ్చేవరకూ వీటిని సడలించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ ఒక ఉగ్రదేశంలా మారిందంటూ టర్కీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

News April 9, 2024

వైసీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ గుడ్‌బై?

image

AP: ఎన్నికల వేళ YCPకి మరో షాక్ తగలనున్నట్లు సమాచారం. తాడికొండ సీటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న MLC డొక్కా మాణిక్య వరప్రసాద్.. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఆయన త్వరలో YCPకి రాజీనామా చేసి, చంద్రబాబు సమక్షంలో TDPలో చేరతారని వార్తలు వస్తున్నాయి. అయితే డొక్కా ప్రస్తుతం తటస్థంగా ఉన్నారని, ఏ పార్టీ వైపు చూడట్లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈయన 2004, 2009లో తాడికొండ MLAగా గెలిచారు.

News April 9, 2024

విదేశాల్లో బిజినెస్‌కు ఓలా క్యాబ్స్ గుడ్‌బై

image

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తప్పుకోనున్నట్లు ఓలా క్యాబ్స్ ప్రకటించింది. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో ఓలా సేవలు ఈనెలాఖరుతో ముగియనున్నట్లు తెలిపింది. ‘ఎలక్ట్రిక్ వాహనాలు భవిష్యత్తులో పర్సనల్ వెహికల్స్‌కే పరిమితం కాకుండా క్యాబ్ సేవలకూ విస్తరిస్తాయి. భారత్‌లో మార్కెట్ విస్తరణకు మాకు మంచి అవకాశాలు ఉన్నాయి. అందుకే దీనిపై దృష్టిపెట్టాలని నిర్ణయించాం’ అని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

News April 9, 2024

ఏపీ సీఎస్‌పై NHRCకి ఫిర్యాదు

image

AP CS జవహర్‌రెడ్డిపై కేంద్ర మానవ హక్కుల సంఘానికి NDA కూటమి ఫిర్యాదు చేసింది. పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో ఎన్నికల సంఘం ఆదేశాలను పక్కదారి పట్టించారని కూటమి నేతలు పేర్కొన్నారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని కోరారు. వాలంటీర్లను పక్కనపెట్టి ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేయాలన్న EC ఆదేశాలు పాటించకపోవడంతో 33 మంది మరణించారన్నారు. కదల్లేని వారినీ సచివాలయాలకు రావాలని YCP ప్రచారం చేసిందని వివరించారు.

News April 9, 2024

ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయంది. నిన్న నిజామాబాద్‌లో వర్షాలు కురిశాయి.

News April 9, 2024

బీజేపీలో చేరితే కేసుల విచారణ ఆగిపోతుంది: కవిత

image

తప్పుడు ప్రచారంతో రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను దిగజార్చారని MLC కవిత లేఖలో పేర్కొన్నారు. తన మొబైల్ నంబర్‌ను మీడియాలో ప్రసారం చేసి ప్రైవసీకి భంగం కలిగించారన్నారు. ఇప్పటికే 4 సార్లు విచారణకు హాజరయ్యానని.. అన్ని విధాలుగా సహకరించారని తెలిపారు. BJPలో చేరితే కేసుల విచారణ ఆగిపోతుందన్నారు. పార్లమెంటులో విపక్ష నేతలను ఉద్దేశించి నోరు మూసుకోకపోతే EDని పంపుతామని BJP నేతలన్నారని తెలిపారు.