India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావం దాదాపుగా ముగిసినట్లేనని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాకపోతే ఇవాళ మాత్రం కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.

ఇస్తాంబుల్‌లో ఐదు రోజులుగా పాక్-అఫ్గాన్ మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి లభించింది. దోహాలో OCT 18-19 మధ్య జరిగిన సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని కొనసాగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని తుర్కియే ప్రకటించింది. తదుపరి చర్చలు నవంబర్ 6న జరగనున్నాయి. ‘పరస్పర గౌరవం, జోక్యం చేసుకోకపోవడం ఆధారంగా పాక్‌తో ఎప్పుడూ తాము సత్సంబంధాలే కోరుకుంటాం’ అని అఫ్గానిస్థాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వ్యాఖ్యానించారు.

పిల్లలు బడికి వెళ్లేటప్పుడు షూ, సాక్స్ ధరిస్తుంటారు. కానీ వీటి విషయంలో అశ్రద్ధగా ఉంటే అథ్లెట్స్ ఫుట్ వస్తుందంటున్నారు నిపుణులు. పాదాలకు పట్టిన చెమటను సాక్స్ పీల్చుకుంటాయి. దీంతో బ్యాక్టీరియా, ఫంగస్ ఏర్పడతాయి. వీటిని శుభ్రం చేయకుండా వాడటం వల్ల ఫంగస్ ఇన్‌ఫెక్షన్స్ వస్తే నిర్మూలించటం కష్టం. నెలల కొద్దీ చికిత్స తీసుకోవాలి. కాబట్టి ఉతికి, పూర్తిగా ఎండిన తర్వాతే సాక్సులను వాడాలని సూచిస్తున్నారు.

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ 19 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.curaj.ac.in

చూడి పశువును ఈనడానికి 15 రోజుల ముందు దూడ వేసే స్థలానికి మార్చాలి. నేలకు, మేతతొట్టెకు, పక్క గోడలకు సున్నం పూసి శుభ్రంగా ఉంచాలి. దీని వల్ల పశువులు ఈనే సమయంలో, మావి పడిపోయే సమయంలో గర్భాశయానికి రోగకారక క్రిములు చేరకుండా రక్షణ కలుగుతుంది. మేత తొట్టె నుంచి, మురుగు కాలువ వరకు నేల ఒక అంగుళం ఏటవాలుగా ఉండేట్టు చూసుకోవాలి. పశువులకు ఎండుగడ్డినే నేలపై పరిచి పరుపుగా వాడాలి. వరి పొట్టు, రంపం పొట్టు వాడొద్దు.

జపం ఉద్దేశం జన్మబంధాన్ని తొలగించడం. శివ భక్తులు ఓంకారంతో కలిపిన ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని నిరంతరం జపించాలి. ఈ జపానికి మాఘ, భాద్రపద మాసాలు అత్యంత శ్రేష్ఠమైనవి. జపం చేసే సాధకుడు నియమబద్ధుడై, ఓపూట మాత్రమే ఆహారం తీసుకుంటూ, తక్కువగా మాట్లాడాలి. అలాగే, మనస్సును అదుపులో ఉంచుకునే గుణాలు కలిగి ఉండాలి. ఇలాంటి నియమాలు పాటించే శివ భక్తులు కల్పాంతం వరకు శివలోకంలో శాశ్వతంగా నివసిస్తారు. <<-se>>#SIVOHAM<<>>

టెక్నాలజీతో మంచితో పాటు చెడు కూడా పెరుగుతుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. HYDలో నిర్వహించిన ఏక్తా దివస్ 2K రన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పోర్న్ సైట్లలో తన డీప్‌ఫేక్ వీడియోలు రావడంపై స్పందించారు. ‘ఇలాంటి వాటిపై భయం అవసరంలేదు. CP సజ్జనార్ కేసును పర్యవేక్షిస్తున్నారు. డీప్‌ఫేక్ వంటి వాటిపై ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలి. లేకుంటే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి’ అని తెలిపారు.

TG: ఖమ్మం జిల్లా CPM రైతు సంఘం నేత సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఉదయం చింతకాని(M) పాతర్లపాడులో వాకింగ్‌కు వెళ్లిన సమయంలో దుండగులు గొంతుకోసి హత్య చేశారు. ఈయన ఉమ్మడి APలో సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పని చేశారు. రామారావు హత్య పట్ల Dy.CM భట్టి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోషులను పట్టుకొని చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. రాష్ట్రంలో హింసా రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేశారు.

TG CM రేవంత్‌తో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ భేటీ అయ్యారు. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ శిండే మనవరాలి పెళ్లి సందర్భంగా నిన్న ముంబై వెళ్లిన రేవంత్‌తో సల్మాన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ గురించి వీరిద్దరూ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్’ నినాదానికి వరల్డ్ వైడ్‌గా ప్రచారం కల్పిస్తానని సల్మాన్ చెప్పినట్లు సమాచారం.

స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ‘గ్రో’ మాతృసంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ NOV 4-7 మధ్య పబ్లిక్ ఇష్యూకు రానుంది. షేర్ల ధరలను రూ.95-100గా నిర్ణయించింది. ఫ్రెష్ ఇష్యూ కింద రూ.1,060Cr విలువైన షేర్లను, ఆఫర్ ఫర్ సేల్ కింద 55.72 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, వాటాదార్లు విక్రయించనున్నారు. దీంతో రూ.6,632Cr సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. తద్వారా సంస్థ విలువ రూ.61,700Crకు చేరొచ్చని అంచనా.
Sorry, no posts matched your criteria.