News April 9, 2024

ప్రభాస్ చేతి నిండా సినిమాలే..

image

రెబల్ స్టార్ ప్రభాస్ చేతి నిండా సినిమాలతో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన కల్కి 2898ఏడీ, రాజాసాబ్, సలార్-2, స్పిరిట్, కన్నప్ప(కీలక పాత్ర)తో బిజీగా ఉండగా.. ఇప్పుడు హను రాఘవపూడి చిత్రం కూడా ఒప్పుకొన్నారు. పీరియడ్ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమాను తీయనున్నట్లు హను ప్రకటించారు. కాగా.. మున్ముందు వరుసగా సినిమాలుండటంతో ప్రభాస్ ప్రస్తుతం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం.

News April 9, 2024

ఉగాది రోజు ఏం చేయాలి?

image

ఉగాది రోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి కొత్త దుస్తులు ధరించాలి. దైవదర్శనం చేసుకుని, పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. ఇళ్లను, వ్యాపార నిలయాలను మామిడి, పూల తోరణాలు, అరటి బోదెలతో అలంకరించాలి. దేవతార్చన, పంచాంగ పూజ చేయాలి. ఉగాది పచ్చడి, భక్ష్యాలు, పూర్ణాలు నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం పంచాంగ శ్రవణం, కవిత్వ, సాహిత్య గోష్ఠుల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది.

News April 9, 2024

ఏపీ పాలిసెట్ దరఖాస్తులకు రేపే లాస్ట్ డేట్

image

ఏపీ పాలిసెట్-2024 <>దరఖాస్తు<<>> గడువు రేపటితో ముగియనుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం గడువు ఈనెల 5తో ముగియాల్సి ఉండగా, 10వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అలాగే పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు ఉండదని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి ఇప్పటికే స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 27న పరీక్ష జరుగుతుందని తెలిపారు.

News April 9, 2024

కేజ్రీవాల్ పిటిషన్‌పై నేడు తీర్పు

image

ఎక్సైజ్ పాలసీ కేసులో తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. జస్టిస్ స్వర్ణ కాంత శర్మ మధ్యాహ్నం 2:30 గంటలకు తీర్పును వెల్లడించనున్నారు. ఈనెల 3న ఈడీ, కేజ్రీవాల్ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న జడ్జి తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

News April 9, 2024

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్

image

వేసవి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు 48 స్పెషల్ రైళ్లను నడుపనున్నట్లు ద.మ రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు సికింద్రాబాద్-నాగర్‌సోల్ (07517), నాగర్‌సోల్-సికింద్రాబాద్ (07518), తిరుపతి-మచిలీపట్నం (07121), మచిలీపట్నం-తిరుపతి (07122), CST ముంబై-కరీంనగర్ (01067), కరీంనగర్-CST ముంబై (01068), యశ్వంత్‌పూర్-కాలాబుర్గి(06505), కాలాబుర్గి-యశ్వంత్‌పూర్ (06506) మధ్య నడుస్తాయని తెలిపింది.

News April 9, 2024

ధోనీ రికార్డును సమం చేసిన జడేజా

image

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోనీ పేరిట ఉన్న ఓ రికార్డును ఆ జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సమం చేశారు. అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచిన CSK ప్లేయర్‌గా నిలిచారు. ధోనీ, జడేజా ఇప్పటివరకు 15 సార్లు PoTM అవార్డ్స్ గెలవగా, ఆ తర్వాతి స్థానాల్లో సురేశ్ రైనా (12), రుతురాజ్ గైక్వాడ్ (10), హస్సీ (10) ఉన్నారు.

News April 9, 2024

FD రేట్స్ పెంచిన బజాజ్ ఫైనాన్స్

image

బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. వివిధ కాల వ్యవధులు కలిగిన డిపాజిట్లపై 60 బేసిస్ పాయింట్ల వరకు పెంచినట్లు వెల్లడించింది. పెరిగిన వడ్డీ <>రేట్లు<<>> ఈనెల 3 నుంచి అమల్లోకి వచ్చాయని పేర్కొంది. సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 8.85%, సాధారణ పౌరులకు 8.6% వడ్డీ అందిస్తున్నట్లు తెలిపింది. 25-35 నెలల కాల వ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు 60 బేసిస్ పాయింట్లు పెంచింది.

News April 9, 2024

ఎమర్జెన్సీ అని చెప్పి స్టేడియంలో కనిపించిన ఉద్యోగి.. కానీ!

image

కప్పు గెలిచినా, గెలవకపోయినా RCBపై అభిమానులకున్న ప్రేమ మాత్రం తగ్గదు. అలాంటి ఓ అభిమాని స్టేడియంలో RCBvsLSG మ్యాచ్ చూడాలనుకుంది. అయితే, ఆఫీస్ నుంచి త్వరగా వెళ్లేందుకు ఇంట్లోని పెద్దవారికి ఆరోగ్యం బాలేదని బాస్‌కి చెప్పింది. అయితే, ఆమె బాస్ మ్యాచ్ చూస్తుండగా స్టేడియంలో ఆర్సీబీకి సపోర్ట్ చేస్తూ కనిపించింది. మ్యాచ్ ఓటమి తర్వాత తన బాస్ చేసిన మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

News April 9, 2024

ఈ రోజు నమాజ్ వేళలు

image

తేది: ఏప్రిల్ 9, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:51
సూర్యోదయం: ఉదయం గం.6:04
జొహర్: మధ్యాహ్నం గం.12:18
అసర్: సాయంత్రం గం.4:43
మఘ్రిబ్: సాయంత్రం గం.6:31
ఇష: రాత్రి గం.07.44
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 9, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.