India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
1860 : మొదటిసారి మానవుని కంఠధ్వని రికార్డు చేయబడింది
1893: బహుభాషావేత్త, రచయిత రాహుల్ సాంకృత్యాయన్ జననం
1930: తెలుగు నటుడు మన్నవ బాలయ్య జననం
1948: హిందీ నటి జయ బచ్చన్ జననం
1989: గాయకుడు, సంగీత దర్శకుడు ఏ.ఎం.రాజా మరణం
1994: స్వాతంత్య్ర సమరయోధుడు చండ్ర రాజేశ్వరరావు మరణం
2022: నటుడు మన్నవ బాలయ్య మరణం
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: ఏప్రిల్ 9, మంగళవారం
చైత్రము
శు.పాడ్యమి: రాత్రి 8:31 గంటలకు
రేవతి: ఉదయం 7:32 గంటలకు, అశ్విని: ఉదయం 5:06 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 8:27 నుంచి ఉదయం 9.16 గంటల వరకు
తిరిగి రాత్రి 10:58 నుంచి రాత్రి 11:45 వరకు
వర్జ్యం లేదు
* TG: నాపై కుట్ర జరుగుతోంది: సీఎం రేవంత్ రెడ్డి
* ఫోన్ ట్యాపింగ్‌లో నాపై తప్పుడు ప్రచారం: MLC నవీన్
* ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరణ
* AP: జనసేనకు మెగాస్టార్ చిరంజీవి రూ.5 కోట్ల విరాళం
* జనసేన నుంచి తప్పుకున్న పోతిన మహేశ్
* పీకే సలహాలు తీసుకుని ఉంటే మునిగేవాళ్లం: బొత్స
* రూ.400 లక్షల కోట్లకు చేరిన BSE లిస్టెడ్ కంపెనీల విలువ
AP: పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు గుడ్ న్యూస్. గత నెలలో నిర్వహించిన పరీక్షల మూల్యాంకనం పూర్తైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 47,88,738 జవాబు పత్రాలను 25వేల మందికి పైగా సిబ్బంది మూల్యాంకనం చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో మూల్యాంకనంలో ఎలాంటి ఆటంకం చోటు చేసుకోలేదని పేర్కొన్నారు. వచ్చే నెలలో పదో తరగతి ఫలితాలు రానున్నట్లు సమాచారం.
అక్కినేని అఖిల్, దర్శకుడు సురేందర్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సినిమా విడుదలై ఏడాది కావొస్తున్నా ఇంకా OTTలోకి రాలేదు. తాజాగా ఓ అభిమాని నిర్మాత అనిల్ సుంకరను ట్యాగ్ చేస్తూ ఏజెంట్ OTT రిలీజ్ చేయమని కోరారు. దీనికి ఆయన బదులిస్తూ మూవీ డిజిటల్ రైట్స్ B4Uకి ఇచ్చామని, వారు సోనీకి ఇచ్చినట్లు తెలిపారు. త్వరలో OTTలోకి వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.
చెపాక్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్కే సునాయాస విజయం సాధించింది. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రుతురాజ్ హాఫ్ సెంచరీతో(67* రన్స్) రాణించారు. దూబే 18 బంతుల్లో 28 రన్స్‌తో మెరుపులు మెరిపించారు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు, నరైన్ ఒక వికెట్ తీశారు. ఈ సీజన్‌లో కేకేఆర్‌కు ఇదే తొలి ఓటమి.
AP: తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘క్రోధి నామ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. క్రోధి అంటే కోపంతో ఉన్నవారు.. మీ ఆగ్రహం ధర్మాగ్రహం కావాలి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పాలన రావాలని కోరుకుందాం. ఈ ఉగాది ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించాలి’ అని ఆయన ఆకాంక్షించారు.
TG: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఇప్పటి వరకు రూ. 71కోట్లకు పైగా డబ్బు, విలువైన ఇతర వస్తువుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ.29.30 కోట్ల నగదు, రూ.9.54 కోట్ల మద్యం, రూ.15.34 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.10.33 కోట్ల విలువైన అభరణాలు, రూ.7.04 కోట్ల విలువైన ఇతర వస్తువులు ఉన్నట్లు వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాలు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్న సంగతి తెలిసిందే.
TG: మోడల్ స్కూళ్లలో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మే 25న ఫలితాలను విడుదల చేస్తామని.. అర్హత సాధించిన వారు మే 27 నుంచి 31వ తేదీ వరకు ప్రవేశాలు పొందవచ్చని పేర్కొంది. 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతి నుంచి 9వ తరగతి ప్రవేశాల కోసం ఏప్రిల్ 7న పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.