India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: BRS మాజీ MLA షకీల్ కుమారుడు రహీల్‌ను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన 15 మంది జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ప్రజాభవన్ వద్ద యాక్సిడెంట్ జరగ్గానే ట్రాఫిక్ పోలీసులు రహీల్‌తో సహా మరో ముగ్గురు యువతులను పంజాగుట్ట PSలో అప్పగించారు. కానీ అక్కడే కేసు ఎన్నో మలుపులు తిరిగింది. MLAతోపాటు ఇద్దరు CIలు, మరో 12 మంది అతడిని తప్పించేందుకు ప్రయత్నించారు. దీంతో వారిపై 19 సెక్షన్లతో కేసు రిజిస్టర్ చేశారు.
IPLలో వరుస విజయాలతో దూసుకుపోతోన్న లక్నో సూపర్ జెయింట్స్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు పేసర్లు మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్ గాయాల బారిన పడ్డారు. దీంతో వీరు ఈ నెల 12న DCతో జరిగే మ్యాచ్‌కు దూరం కానున్నట్లు సమాచారం. GTతో మ్యాచ్‌లో మయాంక్‌కు పొత్తి కడుపులో గాయమైనట్లు లక్నో యాజమాన్యం తెలిపింది. వారం పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు పేర్కొంది. మోసిన్ ఖాన్ వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు వెల్లడించింది.
మన దేశంలోని కార్పొరేట్ కంపెనీల సీఈవోల సగటు వార్షిక వేతనం రూ.13.8 కోట్లకు చేరినట్లు డెలాయిట్ నివేదిక వెల్లడించింది. కరోనాకు ముందుకంటే ఇది 40% అధికమని తెలిపింది. కంపెనీల ప్రమోటర్లు, వారి కుటుంబాలకు చెందిన సీఈవోలకు సగటున రూ.16.7 కోట్ల జీతం ఉంటోందని పేర్కొంది. ఐదేళ్లలో 45 శాతం సంస్థల్లో CEOల మార్పు జరిగిందని, ప్రతి 10 మంది CEOల్లో ఆరుగురిని సొంత కంపెనీల నుంచే ఎంపిక చేశారని చెప్పింది.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో మొదటి లేదా రెండో స్థానం వస్తుందన్న ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శలు గుప్పించారు. ‘ఆయన విశ్లేషణలు బిహార్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విఫలమయ్యాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా అంతే. రాష్ట్రంలో కాంగ్రెస్ అనుకూల వాతావరణం ఉంది. ప్రాంతీయ ప్రాధాన్యతలు దక్షిణాది ప్రజలకు తప్పకుండా తెలుసు’ అని ట్వీట్ చేశారు.
TG: అంత్యోదయ అన్నయోజన(ఏఏవై) కింద రేషన్ కార్డుదారులందరికీ చక్కెర పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. జిల్లాలవారీగా అవసరమైనంత చక్కెర తీసుకుని ఏఏవై కార్డుదారులకు పంపిణీ చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో 5.99 లక్షల కార్డుదారులు ఉండగా.. 599 టన్నుల చక్కెర అవసరం. మార్కెట్‌లో రూ.40-45 వరకు ధర ఉండగా.. సబ్సిడీపై రూ.13.50లకే అందించాలి.
TG: గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఈనెల 12వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని గురుకుల సొసైటీలు ఓ ప్రకటనలో తెలిపాయి. అర్హత పరీక్ష నిర్వహించి డిగ్రీ ఫస్టియర్‌లో వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనున్నట్లు పేర్కొన్నాయి. ఈనెల 28న రాత పరీక్ష ఉంటుందని, ఈనెల 21 నుంచి గురుకుల సొసైటీ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆమెను నేడు ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం కవిత తిహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు తన అరెస్టును వ్యతిరేకిస్తూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.
రియల్ ఎస్టేట్ రంగంలో 2013 నాటికి 4 కోట్ల ఉద్యోగాలుండగా, తర్వాత పదేళ్లలో 3 కోట్లకు పైగా ఉద్యోగాలు లభించాయని అనరాక్-నరెడ్కో నివేదిక వెల్లడించింది. గృహ నిర్మాణ రంగానికి కేంద్ర మద్దతు కలిసొచ్చిందని పేర్కొంది. భారతీయ స్థిరాస్తి రంగం విలువ 2025 నాటికి ₹54 లక్షల కోట్లకు, 2030 నాటికి ₹83 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా వేసింది. వ్యవసాయం తర్వాత ఈ రంగమే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోందని తెలిపింది.
AP: 2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్ కాలేజీల అకడమిక్ క్యాలెండర్‌ను విద్యాశాఖ విడుదల చేసింది.
✒ జూన్ 1న కాలేజీల పునః ప్రారంభం
✒ త్రైమాసిక పరీక్షలు SEP 23-28 వరకు
✒ దసరా సెలవులు OCT 3-11 వరకు
✒ హాఫ్ ఇయర్లీ పరీక్షలు DEC 16-21 వరకు
✒ సంక్రాంతి సెలవులు 2025 జనవరి 12-18 వరకు
✒ ప్రీఫైనల్ పరీక్షలు FEB 3 నుంచి 10 వరకు, ప్రాక్టికల్స్ ఫిబ్రవరి రెండో వారంలో, థియరీ పరీక్షలు మార్చి మొదటి వారంలో ఉంటాయి.
‘ఉగ’ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది. అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. చైత్ర శుక్ల పాడ్యమినాడు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని, సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపుకుంటారు. అలాగే సోమకుడు వేదాలను తస్కరించడంతో విష్ణువు మత్స్యావతారంలో అతడిని సంహరించి, వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగిస్తాడు. ఈ సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.
Sorry, no posts matched your criteria.