India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP EAPCETకు దరఖాస్తు గడువు ఈనెల 15న ముగియనుండగా, ఇప్పటివరకు 3.05 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సెట్ కన్వీనర్ ప్రొ.కె.వెంకటరెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,35,417, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 69,445, రెండు విభాగాల్లో కలిపి 892 చొప్పున అప్లికేషన్స్ వచ్చాయన్నారు. మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 18 నుంచి 22 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ముగ్గురు మంత్రులు తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించగా పార్టీ అధిష్ఠానం తిరస్కరించినట్లు సమాచారం. దీంతో మాజీ ఎంపీ సురేంద్రరెడ్డి తనయుడు రఘురామిరెడ్డికి సీటు ఇచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. తాజాగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు తెరపైకి వచ్చింది. వీరిద్దరిలో అధిష్ఠానం ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి.
AP: శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. రాష్ట్రస్థాయిలో విజయవాడలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఉ.9 గంటలకు కప్పగంతుల సుబ్బరామ సోమయాజులు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. 18 మంది వేద పండితులు, అర్చకులను అధికారులు సత్కరిస్తారు. అలాగే ప్రతి జిల్లాలో ఇద్దరు అర్చకులు, ఓ వేద పండితుడిని సత్కరించి ఓ ప్రశంసా పత్రం, రూ.10,116 సంభావన, కొత్త వస్త్రాలు అందజేస్తారు.
* అరకు (ఎంపీ)-పాచిపెంట అప్పలనర్స
* రంపచోడవరం-లోతా రామారావు
* కురుపాం-మండంగి రమణ
* అరకు-దీసరి గంగరాజు, గాజువాక-జగ్గునాయుడు
* గన్నవరం-కళ్ళం వెంకటేశ్వరరావు
* నెల్లూరు సిటీ-మూలం రమేశ్
* కర్నూలు-గౌస్ దేశాయి, సంతనూతలపాడు-ఉబ్బా ఆదిలక్ష్మి
* విజయవాడ సెంట్రల్-బాబురావు, మంగళగిరి-శివశంకర్
AP: తెలుగు ప్రజలకు సీఎం జగన్ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ ఏడాది ప్రజలందరికీ శుభాలు జరగాలి. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలి. అన్ని వృత్తుల వారు ఆనందంగా ఉండాలి. ప్రతి ఇల్లూ కళకళలాడాలి. మన సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి’ అని ఆకాంక్షించారు.
ఐపీఎల్-2024లో భాగంగా ఇవాళ PBKS, SRH జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చండీగఢ్ వేదికగా రాత్రి 7:30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ రెండు టీమ్స్ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు 21 సార్లు తలపడ్డాయి. 14 మ్యాచుల్లో SRH గెలవగా, 7 మ్యాచుల్లో PBKS విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో హైదరాబాద్ 5వ స్థానంలో, పంజాబ్ 6వ స్థానంలో ఉన్నాయి. నేడు గెలుపెవరిది? కామెంట్ చేయండి.
భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామివారి దేవస్థానంలో ఉగాది సందర్భంగా శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఈనెల 23 వరకు బ్రహ్మోత్సవాలు జరగనుండగా, ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 17న శ్రీరామనవమి సందర్భంగా ఉ.10:30 గంటల నుంచి మ.12:30 గంటల వరకు మిథిలా మండపంలో శ్రీసీతారామ కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 18న మహా పట్టాభిషేకం జరగనుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ చేతి నిండా సినిమాలతో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన కల్కి 2898ఏడీ, రాజాసాబ్, సలార్-2, స్పిరిట్, కన్నప్ప(కీలక పాత్ర)తో బిజీగా ఉండగా.. ఇప్పుడు హను రాఘవపూడి చిత్రం కూడా ఒప్పుకొన్నారు. పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తీయనున్నట్లు హను ప్రకటించారు. కాగా.. మున్ముందు వరుసగా సినిమాలుండటంతో ప్రభాస్ ప్రస్తుతం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం.
ఉగాది రోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి కొత్త దుస్తులు ధరించాలి. దైవదర్శనం చేసుకుని, పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. ఇళ్లను, వ్యాపార నిలయాలను మామిడి, పూల తోరణాలు, అరటి బోదెలతో అలంకరించాలి. దేవతార్చన, పంచాంగ పూజ చేయాలి. ఉగాది పచ్చడి, భక్ష్యాలు, పూర్ణాలు నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం పంచాంగ శ్రవణం, కవిత్వ, సాహిత్య గోష్ఠుల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది.
ఏపీ పాలిసెట్-2024 <
Sorry, no posts matched your criteria.