News March 17, 2024

WPL: ఆర్సీబీ ఘన విజయం

image

WPL సీజన్-2 ఫైనల్‌లో ఢిల్లీపై ఆర్సీబీ ఘన విజయం సాధించి తొలిసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. 114 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సోఫీ డివైన్(32), స్మృతి మంధాన(31), ఎల్లిస్ ఫెర్రీ(35*) రాణించారు. ఢిల్లీ బ్యాటర్లలో షెఫాలీ వర్మ(44), మెగ్ లానింగ్(23) మినహా అందరూ విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 4, సోఫీ మొలినిక్స్ 3, శోభనా ఆశా 2 వికెట్లు పడగొట్టారు.

News March 17, 2024

నీలిచిత్రాలు ఎక్కువగా చూస్తున్నారా…?

image

పరిమితంగా ఉంటే అలవాటు. పరిధి దాటితే వ్యసనం. అలవాట్లు ప్రమాదకరం కాకపోవచ్చు కానీ.. వ్యసనంగా మారే ఏదైనా ప్రమాదమే. నీలిచిత్రాల విషయంలోనూ ఇది వర్తిస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఒకస్థాయి తర్వాత మెదడు ఉద్వేగరహిత స్థాయికి చేరి మొద్దుబారిపోతుందంటున్నారు. ‘పోర్న్ వ్యసనంతో శృంగారాన్ని ఆస్వాదించే సామర్థ్యాన్ని మెదడు కోల్పోతుంది. దాంపత్యంపై అది తీవ్ర ప్రభావం చూపిస్తుంది’ అని నిపుణులు వారిస్తున్నారు.

News March 17, 2024

జగన్‌తో స్నేహం చేసి కాంగ్రెస్‌పై విమర్శలా?: షర్మిల

image

AP: సీఎం జగన్, చంద్రబాబును రెండు పంజరాల్లో పెట్టుకుని ఆడిస్తున్న రింగ్ మాస్టర్ బీజేపీ అని APCC చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ‘పదేళ్ల రాష్ట్ర వినాశనంలో ముఖ్యపాత్ర పోషించి ఇప్పుడు నా మీద దాడులా. కాంగ్రెస్, వైసీపీ ఒకటే అని కూతలా? ఐదేళ్లుగా జగన్‌తో తెరచాటు స్నేహం నడిపారు. దత్తపుత్రుడు అన్నారు. జగన్ అరాచకాలకు అడ్డగోలు సహాయ సహకారాలు అందించి ఇప్పుడు కాంగ్రెస్ మీద పసలేని దాడులా’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

News March 17, 2024

రేపు BRSలో చేరుతున్నా: ప్రవీణ్ కుమార్

image

TG: ఇటీవల బీఎస్పీకి రాజీనామా చేసిన RS ప్రవీణ్‌కుమార్.. BRSలో చేరుతున్నట్లు ప్రకటించారు. ‘నా రాజకీయ భవితవ్యంపై శ్రేయోభిలాషులతో చర్చించా. తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం రేపు కేసీఆర్ సమక్షంలో BRSలో చేరుతున్నాను. నేను ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటా. వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తా’ అని ట్వీట్ చేశారు.

News March 17, 2024

‘12th ఫెయిల్’ రియల్ హీరోకి ప్రమోషన్

image

12th ఫెయిల్ సినిమా స్టోరీకి కార‌ణ‌మైన రియ‌ల్ లైఫ్ ఆఫీస‌ర్ మ‌నోజ్ కుమార్ శ‌ర్మ ప్రమోషన్ పొందారు. మహారాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తున్న ఆయనకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ నుంచి ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా ఉద్యోగోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘ASP నుంచి నా ఉద్యోగ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇప్పుడు ఐజీ స్థాయికి ఎదిగా’ అని రాసుకొచ్చారు.

News March 17, 2024

ఆ పాత్ర కోసం 31 కిలోలు తగ్గా: పృథ్వీరాజ్ సుకుమారన్

image

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఆడుజీవితం’ ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఈ మూవీలో తాను నజీబ్ అనే బానిస పాత్ర పోషించానని, ఇందు కోసం 31 KGల బరువు తగ్గానని పృథ్వీ వెల్లడించారు. జిమ్ ట్రైనర్, డాక్టర్ల పర్యవేక్షణతో ఇది సాధ్యమైందన్నారు. జోర్డాన్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు కరోనా లాక్‌డౌన్ విధించడంతో చాలా కష్టపడ్డామని తెలిపారు. కాగా ఈ చిత్రం ‘ది గోట్ లైఫ్’ పేరుతో ఇంగ్లిష్‌లోనూ రిలీజ్ కానుంది.

News March 17, 2024

మైక్ ఫెయిల్.. మీటింగ్ ఫెయిల్: మంత్రి అంబటి

image

AP: టీడీపీ-బీజేపీ-జనసేన ప్రజాగళం సభలో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తడంపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ‘మైక్ ఫెయిల్.. మీటింగ్ ఫెయిల్.. టోటల్‌గా ముగ్గురూ ఫెయిల్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తోన్న సమయంలో నాలుగైదుసార్లు మైక్ కట్టయ్యింది. లైవ్ కూడా అస్తవ్యస్తంగా ప్రసారమైన విషయం తెలిసిందే.

News March 17, 2024

థ్రిల్లింగ్: భూమి నుంచి 30KM ఎత్తులో భోజనం..

image

ఆకాశంలో కూర్చుని సూర్యోదయాన్ని చూస్తూ భోజనం చేయడమనే ఆలోచనే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. USకు చెందిన SpaceVIP అనే ప్రైవేట్ స్పేస్ టూరిజం సంస్థ దీన్ని వచ్చే ఏడాది నిజం చేయనుంది. ప్రపంచంలోనే తొలి కార్బన్ న్యూట్రల్ స్పేస్ కాప్సుల్ ద్వారా లక్ష అడుగుల(30KM) ఎత్తుకు తీసుకెళ్తారు. అక్కడ భోజనం చేస్తూ సన్ రైజ్‌ను చూడొచ్చు. భూమిపై ఉన్నవారితో లైవ్ వీడియో మాట్లాడొచ్చు. ఒక్కొక్కరికి ధర రూ.4 కోట్లు.

News March 17, 2024

రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

image

AP: జూన్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను రేపు ఉ.10 గంటలకు TTD విడుదల చేయనుంది. 20వ తేదీ ఉ.10 వరకు లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. 21న ఉ.10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్లు విడుదలవుతాయి. 23న ఉ.11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటా, 25న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను రిలీజ్ చేస్తారు.
వెబ్‌సైట్: <>https://ttdevasthanams.ap.gov.in<<>>

News March 17, 2024

నంబర్ 1 స్థానంలో ‘ప్రజాగళం’ ట్రెండింగ్!

image

AP: చిలకలూరిపేటలో ఎన్డీయే కూటమి ‘ప్రజాగళం’ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ సభలో ప్రసంగించారు. కాగా.. సోషల్ మీడియాలో ప్రజాగళం హ్యాష్ ట్యాగ్ అగ్రస్థానంలో ట్రెండ్ అయింది. 67వేలకు పైగా పోస్టులు ట్విటర్‌లో వచ్చాయి. ఏపీ వెల్కమ్స్ మోదీ, చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ, ఆంధ్ర ప్రదేశ్ హ్యాష్ ట్యాగ్ లు కూడా ట్రెండింగ్‌ అయ్యాయి.