India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: భీమిలి నియోజకవర్గం మొదటి నుంచి TDPకి కంచుకోట. 1980 నుంచి ఇక్కడ ఆ పార్టీ హవానే కొనసాగుతోంది. ఇక్కడ TDPకి బలమైన కేడర్ ఉంది. ఇతర పార్టీలు గెలిచినా స్వల్ప మెజారిటీతో గెలవాల్సిందే. అందుకే ఈ సీటు అంటే అందరికీ ఇష్టం. ఇక్కడి ప్రజలు కొత్తవారిని బాగా ఆదరిస్తారు. ఇక్కడ కాపు, యాదవుల ఓట్లే అధికం. దీంతో భీమిలిలో పోటీ చేసేందుకు నేతలు పోటీ పడుతుంటారు. మరీ ముఖ్యంగా టీడీపీలో పోటీ అధికంగా ఉంటుంది.
దివంగత సింగర్ సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులు రెండో బిడ్డకు జన్మనివ్వడం వివాదాస్పదంగా మారుతోంది. సిద్ధూ తల్లి చరణ్ కౌర్ 58 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ పద్ధతిలో రెండో బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఆమెకు 58 ఏళ్ల వయసులో ఐవీఎఫ్‌కు ఎలా అనుమతి ఇచ్చారని పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశ్నించింది. ఐవీఎఫ్ పద్ధతిలో బిడ్డను కనడానికి 21 నుంచి 50 ఏళ్ల వారికే అనుమతి ఉందని తెలిపింది. దీనిపై నివేదిక సమర్పించాలని లేఖ రాసింది.
AP: గిద్దలూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో రాజకీయ హత్యలు, మాచర్లలో వాహనం తగలబెట్టిన ఘటనలపై EC రంగంలోకి దిగింది. ఈ అంశాలపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని SPలు పరమేశ్వర్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, రఘువీరారెడ్డిలను ఆదేశించింది. ఈ ఘటనలు ఎందుకు జరిగాయి? ఎవరు చేశారు? ఎందుకు నియంత్రించలేదు? అనే అంశాలపై నేడు వివరణ తీసుకోనుంది. అటు ప్రధాని మోదీ బొప్పూడి సభలో భద్రతా వైఫల్యంపై కేంద్రానికి నివేదికలు పంపింది.
TG: ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి TDP పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. TDP, BJP పొత్తులో భాగంగా ఈ సీటును ఆ పార్టీకి కేటాయించినట్లు సమాచారం. ఇక్కడి నుంచి కమ్మ సామాజికవర్గ అభ్యర్థిని బరిలోకి దించుతున్నట్లు టాక్. మొత్తం 17 స్థానాలకు గానూ 15 స్థానాలకు BJP అభ్యర్థులను ఖరారు చేసింది. వరంగల్, ఖమ్మం సెగ్మెంట్లను పెండింగ్‌లో ఉంచింది. వరంగల్ నుంచి ఆరూరి రమేశ్, ఖమ్మం నుంచి TDP పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది.
✒ బందోబస్తుకు రాష్ట్ర పోలీసులు- 1.50 లక్షలు
✒ స్టేట్ ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్- 522 కంపెనీలు
✒ సెంట్రల్ ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్- 465 కంపెనీలు
✒ పోలింగ్ అధికారులు- 2,48,814
✒ ప్రిసైడింగ్ అధికారులు- 55,269
✒ బూత్‌స్థాయి సిబ్బంది- 46,165
✒ మైక్రో అబ్జర్వర్లు- 18,961
✒ సెక్టోరల్ అధికారులు- 5,067
<<-se>>#ELECTIONS2024<<>>
AP:ప్రముఖ విద్యావేత్త, రత్నం విద్యాసంస్థల అధినేత కొర్రపాటి వెంకటరత్నం(82) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. APలోనే తొలిసారిగా కోచింగ్ సెంటర్లను నెల్లూరులో ఏర్పాటు చేసిన ఘనత ఆయనది. పేద విద్యార్థులకు తమ సంస్థల్లో ఉచిత బోధన అందించిన ఆయన.. గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు సొంత డబ్బుతో శస్త్రచికిత్సలు చేయించారు. ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
AP: రాష్ట్రంలోని అన్ని సెట్‌టాప్ బాక్సుల సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు APSFL వెల్లడించింది. ఎన్నికల కోడ్‌కు అనుగుణంగా డేటాను మార్చుతున్నామని, 48 గంటల్లో సేవలను పునరుద్ధరిస్తామని తెలిపింది. ప్రభుత్వ ప్రకటనలు, అభివృద్ధి కార్యక్రమాల సమాచారం సెట్‌టాప్‌లలో ప్రసారం కావడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
AP: జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27 నుంచి ఆయన ఉత్తరాంధ్రలో తొలివిడత పర్యటన ప్రారంభిస్తారని జనసేన పార్టీ తెలిపింది. కీలక నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని పేర్కొంది. పవన్ వారాహి యాత్ర కొన్ని నెలల క్రితం అర్ధాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తారని, ఈ మేరకు హైదరాబాద్ నుంచి మంగళగిరికి వారాహి వాహనం బయలుదేరిందని జనసేన వర్గాలు వెల్లడించాయి.
రేపటి నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. రెండున్నర నెలలపాటు క్రికెట్ ప్రేమికులను అలరించనుంది. 10 జట్లు టైటిల్ కోసం బరిలోకి దిగనున్నాయి. తొలి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సీఎస్కే-ఆర్సీబీ మధ్య జరగనుంది. అలాగే ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీ వేడుకలు అదిరిపోనున్నాయి. ఏఆర్ రెహమాన్, అక్షయ్ కుమార్, సోనూ నిగమ్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్లు తమ ప్రదర్శనలతో అలరించనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఇవాళ ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, PDPL, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, KMM, NLG, SRPT, MHBD, WL, JN జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని IMD హెచ్చరించింది. ఏపీలోని అల్లూరి, కోనసీమ, తూ.గో, ELR, GNT, బాపట్ల, OGL జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది.
Sorry, no posts matched your criteria.