News March 21, 2024

పతంజలి ఎండీ క్షమాపణలు

image

పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ బేషరతు క్షమాపణలు చెప్పారు. సంస్థ ఉత్పత్తుల యాడ్స్ తప్పుదోవపట్టించేలా ఉండటంపై ఏప్రిల్ 2న విచారణకు హాజరుకావాలని సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తాము ఉద్దేశపూర్వకంగా చేయలేదని భవిష్యత్తులో ఈ తప్పులు జరగవని వివరించారు. కాగా వ్యాధుల చికిత్సకు సంబంధించి పతంజలి ఆయుర్వేద్ ఉత్పత్తుల యాడ్స్‌పై సుప్రీంకోర్టు ఇప్పటికే నిషేధం విధించింది.

News March 21, 2024

ముక్క లేకపోతే ముద్ద దిగట్లేదు..

image

దేశంలో మాంస ప్రియుల సంఖ్య పెరిగిపోతోంది. 2015లో 74% మంది మాంసాహారులు ఉండగా, 2021 నాటికి 77 శాతానికి చేరినట్లు స్టాటిక్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. లక్షద్వీప్‌లో 100%, ఈశాన్య రాష్ట్రాల్లో 99%, కేరళలో 98%, పుదుచ్చేరిలో 97%, తమిళనాడులో 96.4% మంది మాంసాహారులు ఉన్నట్లు తెలిపింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 96% మందికి ముక్కలేనిదే ముద్ద దిగట్లేదట. 7-15 రోజుల్లో ఒక్కసారైనా మాంసం తింటున్నారని పేర్కొంది.

News March 21, 2024

IPL: ఆటగాళ్ల వేలం కోసం త్వరలో కొత్త విధానం!

image

IPL వేలంలో విదేశీ, స్వదేశీ ఆటగాళ్ల వేతనాల్లో చాలా వ్యత్యాసం ఉంటోంది. విదేశీ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు భారీ మొత్తాలు చెల్లిస్తున్నాయి. త్వరలో దీనిపై సమీక్ష జరిపి, ప్లేయర్ ఆక్షన్ కోసం కొత్త విధానం తీసుకొస్తామని IPL ఛైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. త్వరలోనే ఫ్రాంచైజీలతో ఈ అంశంపై చర్చిస్తామన్నారు. గత మినీ వేలంలో స్టార్క్(KKR) ₹24.75 కోట్లు, కమిన్స్ (SRH) ₹20.5 కోట్లు పలికిన సంగతి తెలిసిందే.

News March 21, 2024

బాత్రూమ్ వాడొచ్చా అని అడిగి.. మహిళపై లైంగిక దాడి!

image

బెంగళూరు బ్రూక్‌ఫీల్డ్ సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో నివసించే ఓ మహిళపై డెలివరీ బాయ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ‘పార్సిల్‌తో వచ్చిన ఓ డెలివరీ బాయ్‌కి తాగేందుకు నీరు ఇచ్చా.. తాగి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికే మళ్లీ వచ్చి బాత్రూమ్ వాడుకోవచ్చా? అని అడిగాడు. సరేనని లోనికి రానిస్తే బాత్రూమ్ నుంచి బయటకొచ్చి కిచెన్‌లో నా చేయి పట్టుకొని తప్పుగా ప్రవర్తించాడు. ప్రతిదాడి చేయడంతో పారిపోయాడు’ అని ఆమె చెప్పారు.

News March 21, 2024

మనిషి మెదడులో చిప్ ఎలా పనిచేస్తుంది?

image

మనిషి పుర్రెలోని చిన్న భాగాన్ని తొలగించి S1 అనే చిప్‌ను అమరుస్తారు. దీని వ్యాసం 8MM మాత్రమే. వెంట్రుకతో పోలిస్తే 20వ వంతు మందం ఉంటుంది. చిప్‌లోని 3వేలకుపైగా మైక్రో ఎలక్ట్రోడ్లను మెదడులోని ముఖ్య భాగాలకు అనుసంధానిస్తారు. ఇవి న్యూరాన్ల మధ్య ప్రసారమయ్యే మెసేజ్‌లను గుర్తించి చిప్‌నకు పంపుతాయి. అక్కడి నుంచి బయటకు కంప్యూటర్‌తో అనుసంధానించి ఆలోచనలను ప్రభావితం చేయొచ్చు.

News March 21, 2024

కోకాపేటలో 63 అంతస్తుల భవనం

image

TG: ఆకాశమే హద్దుగా అన్నట్లు హైదరాబాద్‌లో భవన నిర్మాణాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తాజాగా కోకాపేటలో 63 అంతస్తులతో ఓ భారీ భవనం నిర్మించేందుకు బిల్డర్లు ప్రయత్నిస్తున్నారు. డిజైన్లు, స్థలం ఎంపిక పూర్తయ్యాక అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 59 అంతస్థులతో పుప్పాల్‌గూడలో క్యాండూర్ స్కైలెన్, 58 అంతస్తులతో సాస్‌క్రౌన్ పేరుతో జరుగుతున్న నిర్మాణాలే టాప్.

News March 21, 2024

ఈడీ కస్టడీలో కవిత భగవద్గీత పఠనం, ధ్యానం

image

ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్న ఏకాదశి సందర్భంగా ఉపవాసం ఉన్నట్లు తెలుస్తోంది. భగవద్గీత పఠనం, భగవన్నామ స్మరణ, ధ్యానం చేస్తున్నారని ఈడీ వర్గాలు తెలిపాయి. ఉపవాసం కారణంగా కొన్ని పండ్లు మాత్రమే ఆమె తీసుకున్నారని పేర్కొన్నాయి. అంబేడ్కర్ జీవిత గాథ సహా పలు పుస్తకాలను అడిగి తెప్పించుకుని చదువుతున్నట్లు సమాచారం. ఇక.. ఈరోజు కవితతో ఆమె తల్లి శోభ భేటీ కానున్నారు.

News March 21, 2024

5,348 ఉద్యోగాలకు జూన్‌లో నోటిఫికేషన్?

image

TG: వైద్యారోగ్యశాఖలో 5,348 <<12890379>>పోస్టుల<<>> భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు జూన్‌లో నోటిఫికేషన్ రానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. DME పరిధిలో 3,234, వైద్య విధాన పరిషత్‌లో 1,255, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 575, MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో 212, IPMలో 34, ఆయుష్ విభాగంలో 26, ఔషధ నియంత్రణ మండలిలో 11 పోస్టులున్నాయి. మొత్తంగా 1,989 నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

News March 21, 2024

ఎన్నికల కోసం 60 ఏళ్లకు పెళ్లి

image

బిహార్‌లో అశోక్ మహతో(60) అనే గ్యాంగ్‌స్టర్ ఓ హత్య కేసులో 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి గత ఏడాదే రిలీజ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆర్జేడీ తరఫున ముంగేర్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకోగా, చట్టపరంగా సాధ్యం కాలేదు. దీంతో పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సూచన మేరకు లేటు వయసులో అనితా కుమారి(44) అనే మహిళను గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆమెను ఎన్నికల బరిలో నిలపనున్నారు.

News March 21, 2024

హమాస్‌పై యుద్ధం కొనసాగుతుంది: నెతన్యాహు

image

హమాస్‌పై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని అమెరికాలోని రిపబ్లికన్ సెనేటర్లకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు. దాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. శాంతికి నెతన్యాహు విఘాతంగా మారారని డెమొక్రాట్లు విమర్శిస్తున్న నేపథ్యంలో రిపబ్లికన్లతో వీడియో కాన్ఫరెన్స్ ప్రాధాన్యం సంతరించుకుంది. నెతన్యాహును తమ చట్టసభకు ఆహ్వానించే ఆలోచన ఉందని రిపబ్లికన్లు చెబుతున్నారు.