News March 20, 2024

జంక్ ఫుడ్ ఎంత పని చేసింది

image

జంక్ ఫుడ్ తినొద్దని తండ్రి మందలించినందుకు కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలో జరిగింది. నాగ్‌పూర్‌లో బీబీఏ చేస్తున్న భూమిక వినోద్ ధన్వానీ థైరాయిడ్ సమస్యతో బాధపడుతోంది. జంక్ ఫుడ్ తింటే ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉండటంతో తండ్రి మందలించారు. కలతచెందిన యువతి వంటగదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై యాక్సిడెంటల్ డెత్‌గా పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 20, 2024

బ్రిటన్ యువరాణి అదృశ్యం?

image

బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ కొద్దిరోజులుగా బాహ్య ప్రపంచంలో కనిపించడం లేదు. దీంతో ఆమె అదృశ్యంపై ఊహాగానాలు, ప్రచారాలు జోరందుకున్నాయి. ఆమె కోమాలో ఉన్నారని కొందరు.. యువరాజు విలియం అఫైర్ మరో కారణమని చర్చించుకుంటున్నారు. మూడు నెలలుగా ఆమె ఎవరికీ కనిపించలేదని న్యూయార్క్ పోస్ట్ కూడా ఓ కథనం ప్రచురించింది. ఇదే విషయమై యువరాజు మామ కేట్ మిస్సింగ్‌పై అనుమానం వ్యక్తం చేశారు. నెట్టింట దీనిపై తీవ్ర జరుగుతోంది.

News March 20, 2024

‘గేమ్ ఛేంజర్’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్

image

మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఓటీటీ పార్ట్‌నర్‌ను ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎస్‌జే సూర్య, అంజలి, జయరామ్, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.

News March 20, 2024

తీహార్ జైల్లో మొబైల్ జామర్లు

image

తీహార్ జైల్లో ఖైదీలు ఫోన్‌లు ఉపయోగించడాన్ని అరికట్టేలా అధికారులు చర్యలు చేపట్టారు. రూ.11.5 కోట్ల వ్యయంతో జైలులో 15 సిగ్నల్ జామర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కాల్ బ్లాకింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఢిల్లీలోని చాణక్యపురి నుంచి 7కి.మీ దూరంలో తీహార్ గ్రామంలో ఉన్న ఈ జైలు ఆసియాలో అతిపెద్దది. గత కొన్నేళ్లలో ఇక్కడ నుంచి గ్యాంగ్‌స్టర్లు ఫోన్లు వాడటం, బయటి వారిని బెదిరించడం వంటి ఘటనలు వెలుగు చూశాయి.

News March 20, 2024

మార్చి 20: చరిత్రలో ఈ రోజు

image

1351: ఢిల్లీ సుల్తాన్ ముహమ్మద్ బిన్ తుగ్లక్ మరణం
1602: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన
1980: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ జననం
1986: హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ జననం
1987: టాలీవుడ్ సింగర్ హరిచరణ్ జననం
2008: సినీ నటుడు శోభన్ బాబు మరణం
అంతర్జాతీయ సంతోష దినం

News March 20, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 20, 2024

ఇల్లినాయ్ సదస్సుకు కేటీఆర్‌కు ఆహ్వానం

image

TG: వచ్చే నెల 13న ఇల్లినాయ్‌లో జరిగే సదస్సుకు మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. అమెరికా నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘భారత పారిశ్రామిక రంగంలో అవకాశాలు-సవాళ్లు’ అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ ఆయనకు లేఖ రాసింది. కాగా కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న ఆశయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అమెరికా నార్త్ వెస్టర్న్ వర్సిటీ తెలిపింది.

News March 20, 2024

ఈ రోజు నమాజ్ వేళలు

image

తేది: మార్చి 20, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున గం.5:08
సూర్యోదయం: ఉదయం గం.6:20
జొహర్: మధ్యాహ్నం గం.12:23
అసర్: సాయంత్రం గం.4:45
మఘ్రిబ్: సాయంత్రం గం.6:27
ఇష: రాత్రి గం.07.39
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 20, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 20, 2024

శుభ ముహూర్తం

image

తేదీ: మార్చి 20, బుధవారం,
ఫాల్గుణము
శుద్ధ ఏకాదశి: తెల్లవారుఝామున 02:23 గంటలకు
పుష్యమి: రాత్రి 10:38 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 11:50-12:38 గంటల వరకు
వర్జ్యం: ఉదయం 04:59-06:45 గంటల వరకు