India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: విశాఖ జిల్లా జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. విశాఖ సౌత్ సీటు స్థానికులకే కేటాయించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ జెండా మోయని, ఇటీవల పార్టీలోకి వచ్చిన వంశీకి సీటు ఇస్తే ఊరుకోమంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో టికెట్ కేటాయింపుపై జనసేనాని ఎలా ముందుకెళ్తారనేది ఆసక్తిగా మారింది.
టోర్నీ ఏదైనా ట్రోఫీకి ఎడమ(లెఫ్ట్) వైపు నిల్చున్న వారిదే విజయం అని RCB ఉమెన్స్ జట్టు కెప్టెన్ స్మృతి మంధాన మరోసారి నిరూపించారు. ఫైనల్స్‌కు ముందు ట్రోఫీకి కుడివైపు DC కెప్టెన్, ఎడమ వైపు RCB కెప్టెన్ మంధాన నిల్చున్నారు. గత WPLలోనూ MI కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఎడమ వైపే నిల్చుని గెలిచారు. దీంతోపాటు T20 WCలో ఇంగ్లండ్, WTCలో ఆస్ట్రేలియా, వరల్డ్ కప్-2023లో ఆస్ట్రేలియా కెప్టెన్లు లెఫ్ట్ సైడే నిల్చున్నారు.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇవాళ ముంబై ఇండియన్స్ ట్రైనింగ్ క్యాంపులో చేరనున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. గత కొన్ని నెలలుగా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచులతో బిజీగా ఉన్న హిట్‌మ్యాన్.. క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. మరో 4 రోజుల్లో ఐపీఎల్-2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు జట్టుతో చేరనున్నారు. ఈ సారి ముంబై కెప్టెన్‌గా హార్దిక్ వ్యవహరించనుండగా, రోహిత్ బ్యాటర్‌గా ఆడనున్నారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “2019లో బీజేపీ ఓటమి తర్వాత ‘నేను మళ్లీ తిరిగొస్తా’ అని అప్పుడు చేసిన ప్రచారాన్ని ఎద్దేవా చేశారు. కానీ తర్వాత రెండు పార్టీలను చీల్చి అధికారంలోకి వచ్చాను. ఇద్దరు స్నేహితులనూ వెంట తెచ్చుకున్నా. పవర్‌లోకి రావడానికి రెండున్నరేళ్లు పట్టింది” అని తెలిపారు. కాగా ఏక్‌నాథ్ షిండే వల్ల శివసేన, అజిత్ పవార్‌తో NCP చీలిపోయిన సంగతి తెలిసిందే.
TS గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి MPగా పోటీ చేస్తారని సమాచారం. చెన్నై సౌత్, తిరునల్వేలి, కన్యాకుమారిలో ఒక చోట నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తిరునల్వేలి, కన్యాకుమారిలో ఆమె సామాజికవర్గ నాడార్ ఓట్లు అధికం. తెలంగాణ గవర్నర్‌గా ఆమె 2019, సెప్టెంబర్ 8న భాద్యతలు చేపట్టారు. KCR ప్రభుత్వ పలు నిర్ణయాలు అడ్డుకుని సంచలనంగా మారారు.
TG: మే 13న లోక్ సభ ఎన్నికల పోలింగ్, జూన్ 4న ఎన్నికల ఫలితాల ప్రకటన ఉండడంతో పలు ప్రవేశ పరీక్షల తేదీలు మారే అవకాశం కనిపిస్తోంది. పరీక్షల రీషెడ్యూల్‌పై రేపు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే విడుదలైన షెడ్యూల్ ప్రకారం మే 9 నుంచి 12 వరకు EAPCET, జూన్ 4, 5 తేదీల్లో ఐసెట్, జూన్ 3న లాసెట్ నిర్వహించనున్నారు.
ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించడంలో గోప్యత తగదని CJI జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్‌బీఐకి స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల నంబర్లతో సహా SBI పరిధిలో ఉన్న అన్ని వివరాలు బహిర్గతం చేయాలని ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్స్ కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా వివరాలను వెల్లడించడానికి వెనుకాడమని తమ వద్ద అన్ని వివరాలు బయటపెడతామని SBI తరఫు లాయర్ సాల్వే పేర్కొన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ మూడో ప్రపంచ యుద్ధం ప్రస్తావన తీసుకురావడం ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రష్యాకు, అమెరికా నేతృత్వంలోని నాటోకు యుద్ధమంటే మూడో ప్రపంచ యుద్ధానికి అడుగుదూరంలోనే ఉన్నట్లని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితిని ఎవరూ కోరుకోరని అన్నారు. ‘ఉక్రెయిన్‌కు నాటో సైన్యం చేరుకున్నట్లు గుర్తించాం. వారికి ఇది మంచిది కాదు. భారీ సంఖ్యలో కన్నుమూస్తారు’ అని హెచ్చరించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రెండో రోజు BRS ఎమ్మెల్సీ కవిత విచారణ ప్రారంభమైంది. రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారం, ఇతర నిందితుల వాంగ్మూలాలపై ఆమెను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అటు ఇవాళ్టి విచారణకు తాము హాజరుకావడం లేదని ఇటీవల నోటీసులు అందుకున్న కవిత భర్త అనిల్, వ్యక్తిగత సిబ్బంది ఈడీకి బదులిచ్చారు. ఇక కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది.
ఓ దశలో క్రికెట్‌ను వదిలేద్దామని అనుకున్నానని టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్ వెల్లడించారు. “గతంలో సరైన అవకాశాలు లేనప్పుడు మానసిక ఒత్తిడికి లోనయ్యా. ఓసారి ఇంట్లో నాన్నతో ఏదో గొడవైనప్పుడు ఆయన ‘నీకు నిజాయతీ ఎక్కువ అందుకే నష్టపోతున్నావ్’ అని అనేశారు. సాధారణంగా ఎప్పుడూ అంత బాధపడను. కానీ అప్పుడు గదిలోకి వెళ్లి గంటల తరబడి ఏడ్చాను. కొంతకాలం అలా చీకటి గదిలో ఒంటరిగా ఉంటూ బాధపడ్డాను” అని తెలిపారు.
Sorry, no posts matched your criteria.