News August 12, 2025

రికార్డులు కొల్లగొట్టిన డెవాల్డ్ బ్రెవిస్

image

AUSతో 2వ T20లో సౌతాఫ్రికా బ్యాటర్ బ్రెవిస్(125*) విధ్వంసం సృష్టించారు. దీంతో SA తరఫున అత్యధిక T20 వ్యక్తిగత స్కోర్(గతంలో డుప్లెసిస్ 119 రన్స్) కొట్టారు. AUSపై ఫాస్టెస్ట్ సెంచరీ 41బంతుల్లో(గతంలో కోహ్లీ 52బాల్స్), SA తరఫున సెంచరీ కొట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కారు(గతంలో రిచర్డ్ లెవి 24Y). కాగా బ్రెవిస్ IPLలో CSKకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

News August 12, 2025

కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రి 10 గంటల లోపు వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. కొత్తగూడెం, జగిత్యాల, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు వాన పడొచ్చని పేర్కొంది. మరి మీ ఏరియాలో వర్షం మొదలైందా? కామెంట్ చేయండి.

News August 12, 2025

కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నాదెండ్ల బ్రహ్మం

image

AP: రాష్ట్రంలో 31 నామినేటెడ్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్-నాదెండ్ల బ్రహ్మం, SC కార్పొరేషన్ ఛైర్మన్-ఆకేపోగు ప్రభాకర్, బ్రాహ్మణ-బుచ్చి రామ్ ప్రసాద్, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్-దాసరి శ్రీనివాసులు, విశ్వబ్రాహ్మణ-కమ్మరి పార్వతి, దూదేకుల-నాగుల్ మీరా కాసునూరి, వైశ్య-రమేశ్ మొదలవలస, జంగం-వి.చంద్రశేఖర్, వడ్డెర-గుంటసల వెంకటలక్ష్మి, OUDA ఛైర్మన్‌గా షేక్ రియాజ్‌ను నియమించింది.

News August 12, 2025

WOW.. మూడు రోజుల్లో 343L పాలిచ్చిన ఆవు

image

బ్రెజిల్‌కు చెందిన హోల్‌స్టెయిన్-ఫ్రైసియన్ జాతి ఆవు ప్రపంచ రికార్డును నెలకొల్పింది. సాధారణ ఆవులు రోజుకు 10 లీటర్ల పాలు ఇస్తుంటే ఇది మాత్రం సగటున రోజుకు 114 లీటర్ల చొప్పున 3 రోజుల్లో 343L పాలు ఉత్పత్తి చేసింది. జెనెటిక్స్, సరైన పోషణ, సంరక్షణ, మోడ్రన్ డెయిరీ టెక్నాలజీ వల్ల ఇది సాధ్యమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముర్రా & నీలి-రవి గేదెలు కూడా ఈ జాతిలానే ఎక్కువ పాలు ఇవ్వగలవు.

News August 12, 2025

స్కూళ్లకు సెలవులపై సీఎం కీలక ఆదేశాలు

image

TG: అల్పపీడనంతో రాబోయే 3 రోజులు రాష్ట్రంలో అతిభారీ వర్షాలు కురుస్తాయని IMD ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితిని బట్టి స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని సూచించారు. ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు <<17383239>>రద్దు<<>> చేయాలని CM ఇప్పటికే ఆదేశించారు.

News August 12, 2025

PIC OF THE DAY.. వందే ‘భారత్’

image

అచ్చం ఇండియా మ్యాప్‌లా కనిపిస్తోంది కదూ! ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లు నడుస్తున్న మార్గం ఇది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక్కో ట్రాక్‌తో దేశాన్ని ఇది కలుపుతోందని నీతి ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్ ఈ ఫొటోను ట్వీట్ చేశారు. వందే భారత్ రైలు దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొస్తోందని ఆయన Xలో రాసుకొచ్చారు. కాగా ప్రస్తుతం దేశంలో 150కి పైగా వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి.

News August 12, 2025

ఈ పనులు చేస్తున్నారా?.. వెంటనే ఆపేయండి

image

రోజూ చేసే కొన్ని పనులు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయనే విషయం మీకు తెలుసా? ‘భోజనం తింటూ నీరు తాగితే జీర్ణక్రియ మందగిస్తుంది. దిండు కింద ఫోన్ పెట్టుకుంటే నిద్రకు అంతరాయం కలుగుతుంది. ఎక్కువసేపు కూర్చుంటే రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. చాలా వేడిగా ఉన్న ఆహారం తింటే అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చెవిలో కాటన్ స్వాబ్స్ పెడితే వినికిడి శక్తి కోల్పోయే అవకాశం ఉంది’ అని హెచ్చరిస్తున్నారు.

News August 12, 2025

ఆధార్, పాన్, ఓటర్ కార్డులు పౌరసత్వంగా గుర్తించలేం: సంచలన తీర్పు

image

ఆధార్, పాన్, ఓటర్ కార్డులను పౌరసత్వంగా గుర్తించలేమని బాంబే హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. కొన్ని సేవలు పొందేందుకు ఇవి గుర్తింపు కార్డులు మాత్రమేనని, దేశ పౌరసత్వానికి ఖచ్చితమైన రుజువు కాదని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన బాబు అబ్దుల్ రౌఫ్ సర్దార్ అనే వ్యక్తి తాను భారతీయుడినని ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు ప్రూఫ్‌గా చూపించగా, అవి ఆధారాలు కావని అతడికి కోర్టు బెయిల్ నిరాకరించింది.

News August 12, 2025

ఫ్రీ బస్ స్కీమ్‌పై BIG UPDATE

image

AP: రాష్ట్రంలో ఈ నెల 15న స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని ఆ రోజు విజయవాడలోని నెహ్రూ బస్ స్టేషన్‌లో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలు కానుంది. కాగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బస్సుల్లో మహిళలకు కేటాయించిన సీట్లకు పసుపు రంగు వేశారు. టిమ్స్‌లో సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేశారు. కండక్టర్లకు శిక్షణ ఇచ్చారు.

News August 12, 2025

బీఆర్ఎస్ బీసీ సభ వాయిదా

image

TG: ఈనెల 14న కరీంనగర్‌లో BRS నిర్వహించతలపెట్టిన బీసీ సభ వాయిదా పడింది. అల్పపీడనం కారణంగా 14 నుంచి 17 వరకు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాజీ మంత్రి గుంగుల కమలాకర్ తెలిపారు. సభ తదుపరి నిర్వహణ తేదీని త్వరలో ఖరారు చేస్తామని వెల్లడించారు. కాగా ఈ సభకు మాజీ సీఎం కేసీఆర్ హాజరుకావాల్సి ఉంది.