News March 16, 2024

2024 ఎన్నికల సంవత్సరం: రాజీవ్ కుమార్

image

ఈసారి ప్రపంచం మొత్తం ఎన్నికల వైపే చూస్తోందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. 2024లో ఇండియాతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. అందుకే ఈ ఏడాదిని ఎన్నికల సంవత్సరంగా చెప్పుకోవచ్చని అభిప్రాయపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

News March 16, 2024

దేశంలో సంవత్సరాల వారీగా ఓటర్ల వివరాలు

image

● 1999: 62 కోట్ల మంది
● 2004: 67cr
● 2009: 72cr
● 2014: 83cr
● 2019: 91cr
● 2024: 96.8cr

News March 16, 2024

దేశంలో ఓటర్లు ఇలా..

image

✒ మొత్తం ఓటర్లు రూ.96.88 కోట్లు
✒ పురుషులు 49.7 కోట్లు, మహిళలు 47.1 కోట్లు
✒ యువ ఓటర్లు(20-29 ఏళ్లు) 19.74 కోట్లు
✒ తొలిసారి ఓటర్లు(18-19 ఏళ్లు) 1.8 కోట్లు
✒ దివ్యాంగ ఓటర్లు 88.4 లక్షలు
✒ 85 ఏళ్ల పైన వయసున్న ఓటర్లు 82 లక్షలు
✒ 100 ఏళ్ల పైన వయసున్న ఓటర్లు 2.18 లక్షలు
✒ సర్వీస్ ఓటర్లు 19.1 లక్షలు
✒ ట్రాన్స్‌జెండర్లు 48,000

News March 16, 2024

దేశవ్యాప్తంగా ఇంటి నుంచి ఓటింగ్ అమలు

image

ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటేసే సౌకర్యం అమలుకానుంది. గతంలో పలు అసెంబ్లీ ఎన్నికల్లో పరీక్షించిన ఈ సౌకర్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేస్తామని CEC రాజీవ్ కుమార్ ప్రకటించారు. 85 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గలవారు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం గలవారికి ఈ అవకాశం ఇస్తామన్నారు. ఇందుకోసం ముందే రిజిస్టర్ చేసుకుంటే పోలింగ్ సిబ్బంది స్వయంగా ఇంటికి వచ్చి ఓటు నమోదు చేసుకుంటారని వెల్లడించారు.

News March 16, 2024

దాతృత్వానికి దక్కిన గౌరవం!

image

టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా ప్రతిష్ఠాత్మక పీవీ నరసింహారావు స్మారక అవార్డు అందుకున్నారు. ముంబైలో జరిగిన వేడుకలో ప్రతినిధులు ఆయనకు అవార్డును అందించారు. దాతృత్వంలో ఆయన చేసిన విశేషమైన కృషికి ఈ అవార్డు దక్కింది. తన ఆదాయంలో సగానికి పైగా విరాళం ఇచ్చిన ఆయన.. ట్రస్టు ద్వారా ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణాభివృద్ధి రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

News March 16, 2024

ధోనీ, కోహ్లీ ఫాలోయింగ్‌పై బట్లర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

image

కెప్టెన్ కూల్ MS ధోనీ, కింగ్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌పై ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘ఐపీఎల్‌లో ధోనీ, కోహ్లీ మైదానంలో నడిస్తే చాలు ఫ్యాన్స్ అంతా టైలర్ స్విఫ్ట్ కన్సర్ట్‌లో పదేళ్ల పిల్లల్లా మారిపోతారు. వారి ఫ్యాన్ ఫాలోయింగ్ నమ్మశక్యం కానిది. వారు కేవలం మైదానంలోకి వస్తే చాలు ఫ్యాన్స్ అరుపులతో స్టేడియం దద్దరిల్లేలా చేస్తారు’ అని చెప్పుకొచ్చారు.

News March 16, 2024

దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు: రాజీవ్ కుమార్

image

దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లున్నారని CEC రాజీవ్ కుమార్ తెలిపారు. ఇది అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని జనాభాను కలిపినా ఎక్కువన్నారు. ఇక దేశంలో ఎన్నికల కోసం 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 1.50 కోట్ల మంది పోలింగ్ సిబ్బంది, సెక్యూరిటీ ఆఫీసర్లు విధుల్లో పాల్గొంటారన్నారు. ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎంలు సిద్ధం చేసినట్లు చెప్పారు. జూన్ 16లోపు ఈ పక్రియ పూర్తి చేస్తామన్నారు.

News March 16, 2024

నాలుగోసారి మామాఅల్లుళ్ల పోటీ

image

AP: శ్రీకాకుళం(D) ఆమదాలవలసలో మరోసారి మామాఅల్లుళ్ల పోటీ జరగనుంది. కూన రవికుమార్‌(TDP)కి స్పీకర్ తమ్మినేని సీతారాం(YCP) స్వయాన మేనమామ. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ మాటల యుద్ధంతో స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా నిలుస్తుంటారు. ఇప్పటికే 3సార్లు వీరు ఎన్నికల్లో తలపడగా మరోసారి పోటీకి సై అంటున్నారు. 2014లో TDP తరఫున రవి, 2019లో సీతారాం YCP నుంచి గెలిచారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు.

News March 16, 2024

చంద్రబాబుతో మాజీ మంత్రి గంటా భేటీ

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబుతో మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. ఆయనకు ఇంకా టికెట్ ఖరారు కాని నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తనకు విశాఖ జిల్లాలోనే టికెట్ కేటాయించాలని గంటా కోరినట్లు తెలుస్తోంది. అయితే ఆయనను చీపురుపల్లిలో పోటీ చేయాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం.

News March 16, 2024

పోటీలో తండ్రీకొడుకులు

image

వైసీపీ అభ్యర్థుల్లో రెండు కుటుంబాల తండ్రీకొడుకులకు టికెట్లు దక్కాయి. పుంగనూరు ఎమ్మెల్యేగా కీలక నేతగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి పోటీ చేయనున్నారు. ఇక ఇదే తరహాలో ఈయన కొడుకు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా తిరిగి బరిలో నిలుస్తారని పార్టీ ప్రకటించింది. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు MP స్థానం, ఆయన కొడుకు మోహిత్- చంద్రగిరి MLA టికెట్లు పొందారు.