News March 18, 2024

అటవీశాఖలో ఖాళీగా 2,108 పోస్టులు!

image

TG: రాష్ట్ర అటవీశాఖలో 2,108 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మొత్తం 6,860 పోస్టులకు 4,752 మంది సిబ్బందే ఉన్నట్లు తెలిపారు. ఉన్నవారిలో కొందరు ఇతర శాఖలకు డిప్యుటేషన్‌పై వెళ్లాల్సిన పరిస్థితి ఉందని CM రేవంత్‌కు వివరించారు. ఖాళీ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపించాలని, అటవీశాఖ నుంచి డిప్యుటేషన్‌పై ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారి వివరాలు ఇవ్వాలని అధికారులను CM ఆదేశించారు.

News March 18, 2024

TVల్లోకి వచ్చేస్తోన్న ‘గుంటూరు కారం’

image

సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘గుంటూరు కారం’ మూవీ టీవీల్లోకి వచ్చేస్తోంది. వచ్చే నెల 9న జెమిని టీవీలో ఈ సినిమా ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను జెమిని టీవీలో రిలీజ్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ, జగపతిబాబు, జయరామ్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.

News March 18, 2024

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు పొందని పార్టీలివే!

image

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా దేశంలోని అనేక పార్టీలు రూ.వేల కోట్ల విరాళాన్ని పొందగా, కొన్ని ప్రముఖ పార్టీలకు ఒక్క రూపాయీ అందలేదు. CPM, CPI, మాయావతి నేతృత్వంలోని BSP, మేఘాలయలోని అధికార నేషనల్ పీపుల్ పార్టీ, AIMIM, మహరాష్ట్ర నవ నిర్మాణ సేనకు బాండ్ల ద్వారా విరాళాలు రాలేదు. జొరమ్ పీపుల్స్ మూమెంట్ పార్టీ(మిజోరం), అసోమ్ గణ పరిషద్(అస్సాం), CPI-ML, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఈ లిస్టులో ఉన్నాయి.

News March 18, 2024

విశాఖ జనసేనలో విభేదాలు

image

AP: విశాఖ జిల్లా జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. విశాఖ సౌత్ సీటు స్థానికులకే కేటాయించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ జెండా మోయని, ఇటీవల పార్టీలోకి వచ్చిన వంశీకి సీటు ఇస్తే ఊరుకోమంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో టికెట్ కేటాయింపుపై జనసేనాని ఎలా ముందుకెళ్తారనేది ఆసక్తిగా మారింది.

News March 18, 2024

గెలుపు ‘లెఫ్ట్’దే అని నిరూపించారు!

image

టోర్నీ ఏదైనా ట్రోఫీకి ఎడమ(లెఫ్ట్) వైపు నిల్చున్న వారిదే విజయం అని RCB ఉమెన్స్ జట్టు కెప్టెన్ స్మృతి మంధాన మరోసారి నిరూపించారు. ఫైనల్స్‌కు ముందు ట్రోఫీకి కుడివైపు DC కెప్టెన్, ఎడమ వైపు RCB కెప్టెన్ మంధాన నిల్చున్నారు. గత WPLలోనూ MI కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఎడమ వైపే నిల్చుని గెలిచారు. దీంతోపాటు T20 WCలో ఇంగ్లండ్, WTCలో ఆస్ట్రేలియా, వరల్డ్ కప్-2023లో ఆస్ట్రేలియా కెప్టెన్లు లెఫ్ట్ సైడే నిల్చున్నారు.

News March 18, 2024

నేడు ముంబై క్యాంపులోకి రోహిత్ శర్మ

image

టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇవాళ ముంబై ఇండియన్స్ ట్రైనింగ్ క్యాంపులో చేరనున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. గత కొన్ని నెలలుగా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచులతో బిజీగా ఉన్న హిట్‌మ్యాన్.. క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. మరో 4 రోజుల్లో ఐపీఎల్-2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు జట్టుతో చేరనున్నారు. ఈ సారి ముంబై కెప్టెన్‌గా హార్దిక్ వ్యవహరించనుండగా, రోహిత్ బ్యాటర్‌గా ఆడనున్నారు.

News March 18, 2024

రెండు పార్టీలను చీల్చి అధికారంలోకి తిరిగివచ్చా: ఫడ్నవీస్

image

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “2019లో బీజేపీ ఓటమి తర్వాత ‘నేను మళ్లీ తిరిగొస్తా’ అని అప్పుడు చేసిన ప్రచారాన్ని ఎద్దేవా చేశారు. కానీ తర్వాత రెండు పార్టీలను చీల్చి అధికారంలోకి వచ్చాను. ఇద్దరు స్నేహితులనూ వెంట తెచ్చుకున్నా. పవర్‌లోకి రావడానికి రెండున్నరేళ్లు పట్టింది” అని తెలిపారు. కాగా ఏక్‌నాథ్ షిండే వల్ల శివసేన, అజిత్ పవార్‌తో NCP చీలిపోయిన సంగతి తెలిసిందే.

News March 18, 2024

గవర్నర్ తమిళిసై రాజీనామా

image

TS గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి MPగా పోటీ చేస్తారని సమాచారం. చెన్నై సౌత్, తిరునల్వేలి, కన్యాకుమారిలో ఒక చోట నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తిరునల్వేలి, కన్యాకుమారిలో ఆమె సామాజికవర్గ నాడార్ ఓట్లు అధికం. తెలంగాణ గవర్నర్‌గా ఆమె 2019, సెప్టెంబర్ 8న భాద్యతలు చేపట్టారు. KCR ప్రభుత్వ పలు నిర్ణయాలు అడ్డుకుని సంచలనంగా మారారు.

News March 18, 2024

ఎన్నికల ఎఫెక్ట్.. ఆ పరీక్షల తేదీల్లో మార్పులు?

image

TG: మే 13న లోక్ సభ ఎన్నికల పోలింగ్, జూన్ 4న ఎన్నికల ఫలితాల ప్రకటన ఉండడంతో పలు ప్రవేశ పరీక్షల తేదీలు మారే అవకాశం కనిపిస్తోంది. పరీక్షల రీషెడ్యూల్‌పై రేపు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే విడుదలైన షెడ్యూల్ ప్రకారం మే 9 నుంచి 12 వరకు EAPCET, జూన్ 4, 5 తేదీల్లో ఐసెట్, జూన్ 3న లాసెట్ నిర్వహించనున్నారు.

News March 18, 2024

ఎలక్టోరల్ బాండ్ నంబర్లు కూడా చెప్పాల్సిందే: సుప్రీంకోర్టు

image

ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించడంలో గోప్యత తగదని CJI జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్‌బీఐకి స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల నంబర్లతో సహా SBI పరిధిలో ఉన్న అన్ని వివరాలు బహిర్గతం చేయాలని ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్స్ కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా వివరాలను వెల్లడించడానికి వెనుకాడమని తమ వద్ద అన్ని వివరాలు బయటపెడతామని SBI తరఫు లాయర్ సాల్వే పేర్కొన్నారు.