News August 12, 2025

ప్రియాంక కామెంట్స్‌కు ఇజ్రాయెల్ అంబాసిడర్ కౌంటర్

image

పాలస్తీనాలో ఇజ్రాయెల్ నరమేధం సృష్టిస్తోందని కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీ ఆరోపించారు. 18,430 మంది పిల్లలు సహా 60వేల మందిని దారుణంగా హతమార్చిందన్నారు. ఇంత జరుగుతున్నా భారత ప్రభుత్వం మౌనంగా ఉండటం సిగ్గుచేటన్నారు. దీంతో హమాస్‌కు వత్తాసు పలకడం మానుకోవాలని ప్రియాంకకు ఇజ్రాయెల్ అంబాసిడర్ అజార్ సూచించారు. పౌరుల మాటున దాక్కున్న ఉగ్రవాదులే తమ లక్ష్యమన్నారు. 25వేల టెర్రరిస్టులను చంపినట్లు చెప్పారు.

News August 12, 2025

ఒంటిమిట్టలో నిలిచిన పోలింగ్

image

AP: కడప జిల్లా ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రం లోపల ఉన్నారంటూ వైసీపీ శ్రేణులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాయి. దీంతో గందరగోళం నెలకొనగా, నాలుగు పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ఓటింగ్‌ను నిలిపివేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఒంటిమిట్టలో 60.91శాతం పోలింగ్ నమోదైంది. సా.5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది.

News August 12, 2025

ఆశా వర్కర్లకు శుభవార్త.. ప్రభుత్వం ఉత్తర్వులు

image

AP: ఆశా వర్కర్లకు మొదటి రెండు ప్రసవాలకు 180 రోజుల చొప్పున ప్రసూతి సెలవులు(జీతంతో) ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కార్యకర్తల పదవీ విరమణ వయసును 62ఏళ్లకు(గతంలో 60ఏళ్లు) పెంచింది. 30ఏళ్లు పనిచేసిన వారికి గ్రాట్యుటీ కింద గరిష్ఠంగా రూ.1,50,000 వరకు చెల్లించనుంది. గత మార్చిలోనే దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

News August 12, 2025

‘కాంగ్రెస్ తల్లి’ విగ్రహాలను గాంధీభవన్‌కు పంపిస్తాం: కవిత

image

TG: రాష్ట్ర అస్తిత్వ చిహ్నమైన బతుకమ్మను వేరు చేసి రూపొందించిన ‘కాంగ్రెస్ తల్లి’ విగ్రహాలను అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని BRS నేత కవిత ఖండించారు. ‘తెలంగాణ తల్లి విగ్రహ స్థానంలో కాంగ్రెస్ తల్లిని ప్రజలపై రుద్దే కుట్రకు ఈ అరాచక ప్రభుత్వం తెరలేపింది. అవి ఎక్కువ రోజులు నిలబడవు. BRS అధికారంలోకి రాగానే మీ విగ్రహాలను సకల మర్యాదలతో గాంధీ భవన్‌కు పంపిస్తాం’ అని ట్వీట్ చేశారు.

News August 12, 2025

రిలీజ్‌కు ముందే రికార్డులు తిరగరాస్తున్న ‘కూలీ’

image

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న ‘కూలీ’ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఉత్తర అమెరికా ప్రీ-సేల్స్‌లో ఈ చిత్రం 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి తమిళ చిత్రంగా ‘కూలీ’ రికార్డులకెక్కింది. మన దగ్గర ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు. అయితే, తమిళనాడుతో పోల్చితే హైదరాబాద్‌లో అధిక ధరలు ఉన్నట్లు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.

News August 12, 2025

రేపు చర్చలకు ఫిల్మ్ ఫెడరేషన్‌కు ఛాంబర్ లేఖ

image

వేతనాల పెంపు, ఇతర సమస్యలపై చర్చించేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులకు తెలుగు ఫిల్మ్ <<17371616>>ఛాంబర్<<>> లేఖ రాసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు చర్చలకు రావాలని కోరింది. సమావేశానికి ఎంతమంది వస్తారో తెలియజేయాలని పేర్కొంది. నూతన వేతనాలు, పని పరిస్థితులపై చర్చించనుంది.

News August 12, 2025

తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి

image

తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి అని టీటీడీ స్పష్టం చేసింది. ఈ నిబంధన ఈనెల 15 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించబోమని స్పష్టం చేసింది.

News August 12, 2025

INDvsENG: చరిత్ర సృష్టించిన సిరీస్

image

ENG, IND మధ్య జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ రికార్డులు తిరగరాసింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌‌లో అత్యధిక మంది వీక్షించిన టెస్ట్ సిరీస్‌గా నిలిచింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌ను జియో హాట్‌స్టార్‌లో 17 కోట్ల మంది తిలకించారు. ఐదో టెస్టు చివరి రోజున ఏకకాలంలో రికార్డు స్థాయిలో 1.3 కోట్ల మంది వీక్షించారు. సిరీస్ మొత్తం 65 బిలియన్ మినట్స్ వాచ్ టైమ్‌ను నమోదు చేసింది. కాగా ఈ సిరీస్ 2-2తో సమమైన విషయం తెలిసిందే.

News August 12, 2025

ఆదాయ పరిమితిని బట్టి రిజర్వేషన్లు.. మీ కామెంట్

image

SC, ST, BC రిజర్వేషన్లలో అంతర్గత ఆదాయ పరిమితి విధించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు స్వీకరించడం చర్చనీయాంశంగా మారింది. ఆయా కులాల్లో డబ్బున్నోళ్లకు రిజర్వేషన్లు ఎందుకన్నదే పిటిషన్ ప్రధానోద్దేశం. BCల్లో క్రీమిలేయర్ ఇలాంటిదే. అయితే SC, STల్లోనూ సంపన్నులకు కాకుండా పేదలకే ఈ ఫలాలు దక్కాలన్నది పిటిషనర్ల వాదన. దీనిపై మీరేమంటారు? కొన్నేళ్లయ్యాక రిజర్వేషన్లు వద్దన్న అంబేడ్కర్ ఆశయాన్ని ఈ వాదన నెరవేర్చేనా?

News August 12, 2025

రష్యా చమురు కొనబోమని భారత్ చెప్పిందా!

image

రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు నిలిపేస్తే పరిస్థితేంటని అంతటా చర్చిస్తున్నారు. అయితే భారత వైఖరేంటో పట్టించుకోవడమే లేదు. జియో పాలిటిక్స్, స్వప్రయోజనాలు, తక్కువ ధరను బట్టి నచ్చిన మార్కెట్లో కొంటామందే తప్ప రష్యా నుంచి ఆపేస్తామని ఎక్కడా చెప్పలేదు. పైగా అక్కడి నుంచి కొనొద్దని రిఫైనరీలకు ఆదేశాలూ ఇవ్వలేదు. కొన్నాళ్ల కిందట రష్యా వద్ద ధరెక్కువని ఇరాక్, సౌదీ నుంచి దిగుమతులు పెంచుకోవడమే ఇందుకు ఉదాహరణ.