News June 23, 2024

తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని ఇంకెంత మభ్యపెడతారు చంద్రబాబూ?:YCP

image

AP: పార్టీ ఆఫీసుల నిర్మాణంపై TDP విమర్శలకు వైసీపీ Xలో కౌంటరిచ్చింది. ‘పార్టీ కార్యాలయాలకు స్థలాల GO ఇచ్చింది మీరు కాదా? దాని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా TDP ఆఫీసులు నిర్మించుకుంది నిజం కాదా? HYDలో పాతికేళ్ల క్రితం NTR భవన్‌కు ఇలానే స్థలం కేటాయించుకున్న విషయం మీ చంద్రబాబు మర్చిపోయారా? మీరు చేస్తే రాజకీయం.. మేము చేస్తే కబ్జానా? మీ తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని ఇంకెంత మభ్యపెడతారు?’ అని ఫైరయ్యింది.

News June 23, 2024

ఎల్లుండి ‘భారతీయుడు-2’ ట్రైలర్ విడుదల

image

కమల్ హాసన్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు-2’ ట్రైలర్ ఈనెల 25న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్, కాజల్, SJ సూర్య, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జులై 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

News June 23, 2024

డయేరియాపై అధికారులతో మంత్రి సమీక్ష

image

AP: NTR(D) జగ్గయ్యపేటలో డయేరియా కలకలం రేపుతోంది. ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందగా, 35 మందికి పైగా బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బాధితులను పరామర్శించారు. ‘మొత్తం 58 కేసులు నమోదయ్యాయి. నీటి సమస్య కారణంగా ఇలా జరిగినట్లు అనుమానిస్తున్నాం. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి’ అని ఆయన సూచించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు.

News June 23, 2024

HYDలో వచ్చే నెలలో అన్న క్యాంటీన్ ప్రారంభం

image

ఏపీ సీఎం చంద్రబాబు మానసపుత్రిక అన్న క్యాంటీన్‌ను హైదరాబాద్‌లో CBN ఫోరం వ్యవస్థాపకులు అందుబాటులోకి తీసుకురానున్నారు. మాదాపూర్ 100 ఫీట్ రోడ్డులో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. జులై మొదటి వారంలో ఇక్కడ పేదలకు ఉచితంగా భోజనం అందించనున్నారు. ఏపీతో పాటు తెలంగాణలోనూ చంద్రబాబు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ ఫోరం ద్వారా కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

News June 23, 2024

26 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు

image

AP: ఈ నెల 26 నుంచి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కారణంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, అనకాపల్లి, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

News June 23, 2024

షర్మిలపై ఆరోపణలు.. ఇద్దరు నేతలకు పీసీసీ నోటీసులు

image

AP: కాంగ్రెస్ నేతలు సుంకర పద్మశ్రీ, రాకేశ్ రెడ్డికి ఆ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై ఆరోపణలు చేసినందుకు వివరణ ఇవ్వాలని పీసీసీ క్రమశిక్షణ సంఘం నోటీసులు పంపింది. కాగా ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరగలేదని, షర్మిల అనుచరులు, డబ్బులిచ్చిన వారికే సీట్లిచ్చారని వీరు ఆరోపించారు. షర్మిల ఒంటెద్దు పోకడలతో పార్టీ నష్టపోయిందని అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు.

News June 23, 2024

ఓవర్ చేయకురోయ్.. నీ దిష్టే తగిలేలా ఉంది: రవితేజ

image

‘ప్రపంచంలో అందరికీ వయసొస్తోంది.. అన్నయ్యకి తప్ప’ అంటూ టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ట్విటర్‌లో రవితేజ ఫొటోను పోస్ట్ చేశారు. దీనికి ‘ఓవర్ చేయకురోయ్.. నీ దిష్టే తగిలేలా ఉంది’ అని మాస్ మహరాజా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘మిస్టర్ బచ్చన్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘కశ్మీర్ లోయలో అద్భుతంగా షూటింగ్ చేశాం. త్వరలో HYDలో ల్యాండ్ అవుతాం’ అని హరీశ్ శంకర్ తెలిపారు.

News June 23, 2024

క్లీన్‌ స్వీప్‌పై టీమ్‌ఇండియా కన్ను!

image

సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్‌ జట్టు అదరగొడుతోంది. సౌతాఫ్రికాతో 3 వన్డేల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి 2మ్యాచ్‌ల్లో నెగ్గి సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. నేడు జరిగే మూడో వన్డేలోనూ గెలిచి క్లీన్‌స్వీప్‌ చేయాలని భావిస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో మ.1.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది. గత రెండు మ్యాచుల్లానే నేడూ బ్యాటర్ల హవా కొనసాగే ఛాన్సుంది. హర్మన్‌, స్మృతి సూపర్‌‌ఫామ్‌‌లో ఉండటం INDకు కలిసి రానుంది.

News June 23, 2024

జగన్ ఏంటి ప్యాలెస్‌ల పిచ్చి: నారా లోకేశ్

image

AP: YCP పార్టీ ఆఫీసుల నిర్మాణాలపై మంత్రి లోకేశ్ ఫైర్ అయ్యారు. ‘జగన్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా? YCP కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా రూ.1000 నామమాత్రపు లీజుకి 33ఏళ్లకు కేటాయించుకున్నావు. రూ.600 కోట్ల విలువైన ఈ భూముల్లో 4,200 మందికి స్థలాలివ్వొచ్చు. నిర్మాణాలకు ఖర్చయ్యే రూ.500 కోట్లతో 25వేల మందికి ఇళ్లు కట్టొచ్చు. ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి? నీ ధనదాహానికి అంతులేదా?’ అని Xలో దుయ్యబట్టారు.

News June 23, 2024

నీట్ పేపర్ లీకేజీ.. నిందితులకు నార్కో అనాలసిస్ టెస్ట్‌లు

image

నీట్ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తుని బిహార్ పోలీసులు ముమ్మరం చేశారు. నిందితులకు నార్కో అనాలసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టులు నిర్వహించనున్నారు. ఈ అక్రమాల్లో మనీ లాండరింగ్ కోణం కూడా ఉండటంతో ఈడీ సైతం రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే ఈ కేసులో 14 మందిని అరెస్ట్ చేశారు. ఈ లీకేజ్ వెనుక సంజీవ్ ముఖియా అనే వ్యక్తి ప్రధాన కుట్రదారుగా తెలుస్తోంది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.