India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీమ్ ఇండియా క్రికెటర్ మనీశ్ పాండే-అశ్రిత శెట్టి జంట విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పెళ్లి ఫొటోలు తొలగించడమే ఇందుకు కారణం. ఉత్తరాఖండ్‌కు చెందిన మనీశ్.. మోడల్ అశ్రితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా మనీశ్ పాండే భారత్ తరఫున 29 వన్డేల్లో 566 పరుగులు, 39 టీ20ల్లో 709 రన్స్ చేశారు. అలాగే ఐపీఎల్‌లో దాదాపు అన్ని జట్లకు ఆయన ప్రాతినిథ్యం వహించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యూరప్ పర్యటనకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఎప్పుడు బ్రేక్ తీసుకోవాలన్నా ఇటలీ వెళ్తారు. అక్కడ తనకు ఉన్న లగ్జరీ విల్లాలో ఆయన ఎంజాయ్ చేస్తారు. షూటింగ్‌లతో బిజీగా ఉంటే పర్యాటకులకు ఆ విల్లాను అద్దెకిస్తారు. అద్దె ద్వారా ఆయన నెలకు రూ.40 లక్షలు సంపాదిస్తున్నట్లు టాక్. కాగా ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ఈ నెల 27న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
AP: మూడు, నాలుగు రోజుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం రానున్నారని జనసేన నేత నాగబాబు తెలిపారు. ‘పిఠాపురం ప్రజలు అద్భుతమైన వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ప్రజల ఆకాంక్షలను పవన్ 100 శాతం నెరవేరుస్తారు. తీర ప్రాంత కాలుష్య సమస్యలు తీరుస్తారు. ప్రజలకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాం. త్వరలో ఇక్కడి ప్రజల కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నాం’ అని ఆయన తెలిపారు.
NEET UG-2024 పేపర్ కొన్ని సెంటర్లలో మాత్రమే లీక్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పేపర్ లీక్ వల్ల కొందరు లాభపడినప్పటికీ పరీక్షను రద్దు చేస్తే కష్టపడి చదివి రాసిన లక్షలాది మంది నష్టపోతారని పేర్కొన్నారు. 2004, 2015లో లీకేజీ వ్యవహారం భారీ ఎత్తున జరగడంతో పరీక్షను రద్దు చేసినట్లు గుర్తుచేశారు.
ఐసీసీ టోర్నమెంట్లలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన విజయాల పరంపర కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 24 మ్యాచులకు సారథ్యం వహించారు. అందులో 19 గెలుపు, 4 ఓటములు, ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. విన్నింగ్ పర్సంటేజీ ఏకంగా 86.36 శాతంగా ఉంది. ప్రపంచ క్రికెట్‌లో మరే కెప్టెన్‌కు ఇంత విన్నింగ్ పర్సంటేజీ లేదు. కాగా టీమ్ ఇండియా కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ అసాధారణ విజయాలు అందిస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
1935: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు జననం
1951: మ్యూజిక్ డైరెక్టర్ హంసలేఖ జననం
1953: సుప్రీం కోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ జననం
1953: జనసంఘ్ పార్టీ స్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణం
1980: వెస్టిండీస్ మాజీ క్రికెటర్ రాంనరేష్ శర్వాన్ జననం
1985: చర్మ సాంకేతిక శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ మరణం
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: జూన్ 23, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 4:21 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:43 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:18 గంటలకు
అసర్: సాయంత్రం 4:55 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:53 గంటలకు
ఇష: రాత్రి 8.15 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు జరుగుతుండటంతో కేంద్రం ప్రభుత్వం దిగివచ్చింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనికి బాధ్యులను గుర్తించి శిక్షిస్తామని పేర్కొంది. కాగా మే 5న నీట్ పరీక్ష జరగ్గా మే 4నే ప్రశ్నాపత్రం లీకైంది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.
Sorry, no posts matched your criteria.