News June 22, 2024

గంభీర్ గొప్ప ఫైటర్: అశ్విన్

image

కెరీర్ ఆరంభంలో తనలో ఆత్మవిశ్వాసం పెంచడంలో గంభీర్ కీలక పాత్ర పోషించారని స్పిన్నర్ అశ్విన్ తెలిపారు. ఆటపై అతనికి ఉన్న అవగాహన అత్యుత్తమమైనదని కొనియాడారు. ‘గౌతమ్ గొప్ప ఫైటర్. జట్టు విజయం కోసం ఎల్లప్పుడూ కష్టపడే వ్యక్తి. కానీ అతని ప్రవర్తనను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. అతనిపై నాకు అపారమైన గౌరవం ఉంది’ అని చెప్పారు. కాగా భారత జట్టు కోచ్‌గా గంభీర్ ఎంపిక దాదాపు ఖాయమైనట్లు సమాచారం.

News June 22, 2024

KCRను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే నా లక్ష్యం: ఎర్రబెల్లి

image

TG: తాను పార్టీ మారడం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో BRS ఓడినందుకు బాధగా ఉందని, KCRను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యమని చెప్పారు. తాను నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ పరిస్థితిపై రివ్యూ చేస్తున్నా.. కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

News June 22, 2024

గ్రేట్.. కూలీల పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడు!

image

విద్య మాత్రమే వారి కుటుంబ ఆర్థిక స్థితిని మార్చుతుందని నమ్మిన ఢిల్లీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ థాన్ సింగ్ కూలీల పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. పిల్లలు కూలీ పనులకు వెళ్లడం చూసి చలించిపోయి వారి తల్లిదండ్రులను ఒప్పించి తాను ఏర్పాటు చేసిన స్కూల్‌లో చదువుకునేలా చేశారు. దాదాపు 9 ఏళ్లుగా ఆయన ఈ స్కూల్‌ను నడుపుతుండగా 5 మందితో మొదలై 105 మందికి చేరింది. వారికి ఆహారం కూడా అందిస్తున్నారు.

News June 22, 2024

NEETపై కొన్ని రాజకీయ పార్టీలు మౌనంగా ఉన్నాయి: VSR

image

NEET యూజీ పరీక్షలో జరిగిన అవకతవకలపై కొన్ని రాజకీయ పార్టీలు మౌనంగా ఉన్నాయని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి మండిపడ్డారు. నీట్ యూజీ పరీక్షకు ఏపీ నుంచి హాజరైన 60వేల మందితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 23 లక్షల మంది విద్యార్థుల కోసం ఆ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ఇది చూస్తుంటే వారికి ప్రజలు, విద్యార్థుల జీవితాల కంటే రాజకీయాలే ముఖ్యమని తెలుస్తోందని ఎద్దేవా చేశారు.

News June 22, 2024

చిన్నారికి జీవితకాల ఉచిత బస్ పాస్‌ను అందించిన RTC అధికారులు

image

కరీంనగర్ బస్ స్టేషన్‌లో ఇటీవల పుట్టిన చిన్నారికి ప్రకటించిన జీవితకాల ఉచిత బస్ పాస్‌ను కరీంనగర్ TGSRTC అధికారులు అందించారు. స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో చిన్నారి కుటుంబాన్ని అధికారులు కలిసినట్లు సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఆడపిల్లకు బస్‌ పాస్‌‌తో పాటు కుటుంబసభ్యులకు రూ.14 వేల ఆర్థికసాయం, వస్త్రాలను అందజేసినట్లు తెలిపారు. అలాగే, మహిళకు కాన్పు చేసిన ఆర్టీసీ సిబ్బందిని మరోసారి అభినందించారు.

News June 22, 2024

మీ పార్టీ కార్యాలయాల సంగతేంటి చంద్రబాబూ?: వైసీపీ

image

AP: విశాఖ వైసీపీ కార్యాలయానికి GVMC అనుమతులు లేవంటూ TDP చేసిన విమర్శలకు ఆ పార్టీ Xలో కౌంటర్ ఇచ్చింది. ‘కేబినేట్ అనుమతితో విశాఖలో YCP ఆఫీసుకు స్థలం లీజుకి తీసుకున్నారు. అసలు ఆ GO ఇచ్చింది గత మీ ప్రభుత్వమే. రాష్ట్రవ్యాప్తంగా లీజుతో నడుస్తున్న మీ కార్యాలయాల సంగతేంటి? మీ కుటిల రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు చంద్రబాబు’ అని పేర్కొంది. TDP ఆఫీసులకు స్థలాలు కేటాయించిన GOల వివరాలను పోస్టు చేసింది.

News June 22, 2024

రికార్డు స్థాయిలో ‘కల్కి’ ప్రీరిలీజ్ బిజినెస్!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ ఫిల్మ్ ‘కల్కి’ రిలీజ్‌కు ముందే భారీగా వసూళ్లు రాబడుతోంది. ఈనెల 27న రిలీజ్ కానుండగా రూ.385 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు సినీవర్గాల సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో రూ.180 కోట్లు, హిందీలో రూ.85 కోట్లు, కర్ణాటకలో రూ.28 కోట్లు, తమిళనాడులో రూ.16 కోట్లు, కేరళలో రూ.6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.70 కోట్ల బిజినెస్ జరిగిందట. ప్రభాస్ కెరీర్‌లో ఇదే అత్యధికం.

News June 22, 2024

NEET పేపర్ లీక్‌పై కేంద్రం విచారణ జరుపుతోంది: MP రఘునందన్

image

TG: NEET పేపర్ లీక్‌పై కేంద్రం విచారణ జరుపుతోందని BJP MP రఘునందన్ వెల్లడించారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రతిపాదించిన ఐటీఐఆర్ ప్రాజెక్టును మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఐటీఐఆర్ కింద ప్రతిపాదించిన అన్ని పనులను కేంద్రం పూర్తి చేసిందని తెలిపారు. అటు KCRపైనా ఆయన విమర్శలు చేశారు. గొర్రెల స్కాం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్ ఇంటికి ED అధికారులు రాక తప్పదని జోస్యం చెప్పారు.

News June 22, 2024

వైసీపీ విశాఖ ఆఫీసుకు నోటీసులు.. ఎందుకంటే?

image

AP: విశాఖ ఎండాడలోని సర్వే నంబర్ 175/4లో 2 ఎకరాల స్థలంలో వైసీపీ కార్యాలయాన్ని నిర్మించింది. GVMCకి కాకుండా VMRDAకు దరఖాస్తు చేసుకున్నారని, అక్కడా సరైన అనుమతులు రాకుండానే నిర్మాణాలు పూర్తి చేశారని తాజాగా నోటీసులు జారీ అయ్యాయి. భవనానికి సంబంధించిన అనుమతులు, ఇతర విషయాలపై జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు వివరణ కోరారు. వారం రోజుల్లో స్పందించకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News June 22, 2024

అసెంబ్లీ నిరవధిక వాయిదా

image

AP: అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఈరోజు సమావేశం ప్రారంభం కాగానే స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు మంత్రులు పలు అంశాలపై సభలో మాట్లాడారు. కాగా ఈరోజు వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరయ్యారు.